అన్వేషించండి

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?

భారత్‌లో MG ఆస్టర్ విక్రయాలు నిలిచిపోతున్నాయి. అమ్మకాలు తక్కువగా ఉండటం, పరిమిత ఇంజిన్ ఆప్షన్లు, పోటీ మధ్య కంపెనీ దీని స్థానంలో సరికొత్త మోడల్‌ తీసుకురావాలని కంపెనీ చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత మార్కెట్లో MG ఆస్టర్ అమ్మకాలు నిలిపివేశారు.
  • తక్కువ విక్రయాలు, పరిమిత ఇంజిన్ ఎంపికలు కారణం.
  • పోటీదారుల మధ్య ఆకట్టుకోలేక 2021లో ప్రారంభమైంది.
  • 2027లో కొత్త SUVని ప్రవేశపెట్టాలని MG యోచిస్తోంది.

భారత మార్కెట్లో మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ (Kia Seltos) వంటి కార్లకు పోటీగా వచ్చింది MG Astor. కానీ ఈ కారు ఇప్పుడు భారత మార్కెట్ కనుమరుగవుతోంది. అక్టోబర్ 2026 నివేదికల ప్రకారం, డీలర్ వర్గాల సమాచారం మేరకు JSW MG మోటార్ ఇండియా ఆస్టర్ అమ్మకాలు నిలిపివేసింది. ఈ SUV 2021లో మన దేశంలో లాంచ్ అయింది. ప్రీమియం కేబిన్, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో కస్టమర్లకు ఆకర్షించింది. 

ఈ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఇది వినియోగదారుల్లో బలమైన ముద్రను వేయలేకపోయింది. దాంతో సెప్టెంబర్ 2025 నుండి సెప్టెంబర్ 2026 మధ్య దీని సగటు నెలవారీ విక్రయాలు కేవలం 112 యూనిట్లు మాత్రమే. ఇంత తక్కువగా అమ్మకాలు జరుగుతుందడటంతో అమ్మకాలు నిలిపివేస్తున్నారు. 

తక్కువ అమ్మకాలే అతిపెద్ద సమస్య

MG ఆస్టర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే సమయంలో దీని ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ పేర్కొంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, వంటి ఫీచర్లు ఇచ్చారు. కానీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఇతర పోటీదారుల మధ్య దీని అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు దాదాపు ఏడాదిపాటు ఎంజీ ఆస్టర్ సగటు నెలవారీ విక్రయాలు 112 యూనిట్లుగా ఉన్నాయి. ఇంత తక్కువ అమ్మకాలతో మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. అయినప్పటికీ, కంపెనీ దీని విక్రయాల నిలిపివేతకు కారణాలు చెబుతూ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తక్కువ అమ్మకాలే అందుకు కారణంగా భావించవచ్చు.

Also Read: ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్

ఇంజిన్ ఆప్షన్లలోనూ వెనుకబడిన ఆస్టర్

MG ఆస్టర్ మరో పెద్ద బలహీనత దీని పరిమిత ఇంజిన్ ఆప్షన్లు. ప్రారంభంలో ఈ SUV 2 పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది. ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 110 hp పవర్‌ ఇవ్వగా, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 hp పవర్‌ ఇచ్చేది. ఫిబ్రవరి 2025లో కంపెనీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను నిలిపివేయడం మరింత డ్యామేజీ చేసింది. ఆ తర్వాత ఆస్టర్‌లో కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారు.  ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చేది.

ఈ సెగ్మెంట్‌లోని ఇతర SUVలు పెట్రోల్‌తో పాటు డీజిల్, CNG, హైబ్రిడ్ వంటి ఆప్షన్లు అందిస్తున్నాయి. ఆస్టర్ క్రాసోవర్ వంటి డిజైన్ కూడా కొందరు వినియోగదారులకు తమ పోటీదారుల కంటే చిన్నదిగా అనిపిస్తుంది. ఈ విషయాలు మార్కెట్లో దాని స్థానాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.

కొత్త SUVని తీసుకురానున్న కంపెనీ

MG ఆస్టర్ విక్రయాలు నిలిచిపోవడం అంటే మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ నుంచి బయటకు వెళ్లడం లేదు. నివేదికల ప్రకారం, MG దీనికి ప్రత్యామ్నాయంగా మరొక మోడల్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త SUVని 2027లో లాంచ్ చేయవచ్చు. ఈ కొత్త మోడల్ కంపెనీకి చెందిన SIGMA అంటే SAIC ఇంటెలిజెంట్ గ్లోబల్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లకు సపోర్ట్ చేయడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. దీని ద్వారా కొత్త మోడల్‌లో ఎక్కువ పవర్‌ట్రైన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో MG కంపెనీ కొత్త మిడ్ సైజ్ SUVకి సంబంధించి చర్చ జరుగుతోంది.

Also Read: MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!

Frequently Asked Questions

ఎంజీ ఆస్టర్ అమ్మకాలను ఎందుకు నిలిపివేశారు?

తక్కువ అమ్మకాలే దీనికి ప్రధాన కారణం. సెప్టెంబర్ 2025 నుండి సెప్టెంబర్ 2026 మధ్య దీని సగటు నెలవారీ విక్రయాలు కేవలం 112 యూనిట్లు మాత్రమే.

ఎంజీ ఆస్టర్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అయింది?

ఎంజీ ఆస్టర్ 2021లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇది ప్రీమియం కేబిన్, ఆధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షించింది.

ఎంజీ ఆస్టర్ ఇంజిన్ ఆప్షన్‌లలో వెనుకబడటానికి కారణం ఏమిటి?

ఆస్టర్ ప్రారంభంలో రెండు పెట్రోల్ ఇంజిన్‌లతో వచ్చింది. ఫిబ్రవరి 2025లో 1.3 లీటర్ టర్బో ఇంజిన్‌ను నిలిపివేశారు, కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే మిగిలింది.

ఎంజీ ఆస్టర్ తర్వాత కంపెనీ కొత్త SUVని విడుదల చేస్తుందా?

అవును, నివేదికల ప్రకారం, ఎంజీ 2027లో SIGMA ప్లాట్‌ఫారమ్‌పై పనిచేసే కొత్త మిడ్-సైజ్ SUV మోడల్‌ను తీసుకురావాలని చూస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Embed widget