రూ.30 వేల జీతం ఉన్నా Maruti Wagon R కారును కొనవచ్చు, ఈఎంఐ ఎంత కట్టాలంటే
Maruti Wagon R on EMI: 11 వేరియంట్లలో లభిస్తుంది. VXI (పెట్రోల్) వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతుంది. EMI ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Maruti Wagon R Car Loan | మారుతీ వాగన్ ఆర్ తక్కువ ధరతో వస్తుంది. అధిక మైలేజ్ కారణంగా బాగా విక్రయాలు జరుగుతుంటాయి. మారుతి వాగన్ ఆర్ కారు 9 రంగులతో మార్కెట్లోకి వచ్చింది. Maruti Wagon R యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షల నుండి ప్రారంభం కాగా, రూ. 7.47 లక్షల వరకు ధర ఉంటుంది. మీరు ఈ మారుతీ బ్రాండ్ కారును మొత్తం నగదు చెల్లింపు చేయకుండా ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం, మీరు కారు లోన్, కారు ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి.
Maruti Wagon R ని EMI పై ఎలా కొనుగోలు చేయాలి
Maruti Wagon R కారు మొత్తం 11 వేరియంట్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు VXI (పెట్రోల్) వేరియంట్ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. Wagon R ఈ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 6.87 లక్షలు కాగా, ఈ కారును కొనడానికి, మీకు బ్యాంకు నుండి దాదాపు రూ. 6.18 లక్షల వరకు లోన్ వస్తుంది.
Maruti Wagon R కొనడానికి మీరు రూ. 69 వేల డౌన్‌పేమెంట్ కట్టాలి. ఈ Maruti కారును 4 సంవత్సరాల లోన్‌పై తీసుకుంటే బ్యాంకు ఈ లోన్‌పై 9 శాతం వడ్డీని విధిస్తే, మీరు 48 నెలల పాటు రూ. 15,400 EMI చెల్లించాల్సి ఉంటుంది. మీరు నెలకు రూ. 30 వేలు సంపాదించే వారైనా ఈ కారును EMI పై కొనుగోలు చేయవచ్చు.
కార్ లోన్ ఎంత లభిస్తుంది
మీరు Maruti Wagon R ని 5సంవత్సరాల కార్ లోన్‌పై తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 12,850 ఈఎంఐ చెల్లించాలి. Maruti కారును కొనుగోలు చేయడానికి 6 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు 72 నెలల పాటు ప్రతినెలా రూ. 11,200 బ్యాంకులో జమ చేయాలి. Maruti Wagon R ని 7 సంవత్సరాల లోన్‌పై తీసుకుంటే, 9 శాతం వడ్డీతో రూ. 9,950 EMI చెల్లించాల్సి ఉంటుంది.
Maruti Wagon R కొనడానికి, ఏదైనా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. కానీ లోన్ ఖరారు చేయడానికి ముందు, అన్ని డాక్యుమెంట్లను పూర్తిగా చదవడం ముఖ్యం. వివిధ నగరాలు, వివిధ బ్యాంకులను బట్టి ఈ గణాంకాల్లో వ్యత్యాసం ఉండవచ్చు అని కార్ సంస్థ సూచించింది.






















