అన్వేషించండి

ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!

వర్షాకాలంలో బైక్ లేదా స్కూటర్ నడిపేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన భద్రత సూచనలు ఇవే. టైర్ల నిర్వహణ నుంచి బ్రేకింగ్ టెక్నిక్ వరకు తెలుసుకుని మాన్సూన్‌లో సురక్షితంగా ప్రయాణించండి.

Monsoon bike riding safety tips: వర్షాకాలం ప్రారంభమైంది. రోజూ బైక్ లేదా స్కూటర్‌పై ఆఫీస్, కాలేజ్ లేదా ఇతర పనుల కోసం ప్రయాణించే వారికి ఇది కాస్త సవాలుతో కూడుకున్న సమయం. తడి రోడ్లు, తక్కువ విజిబిలిటీ, అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు ప్రమాదావకాశాలను పెంచుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాన్సూన్‌లో కూడా సురక్షితంగా & సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

1. ప్రయాణానికి ముందు బైక్ పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా టైర్ల స్థితి చాలా కీలకం. టైర్లపై ఉన్న ట్రెడ్ అరిగిపోయి ఉంటే వెంటనే మార్చడం మంచిది. తడి రోడ్లపై నీటిని బయటకు పంపడంలో ట్రెడ్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే టైర్ల సైడ్‌వాల్‌లపై చిన్న పగుళ్లు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

2. టైర్ ప్రెషర్‌ను కూడా సరిగ్గా ఉంచాలి. వర్షాకాలంలో తయారీ సంస్థ సూచించిన స్థాయి కంటే ఒకటి లేదా రెండు PSI తక్కువగా ఉంచితే రోడ్డు మీద టైర్ గ్రిప్ మెరుగుపడుతుంది. అయితే మరీ తక్కువ చేయడం ప్రమాదకరం.

3. వర్షంలో తడవకుండా ఉండేందుకు మంచి నాణ్యత గల రెయిన్ కోట్‌ ఉపయోగించడం అవసరం. రైడింగ్ సమయంలో శరీరం పొడిగా & వెచ్చగా ఉంటే రోడ్డుపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. అలాగే వాటర్‌ప్రూఫ్ బూట్లు ఉపయోగించడం వల్ల కాళ్లు తడవకుండా ఉంటాయి.

4. వర్షాకాలంలో విజిబిలిటీ పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే ప్రకాశవంతమైన రంగుల రెయిన్‌కోట్ లేదా రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉన్న గేర్ ధరించడం మంచిది. హెల్మెట్‌కు క్లియర్ వైజర్ ఉపయోగించాలి. గీతలు పడిన లేదా మసకబారిన వైజర్ ఉంటే వెంటనే మార్చడం ఉత్తమం.

5. రోడ్డుపై ప్రయాణించే సమయంలో ప్రతి చర్యను నెమ్మదిగా & సున్నితంగా చేయాలి. ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెంచడం, గట్టిగా బ్రేక్ వేయడం లేదా ఆకస్మికంగా మలుపు తిప్పడం వల్ల టైర్ల గ్రిప్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

6. ABS ఉన్న బైక్‌లలో బ్రేకింగ్ కొంత భద్రంగా ఉన్నప్పటికీ, బ్రేక్‌లను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తడి రోడ్లపై ముందు & వెనుక బ్రేక్‌లను సమతుల్యంగా ఉపయోగించాలి. దీంతో ఏ ఒక్క టైర్‌పై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది.

7. రోడ్డుపై ఉన్న జీబ్రా క్రాసింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు, మ్యాన్‌హోల్ కవర్లు వంటివి తడి వాతావరణంలో ఎక్కువ జారుడుగా మారుతాయి. వీలైనంత వరకు వాటిపై ప్రయాణించకుండా ఉండాలి. అలాగే లేన్ మధ్యలో కాకుండా ఇతర వాహనాల టైర్ ట్రాక్‌లలో ప్రయాణించడం మంచిది.

8. వర్షాకాలంలో వాహనాల మధ్య సాధారణం కంటే ఎక్కువ దూరం ఉంచాలి. దీనివల్ల బ్రేకింగ్ దూరం పెరుగుతుంది. ముందున్న వాహనం నుంచి వచ్చే నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

9. నీటితో నిండిన గుంతలను లేదా నిల్వ నీటిని వేగంగా దాటే ప్రయత్నం చేయకూడదు. వాటి లోతు ఎంత ఉందో తెలియకపోవచ్చు. తక్కువ వేగంతో, స్థిరమైన థ్రాటిల్‌తో దాటడం సురక్షితం.

10. మలుపుల వద్ద మరింత జాగ్రత్త అవసరం. పొడి రోడ్లతో పోలిస్తే తడి రోడ్లపై బైక్‌ను ఎక్కువగా వంచకూడదు. ముందుగానే వేగాన్ని తగ్గించి మలుపు తీసుకోవడం ఉత్తమం.

11. ప్రయాణం పూర్తైన తర్వాత కూడా బైక్ నిర్వహణను నిర్లక్ష్యం చేయకూడదు. వర్షాకాలంలో మట్టి & తేమ కారణంగా తుప్పు పట్టే అవకాశం ఎక్కువ. కాబట్టి తరచుగా బైక్‌ను శుభ్రం చేయాలి. ముఖ్యంగా చైన్‌ను కడిగి, బాగా ఆరిన తర్వాత లూబ్రికేట్ చేయాలి. దీంతో చైన్ జీవితం పెరగడంతో పాటు బైక్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

సరైన నిర్వహణ, జాగ్రత్తగా రైడింగ్ చేయడం & భద్రత నియమాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో కూడా ప్రమాదాల బెడద లేకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget