అన్వేషించండి

Longest Range EV India 2026: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్‌ నుంచి వైజాగ్ నాన్‌స్టాప్‌ ప్రయాణం! అత్యధిక రేంజ్ ఈవీ కారు తీసుకొచ్చిన మర్సిడెస్ బెంజ్!  

Longest Range EV : మర్సిడెస్ బెంజ్‌ CLA 250+ ఎలక్ట్రిక్ కారు 85kWh బ్యాటరీతో 792 కిలోమీటర్ల క్లెయిమ్డ్‌ రేంజ్ అందిస్తోంది. దీని వాస్తవ పనితీరు, టెక్నాలజీ, లాంగ్ డ్రైవ్ సామర్థ్యం గురించి స్పెషల్ స్టోరీ. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెర్సిడెస్ బెంజ్ CLA 250+ లాంగ్ డ్రైవ్‌ల కోసం ప్రత్యేక ఈవీ.
  • 85kWh బ్యాటరీ, అధునాతన టెక్నాలజీతో అధిక వాస్తవ రేంజ్.
  • 272BHP మోటార్ స్పోర్ట్స్ కారు అనుభూతి, యువతకు ఆదర్శం.

Longest Range EV India 2026: భారత్ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరు పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం నగరాల ప్రయాణాలకే పరిమితం అనుకున్న ఈవీలు, ఇప్పుడు లాంగ్ డ్రైవ్‌లకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు లైవ్ ఎగ్జాంపుల్ మర్సిడెస్ బెంజ్ తీసుకొచ్చిన CLA 250+. పెట్రోల్‌, డీజిల్ ధరల భారం నుంచి ఉపశమనం కోరుకునే విలాసవంతమైన కార్ల ప్రియులకు ఇది ఒక గేమ్‌ ఛేంజర్‌కానుంది. 

కంపెనీ చెబుతుంది 792 కిలోమీటర్ల రేంజ్

మర్సిడెస్ బెంజ్‌ CLA 250+ కేవలం ఒక లగ్జరీ కారు మాత్రమే కాదు. ఇది ఇంజినీరింగ్ అద్భుతం. ఇందులో 85kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. కంపెనీ అధికారికంగా 792కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది సులభంగా 550 నుంచి 600 కిలోమీటర్ల వాస్తవ రేంజ్ అందిస్తుంది. 

టెస్టులో అదిరిపోయే రిజల్ట్స్

సాధారణంగా ఈవీ రేంజ్ విషయంలో వినియోగదారుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయి పరీక్షల్లో ఈ కారు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. బ్యాటరీ 84 శాతం ఉన్నప్పుడు కూడా డిస్‌ప్లే పై 530 కిలోమీటర్లు రేంజ్ కనిపించడం దీని సామర్థ్యానికి నిదర్శనం. అంటే మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే ఎక్కడా ఛార్జింగ్ కోసం ఆగాల్సిన పని లేదు. 

టెక్నాలజీలోనూ అడ్వాన్స్డ్‌

కేవలం పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల మాత్రమే ఎక్కువ రేంజ్ రావడం లేదు. దీని వెనుక మర్సిడెస్ వాడిన అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఈ కారు గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా అత్యంత నునువుగా రూపొందించారు. దీని వల్ల డ్రాగ్ తగ్గి, బ్యాటరీ వినియోగం ఆదా అవుతుంది. 

బ్రేక్ వేసినా, యాక్సలరేటర్ నొక్కినా ఛార్జింగ్

సాధారణం ఈవీల్లో సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్న టూ స్పీడ్ గేర్ బాక్స్ హైవేలపై ప్రయాణించేటప్పుడు మోటార్‌ సామర్థ్యాన్ని పెంచి, పవర్‌ను ఆదా చేస్తుంది.  డ్రైవర్ యాక్సిలరేటర్ వదిలినప్పుడు లేదా బ్రేక్‌ వేసినప్పుడు బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇందులో ఉన్న ఎకో మోడ్‌ ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుంది. 

నడుపుతుంటే స్పోర్ట్స్ కారు అనుభూతి

ఈ కారులో 272BHP శక్తిని సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది తక్షణ యాక్సిలరేషన్ అందిస్తుంది. దీని వల్ల స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతి కలుగుతుంది. హ్యాండ్లిగ్ పరంగా కూడా ఇది చాలా కచ్చితత్వంతో ఉంటుంది. అయితే కొన్ని ప్రతికూలతు ఉన్నాయి. దీని రైడ్ క్వాలిటీ కఠినంగా ఉంది. అలాగే వెనుక సీట్లలో కూర్చునే వారికి స్పేస్ తక్కువగా ఉంది. కాబట్టి ఇది ఫ్యామిలీ కారు కంటే కూడా టెక్నాలజీ ఇష్టపడే స్వయంగా డ్రైవింగ్ చేసే యువతకు నచ్చుతుంది. 

యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది

మీరు రోజూ ఆఫీస్‌కి వెళ్లడానికి లేదా అప్పుడప్పు లాంగ్ డ్రైవ్‌ కోసం ఈ కారు మంచి ఎంపిక,. నగరంలో వాడే వారికి నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు రేండ్ అంగ్జైటీ లేకుండా ప్రయాణించవచ్చు. 

Frequently Asked Questions

మెర్సిడెస్ బెంజ్ CLA 250+ భారతీయ రోడ్లపై ఎంత వాస్తవ రేంజ్ అందిస్తుంది?

కంపెనీ 792 కి.మీ. క్లెయిమ్ చేసినప్పటికీ, భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది సులభంగా 550 నుండి 600 కిలోమీటర్ల వాస్తవ రేంజ్ అందిస్తుంది.

CLA 250+ అధిక రేంజ్‌కు దోహదపడే సాంకేతిక అంశాలు ఏమిటి?

దీనిలో 85kWh బ్యాటరీ ప్యాక్, గాలిని చీల్చుకుంటూ వెళ్లే డిజైన్, టూ-స్పీడ్ గేర్ బాక్స్, రీజనరేటివ్ బ్రేకింగ్, ఎకో మోడ్ వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి.

మర్సిడెస్ బెంజ్ CLA 250+ ఎలాంటి వారికి అనుకూలంగా ఉంటుంది?

ఇది టెక్నాలజీ ఇష్టపడే యువతకు, స్వయంగా డ్రైవింగ్ చేసే వారికి నచ్చుతుంది. రోజూ ఆఫీస్‌కు లేదా లాంగ్ డ్రైవ్‌లకు ఇది మంచి ఎంపిక.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget