అన్వేషించండి

MG Windsor vs Tata Punch: కొత్త ఎంజీ విండ్సర్‌, టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌ కార్లలో ఏదీ కొంటే బెటర్‌?

MG Windsor EV:ఎంజీ విండ్సర్‌ ఎలక్ట్రిక్‌ కొద్ది రోజుల క్రితమే మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ కారు నేరుగా టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీని ఇస్తుంది. ఈ రెండు కార్లకు సంబంధించిన కీలక తేడాలపై ఓ లుక్కేయండి!

MG Windsor EV Vs Tata Punch EV: తాజాగా ఎంజీ మోటార్స్‌ నుంచి విండ్సర్ ఈవీ మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ కారు మార్కెట్‌లోని టాటా కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ కారుని చాలా తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్స్‌ అందించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిడిల్‌ క్లాస్‌ కస్టమర్లను సైతం ఆకట్టుకునేలా ఈ కారుని కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ కారులోని బ్యాటరీకి అద్దె ప్రతిపాదికన చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీకు అదనపు ఖర్చుగా అవుతుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ .3.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ .9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.  ఈ కారుని కొనుగోలు చేసిన 3 సంవత్సరాల తర్వాత బైబ్యాక్ ప్లాన్‌లో భాగంగా 60 శాతం సొమ్ముని తిరిగి పొందవచ్చు. ఈ కారుకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న టాటా పంచ్‌కి ఈ సరికొత్త ఈవీకి మధ్య ఉండే కీలక తేడాలపై ఓ లుక్కేయండి.

డిజైన్‌లో ఏది పెద్దది?

సరికొత్త విండ్సర్ ఈవీ 4295 మిమీ పొడవు, 2126 మిమీ వెడల్పుతో వస్తుంది. అదే టాటా పంచ్‌ ఈవీ 3857 మిమీ పొడవు, 1742 మిమీ వెడల్పుతో పరిమాణంలో ఎంజీతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఏరో ఎఫిషియెన్సీ వీల్స్, లైట్ బార్లను కలిగి ఉన్నాయి. విండ్సర్ ఈవీ సరికొత్త అవతారంలో CUV (క్రాసోవర్ యుటిలిటీ వెహికిల్‌)గా వస్తుంది. టాటా పంచ్ ఈవీ మినీ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంది. ఇక పంచ్ ఈవీ 2445 మిమీ వీల్‌బేస్‌, విండ్సర్ ఈవీ 2700 మిమీ వీల్ బేస్‌తో వస్తుంది. 

ఏ కారులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?

విండ్సర్‌ ఈవీలో పవర్డ్ డ్రైవర్ సీటు, 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్‌, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఫిక్స్డ్ గ్లాస్ పనోరమిక్ రూఫ్, 135 డిగ్రీల రెక్లైన్‌ రియర్ సీట్ల టెక్నాలజీతో వస్తుంది. ఇక పంచ్ ఈవీలో వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, స్టాండర్డ్ సన్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25 అంగుళాల స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


ఏ కారు ఎక్కువ రేంజ్ అందిస్తుంది?


ఎంజీ విండ్సర్ 38 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. అయితే ఇది 331 కి.మీ రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలోని సింగిల్ ఫ్రంట్ మోటార్ 136 bhp పవర్, 200 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 25 కిలోవాట్ల బ్యాటరీ  315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ 421 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని మోటార్ 122 bhp పవర్‌, 190 nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. 

ఏ కారు కొంటే బెటర్‌?

పంచ్ ఈవీ ధర రూ .9.99 లక్షల నుంచి రూ .13.7 లక్షల (ఎక్స్-షోరూమ్‌) మధ్య ఉండగా.. ఎంజి విండ్సర్ ప్రారంభ ధర రూ .9.99 లక్షలు లేదా బ్యాటరీ ఖర్చుతో సుమారు రూ .12 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో అందుబాటులో ఉంటుంది. పంచ్ ఈవీ ఎక్కువ రేంజ్‌ని అందిస్తుంది. అయితే విండ్సర్ ఈవీలో బూట్‌ స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక దీనిలోని ఫీచర్లు, బిగ్‌ ఇంటీరియర్ స్పేస్‌తో పాటు బైబ్యాక్ స్కీమ్స్‌ అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. కావున సరికొత్త ఎంజీ ఎలక్ట్రిక్‌ కారుని నిరభ్యంతరంగా ట్రై చేయవచ్చు.

 

టాప్ హెడ్ లైన్స్

మైండ్ బ్లోయింగ్ Hero Xoom స్కూటర్ రూ.78 వేలకే.. దీని లోన్‌ వివరాలు, EMI లెక్కలు తెలుసుకోండి
నెలకు కేవలం రూ.1800 కట్టగలిగితే స్టైలిష్‌ స్కూటర్‌ Hero Xoom మీదవుతుంది!
మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?
HF Deluxe నుంచి Xtreme 125R వరకు.. రూ.1 లక్షలోనే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కొనబోతున్నారా? కొత్త ధరలు వచ్చేశాయ్.. ఏ వేరియంట్ ఎంతంటే?
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ పెట్రోల్, CNG వేరియంట్ల ధరలు ఇవే.. రూ.5.99 లక్షలకు ఈ కారు మీదే!
రూ.2 లక్షలు కట్టి Toyota Glanza తీసుకుంటే, 5 లేదా 6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌లో ఎంత EMI కట్టాలి?
రూ.6.73 లక్షలకే టయోటా ప్రీమియం కారు.. Toyota Glanza ఆన్‌రోడ్‌ ధర, ఏడేళ్ల EMI లెక్క చూశారా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Chandrababu Warning: రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
BJP MLAs Tractor Rally: అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
Vaddera Quarry: వడ్డెరలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. క్వారీపూల్‌గా 100 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయింపు
వడ్డెరలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. క్వారీపూల్‌గా 100 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయింపు
Embed widget