అన్వేషించండి

Maruti Suzuki New Car Model Latest Updates: ఈ వారంలోనే మారుతి కొత్త మోడ‌ల్ లాంఛ్.. అదిరే ఫీచ‌ర్ల‌తో దుమ్ము రేపుతున్న కార్లు.. ఆ కంపెనీల‌కు గ‌ట్టి పోటి..

పండుగ సీజ‌న్ ద‌గ్గ‌రికి వ‌స్తుండ‌టంతో దిగ్గ‌జ కంపెనీలు త‌మ నూత‌న మోడ‌ళ్ల‌న ప్ర‌వేశ‌పెడుతున్నాయి. మారుతి సుజుకి కంపెనీ కొత్త మోడ‌ల్ ను తీసుకు వ‌చ్చింది. కాస్త పెద్ద సైజ్ లో ఉండే ఈ కారు వివ‌రాలు..

Maruti New car Launch Latest News:  దేశీయ దిగ్గ‌జ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మ‌రో వెహిక‌ల్ లాంచ్ కానుంది. కాస్త పెద్ద సైజ్ లో ఉండే ఈ వెహిక‌ల్ కాస్త ఎక్కువ మంది ప్ర‌యాణించేలా డిజైన్ చేయ‌బ‌డి ఉంద‌ని తెలుస్తోంది.   మారుతి ఈనెల‌ 3న కొత్త కాంపాక్ట్ SUVను విడుదల చేయనున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఇది మారుతి బ్రెజ్జా ,మారుతి గ్రాండ్ విటార మధ్యలో ప్లేస్ చేయబడుతుందని స‌మాచారం. కంపెనీ అరెనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడనుందని తెలుస్తోంది. తాజాగా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం దీన్ని ‘మారుతి విక్టోరిస్’గా పిలవవచ్చని అంచచ‌నా, కానీ అంత‌కుముందు దీనిని ‘మారుతి ఎస్కుడో’గా పిలవబోతున్నారని ప్రచారం జ‌రిగింది. మారుతి ఇంకా అధికారికంగా పేరు ప్రకటించకపోయినా, 'విక్టోరిస్ , 'ఎస్కుడో' పేర్లకు ఇండియాలో పేటెంట్ దాఖలు చేయ‌డంతో కొత్త మోడ‌ల్ కు ఈ రెండు పేర్ల‌లో ఏదో ఒక‌టి ఖరారు కానుంద‌ని తెలుస్తోంది. మారుతి కొత్త మోడ‌ల్ రెండు వరుసల కూర్చునే SUVగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇది గ్రాండ్ విటార కంటే కొంచెం పెద్దదిగా ఉండనుందని స‌మాచారం. హ్యూండాయ్ క్రెటా , కియా సెల్తోస్‌కు త‌గిన ప‌రిణామాలో ఉండి, వాటికి గ‌ట్టి పోటీనివ్వ‌నుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

స్టైలిష్ డిజైన్..
డిజైన్ పరంగా, దీనిలో క‌ర్వ్ డిజైన్ తోపాటు, స్ట్రెయిట్ బోనెట్, విటార తరహా స్లీక్ హెడ్‌లైట్ సెటప్, స్లిమ్ క్లాడింగ్, టాటా కర్వ్ మాదిరిగా స్లీక్ LED టెయిల్ లైట్స్ కనిపించొచ్చని తెలుస్తోంది. ఇంటీరియర్‌లో, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాడరన్ డాష్‌బోర్డ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ప్యానొరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ AC , వెంట్‌లేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముందని స‌మాచారం. సేఫ్టీ పరంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్‌గా), 360 డిగ్రీ కెమెరా ,కొన్ని ADAS ఫీచర్లు కూడా పొందుప‌రిచార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, గ్రాండ్ విటార లో ఉన్నట్లే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ , 1.5 లీటర్ పెట్రోల్+CNG వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. వీటి పవర్ ఔట్‌పుట్ వరుసగా 103 PS (మైల్డ్ హైబ్రిడ్), 116 PS (స్ట్రాంగ్ హైబ్రిడ్ కలిపి), 88 PS (CNG), టార్క్ 137 Nm, 141 Nm (హైబ్రిడ్), 121.5 Nm (CNG)గా ఉండే అవకాశం ఉంది. 

డ్యూయ‌ల్ సిలిండ‌ర్ సెట‌ప్..!
ట్రాన్స్మిషన్ విష‌యానికి వ‌స్తే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్,  e-CVTగా ఉంటాయని తెలుస్తోంది. CNG వేరియంట్‌లో, టాటా ,హ్యూండాయ్ కార్లలో ఉన్నట్లే డ్యూయల్ సిలిండర్ సెటప్ ఉండవచ్చని అంచనా. ధర విషయానికి వస్తే, ఇది అరెనా డీలర్‌షిప్‌లో అమ్ముడవ్వడం వల్ల గ్రాండ్ విటార (ధర రూ.11.42 లక్షలు నుండి రూ.20.68 లక్షల వరకు, ఎక్స్‌షోరూమ్) కన్నా కొంచెం తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హ్యూండాయ్ క్రెటా, కియా సెల్తోస్ వంటి మిడ్-సైజ్ SUVలకు గట్టి పోటీగా నిలవనుందని నిపుణులు అంచాన వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.2,399కే స్మార్ట్ డ్రైవింగ్ అనుభవం - జియో కార్ సింక్ డివైస్ ప్రత్యేకతలు ఇవే!
కేబుల్‌ కనెక్ట్‌ చేయకుండానే కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో - పాత కారు అవుతుంది స్మార్ట్‌
రియల్ వరల్డ్ మైలేజ్‌లో రెనాల్ట్ డస్టర్‌కు షాక్ ఇచ్చిన స్కోడా కుషాక్! సిటీ నుంచి హైవే వరకు ఇంధనం ఆదా!
రెనాల్ట్ డస్టర్ Vs స్కోడా కుషాక్: టర్బో పెట్రోల్ DCT SUVల్లో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?
వాహనదారులకు అలర్ట్! పెట్రోలు & డీజిల్ నాణ్యతను పరీక్షించే సింపుల్ టిప్స్ ఇవే
పెట్రోలు బంక్‌లో మోసపోవద్దు, కల్తీ ఇంధనాన్ని ఇలా సులభంగా గుర్తించండి!
బడ్జెట్‌లో EV కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపులో వచ్చే 8 ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్‌
మీ బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు - టాటా నుంచే 4 మోడళ్లు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Khushbu Sundar Daughter Wedding: ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News : 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
Embed widget