అధిక మైలేజ్‌తో ఆశ్చర్యపరుస్తున్న SUV కారు MG హెక్టార్ టోమాహాక్ PHEV. ఇది ఒకసారి ఫుల్ ట్యాంక్, ఫుల్ ఛార్జ్ చేస్తే 1100 కి.మీ. కంటే ఎక్కువ ప్రయాణిస్తుంది.
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
MG Hector టోమాహాక్ PHEV మార్కెట్లో విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఫుల్ ట్యాంక్, సింగిల్ ఛార్జ్‌పై 1100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుండగా. ఈ కారు ప్రత్యేకతలు, సేఫ్టీ వివరాలు తెలుసుకోండి.

- నిత్యావసరాలు, ఇంధన ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో అద్భుతమైన మైలేజ్ వాహనాలకు డిమాండ్.
- ఎంజీ హెక్టార్ టోమాహాక్ PHEV 1100 కి.మీ. రేంజ్, శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది.
- ఆకట్టుకునే డిజైన్, 7-సీటర్ సౌలభ్యం, అధునాతన టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
- భారీ డిమాండ్, రికార్డు బుకింగ్స్, ప్రారంభ ధర రూ. 25.69 లక్షలు (ఎక్స్-షోరూమ్).
నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చులు భారంగా మారుతున్నాయి. దాంతో అద్భుతమైన మైలేజ్ ఇచ్చే కారు కొనాలని చూస్తున్నారు. అందుకే ప్రస్తుతం చిన్న కార్ల విక్రయాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో ఒక SUV కారు అధిక మైలేజ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. వాహనదారులు ఈ కారును విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ SUV ఇటీవలే లాంచ్ అయిన MG హెక్టార్ టోమాహాక్ PHEV అని చెప్పవచ్చు.
ఈ ఎంజీ హెక్టార్ SUV ఒకసారి ఫుల్ ట్యాంక్, ఫుల్ ఛార్జ్ చేస్తే 1100 కిలోమీటర్ల కంటే ఎక్కువ జర్నీ వెళ్లేందుకు సరిపోతుంది. ఆకట్టుకునే లుక్, పెద్ద కేబిన్, భారీ బుకింగ్స్ కారణంగా ఈ SUV ప్రస్తుతం ఆటో మార్కెట్ వార్తల్లో నిలుస్తోంది. MGకి చెందిన ఈ కొత్త SUVలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
1100 కి.మీ లాంగ్ రేంజ్
MG హెక్టార్ టోమాహాక్ కారులో 1.5 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీనికి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. ఈ మొత్తం సిస్టమ్ కలిపి దాదాపు 198 bhp పవర్, మంచి టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారు కేవలం బ్యాటరీపై దాదాపు 115 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అలాగే పెట్రోల్, బ్యాటరీ రెండూ కలిపితే మొత్తం డ్రైవింగ్ రేంజ్ 1100 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో 25 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో బ్యాటరీ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.
అద్భుతమైన SUV డిజైన్
ఈ SUV ఎంతో మస్కులర్‌గా, రోడ్డుపై ఎంతో గ్రాండ్ లుక్ ఇస్తుంది. దీని ముందు భాగంలో పెద్ద డార్క్-క్రోమ్ గ్రిల్, షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు, బెస్ట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇవి దీనికి స్టాండర్డ్ మోడల్ కంటే ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. కేబిన్ లోపలికి అడుగుపెట్టగానే స్పేస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ కారు 7 సీటర్ లేఅవుట్‌తో వచ్చింది. దీంతో భారత్‌లో చిన్న, కొంచెం పెద్ద కుటుంబాలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కారుగా మారుతుంది. దీనికి తోడు సౌకర్యవంతమైన వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మంచి లెగ్‌రూమ్ లాంగ్ జర్నీలను ఎంతో హాయిగా మారుస్తాయి.
కారులో అద్భుతమైన ఫీచర్లు
MGకి చెందిన ఈ SUV ఫీచర్ల విషయంలో బెస్ట్ అనిపింంచుకుంటుంది. దీని డాష్‌బోర్డ్‌పై పెద్ద 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. కారు లోపల అద్భుతమైన సౌండ్ అనుభూతి కోసం 10 స్పీకర్ల ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ అందించారు. సేఫ్టీ విషయానికొస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS టెక్నాలజీ ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి.
వాహనానికి భారీ డిమాండ్
ఈ ఎంజీ హెక్టార్ SUV భారత్‌లో లాంచ్ అయినప్పటి నుంచి మంచి క్రేజ్ కనిపిస్తోంది. దీని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వేరియంట్లకు మొదట్లోనే రికార్డు స్థాయి బుకింగ్స్ వచ్చాయి. ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.25.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ. 30.22 లక్షల నుంచి రూ. 34.91 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ వినియోగదారులకు 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BaaS) ఆప్షన్ ఇస్తోంది. దాంతో మీ కారు ధర భారీగా తగ్గుతుంది. సర్వీసు ప్రకారం నెలవారీ ఛార్జీలు చెల్లించుకోవాలి.
Frequently Asked Questions
అధిక మైలేజ్‌తో ఆశ్చర్యపరుస్తున్న SUV కారు ఏది?
MG హెక్టార్ టోమాహాక్ PHEV కారు మొత్తం ఎంత దూరం ప్రయాణించగలదు?
MG హెక్టార్ టోమాహాక్ PHEV పెట్రోల్, బ్యాటరీ రెండూ కలిపి మొత్తం 1100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కేవలం బ్యాటరీపై దాదాపు 115 కిలోమీటర్లు వెళ్తుంది.
MG హెక్టార్ టోమాహాక్ SUVలో ఎలాంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి?
ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 10 స్పీకర్ల ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
MG హెక్టార్ టోమాహాక్ PHEV కారు సీటింగ్ కెపాసిటీ ఎంత?
ఈ కారు 7 సీటర్ లేఅవుట్‌తో వచ్చింది. దీంతో చిన్న, కొంచెం పెద్ద కుటుంబాలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కారుగా మారుతుంది.
MG హెక్టార్ టోమాహాక్ PHEV ప్రారంభ ధర ఎంత?
ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.25.69 లక్షల నుంచి మొదలవుతుంది. కంపెనీ 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BaaS) ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు























