అన్వేషించండి

Monsoon Driving Safety Tips In Telugu: భారీ వర్షాల్లో మీ ప్రయాణం సురక్షితమేనా? వైపర్స్‌, బ్రేక్స్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

Driving Tips: వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వైపర్స్, బ్రేక్స్‌ పనితీరుపై అవగాహన ముఖ్యం. డ్రైవర్లు చేసే ప్రాణాంతక తప్పులు, సురక్షిత ప్రయాణానికి అవసరమైన విషయాలు గురించి ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షంలో రోడ్లు జారుడుగా, తక్కువ దృశ్యమానతతో ప్రమాదాలు పెరుగుతాయి.
  • వైపర్లు, బ్రేకులు సరైన నిర్వహణ లేకుంటే ప్రమాదాలు అధికం.
  • తక్కువ వేగం, దూరం, సరైన లైట్లు సురక్షిత డ్రైవింగ్‌కు అవసరం.

Monsoon Driving Safety Tips In Telugu: రుతుపవానాల రాకతో ప్రకృతి పులకించినప్పటికీ, వాహనదారులకు మాత్రం వర్షాకాలం అత్యంత సవాలుతో కూడుకున్న సమయం. రోడ్డు చాలా జారుడుగా ఉంటాయి. గాలిలో తేమ వల్ల విజిబిలిటీ తగ్గడంతో ఈ సీజన్‌లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కారు ప్రయాణం క్షేమంగా సాగాలంటే విజిబిలిటీని ఇచ్చే వైపర్స్, కారును నియంత్రించే బ్రేక్స్‌ అత్యంత కీలకం. అయితే చాలా మంది డ్రైవర్లు తెలియక చేసే చిన్న పొరపాటు ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి. 

విండ్‌షీల్డ్ వైపర్స్‌ విషయంలో తెలిసే ప్రధాన తప్పులు

వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడమే మెజారిటీ ప్రమాదాలకు కారణం. వైపర్ల నిర్వహణలో డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండే అంశాలు ఇవే. వేసవి ఎండలకు వైపర్ల రబ్బర్ గట్టిపడిపోతుంది. వీటిని మార్చకుండా వర్షాకాలంలో వాడితే అవి నీటిని సరిగా తుడవకపోగా విండ్ షీల్డ్ గ్లాస్‌పై గీతలు పడేలా చేస్తాయి. ఇది రాత్రి పూట ప్రయాణంలో ఎదురుగా వస్తున్న వాహనాల కాంతితో ఇబ్బంది పడేలా చేస్తుంది. 
వర్షం తీవ్రతను బట్టి వైపర్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేయడం తప్పనిసరి. వర్షం తక్కువగా ఉన్నప్పుడు హైస్పీడ్ వాడితే గ్లాస్ పొడిగా మారి మోటార్‌ పాడవుతుంది. అదే భారీ వర్షంలో తక్కువ స్పీడ్‌ వాడితే విజిబిలిటీ దెబ్బతింటుంది. కేవలం నీటితో గ్లాస్‌ క్లీన్ చేయడం వల్ల రోడ్డుపై ఉండే ఆయిల్ జిడ్డు వదలు. విండ్‌షఈల్డ్‌ వాషర్‌ ట్యాంక్‌లో నాణ్యమైన క్లీనర్‌ లిక్విడ్‌ ఉండేలా చూసుకోవాలి. 

బ్రేక్ నిర్వహణలో ప్రాణాలకు ముప్పు తెచ్చే విషయాలు ఇవే 

తడి రోడ్డుపై బ్రేకింగ్‌ దూరం గణనీయంగా పెరుగుతుంది. అంటే పొడి రోడ్డుపై కంటే తడి రోడ్డుపై కారు ఆగడానికి ఎక్కువ సమయం, దూరం తీసుకుంటుంది. భారీ వర్షంలో వెళ్లేట్పుడు బ్రేక్‌ను ఒకసారిగా తొక్కడం వల్ల టైర్లు లాక్ అయి కారు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. రోడ్డుపై నిలిచిన నీటిపై వేగంగా వెళ్లినప్పుడు టైర్లకు రోడ్డుకు మధ్య నీటి పొర ఏర్పడి కారు గాలిలో తేలినట్టు అవుతుంది. ఈ సమయంలో బ్రేక్ వేస్తే కారు నియంత్రణ కోల్పోయి గుండ్రంగా తిరుగుతుంది. మోకాళ్ల లోతు నీటిలో కారు నడిపినప్పుడు బ్రేక్‌ ప్యాడ్స్‌లోకి నీరు చేరుతుంది. దీని వల్ల బ్రేక్ పవర్ తగ్గుతుంది. నీటి నుంచి బయటకు రాగానే బ్రేక్‌ను లైట్‌గా పంప్‌ చేయడం ద్వారా వేడి పుట్టి నీరు ఆవిరైపోతుంది. 

వర్షాకాలంలో డ్రైవింగ్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఏం చేయాలి ? ఏం చేయకూడదు 
సాధారణ స్పీడ్‌ కంటే 20-30 కిలోమీటర్లు తక్కువ వేగంతో వెళ్లండి     అత్యవసరమైతే తప్ప బ్రేక్‌ను గట్టిగా ప్రెస్ చేయొద్దు
అద్దాలపై పొగమంచు కమ్మకుండా ఏసీ/డీఫాగర్ ఆన్ చేయండి   వర్షంలో క్రూయిజ్ కంట్రోల్ వాడితే బ్రేకింగ్ ఆలస్యమవుతుంది. 
ముందు వాహనానికి కనీసం తగినంత దూరం పాటించాలి భారీ వర్షంలో హైబీమ్ వేస్తే లైట్ వేస్తే విజిబిలిటీ తగ్గుతుంది

టైర్‌లపై ఉండే గీతలు కనీసం 2ఎంఎం లోతు ఉండాలి. అరిగిపోయిన టైర్లు వర్షంలో గ్రిప్ కోల్పోయి బ్రేక్ వేసినా కారు ఆగకుండా ముందుకు జారిపోతాయి. చాలా మంది వర్షంలో డ్రైవింగ్ చేస్తూ హజార్డ్ లైట్లు ఆన్ చేస్తారు. ఇది తప్పుడు పద్ధతి. హజార్డ్‌ లైట్లు కేవలం కారు బ్రేక్‌డౌన్ అయినప్పుడు లేదా రోడ్డు పక్కన ఆపినప్పుడు మాత్రమే వాడాలి. ప్రయాణంలో ఫాగ్ లైట్లు లేదా లో బీమ్‌ హెడ్‌లైట్లు మాత్రమే వాడటం సురక్షితం. 

వర్షాకాలంలో కారు మెకానిక్‌ కండిషన్ ఎంత ముఖ్యమో, మన డ్రైవింగ్ స్టైల్ అంతే ముఖ్యం. వైపర్ల బ్లేడ్‌లు మార్పు బ్రేకులను సున్నితంగా ఆపరేట్ చేయడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు. 

Frequently Asked Questions

వర్షాకాలంలో డ్రైవింగ్ ఎందుకు సవాలుగా ఉంటుంది?

రోడ్లు జారుడుగా ఉంటాయి, గాలిలో తేమ వల్ల విజిబిలిటీ తగ్గుతుంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.

వర్షంలో వైపర్‌ల విషయంలో డ్రైవర్లు చేసే ప్రధాన తప్పులు ఏమిటి?

ఎండకు గట్టిపడిన వైపర్‌లను మార్చకపోవడం, వర్షం తీవ్రతకు తగ్గట్టు వేగం సర్దుబాటు చేయకపోవడం వంటివి సాధారణ తప్పులు. నాణ్యమైన క్లీనర్ లిక్విడ్ వాడాలి.

వర్షాకాలంలో బ్రేకులను ఎలా ఉపయోగించాలి?

తడి రోడ్డుపై బ్రేకింగ్ దూరం గణనీయంగా పెరుగుతుంది. భారీ వర్షంలో బ్రేక్‌ను ఒకేసారి గట్టిగా తొక్కకుండా జాగ్రత్త పడాలి.

వర్షంలో టైర్ల గ్రిప్ తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

టైర్లపై ఉండే గీతలు కనీసం 2ఎంఎం లోతు ఉండాలి. అరిగిపోయిన టైర్లు వర్షంలో గ్రిప్ కోల్పోయి బ్రేక్ వేసినా కారు ఆగకుండా ముందుకు జారిపోతాయి.

వర్షాకాలంలో హజార్డ్ లైట్లు వాడటం సరైన పద్ధతా?

కాదు. హజార్డ్ లైట్లు కారు బ్రేక్‌డౌన్ అయినప్పుడు లేదా రోడ్డు పక్కన ఆపినప్పుడు మాత్రమే వాడాలి. ప్రయాణంలో ఫాగ్ లేదా లో బీమ్ హెడ్‌లైట్లు సురక్షితం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget