అన్వేషించండి

Renault Kiger Emi and Down Payment: అదిరే ఫీచ‌ర్ల‌తో ఇచ్చిప‌డేస్తున్న Renault కిగ‌ర్ ను సొంతం చేసుకోండిలా.. డౌన్ పేమెంట్, ఈఎంఐ బ్రేకప్ వివ‌రాలు..

ఇటీవల విడుద‌ల అయిన Renault కిగ‌ర్ మోడ‌ల్ ను ఈఎంఐ ప‌ద్ధ‌తిలో ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం.. కేవ‌లం ల‌క్ష డౌన్ పేమెంట్ క‌డితే చాలు, ఈ కారుని అతి త‌క్కువ ఈఎంఐతో ద‌క్కించుకోవ‌చ్చు.

Renault Kiger Latest News: కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ కడితే చాలు Renault కిగర్ ను సొంతం చేసుకోవచ్చు. అలాగే అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఈఎంఐ రూపంలో ఈ కారును ద‌క్కించుకోవ‌చ్చు. కిగ‌ర్ కార్ ను ల‌క్ష డౌన్ పేమెంట్ తోపాటు దాని ఈఎంఐ ఎలా ఉంటుందో వివ‌రంగా తెలుసుకుందాం..Renault 2025 కిగర్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఈ SUV ని Renault కంపెనీ నుండి వచ్చిన సబ్-4 మీటర్ల బడ్జెట్ ఫ్రెండ్లీ, స్టైలిష్ , ఫీచర్-రిచ్ వాహనంగా చెప్పుకోవ‌చ్చు.

కొత్తగా వచ్చిన ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ bold డిజైన్‌తో పాటు premium ఫీచర్లు ,advanced safety ప్యాకేజీతో ఆకట్టుకుంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ. 6.29 లక్షలు కాగా, హైదరాబాద్ లో దీని అన్-రోడ్ ధర సుమారు రూ. 7.25 లక్షలుగా ఉంటుంది, ఇందులో RTO రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జీలు మొదలైనవి కలుపుకొని ఉంటాయి. మీరు ఈ కారును కొనాలనుకుంటే, మీరు కనీసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మిగతా రూ. 6.25 లక్షలపై మీరు 5 సంవత్సరాల పాటు 9% వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ. 12,000 నుండి రూ. 13,000 మధ్య ఉండవచ్చును. అయితే ఈ EMI ఖచ్చితంగా మీరు తీసుకునే బ్యాంకు, మీ క్రెడిట్ స్కోరు , రుణ కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.

రెండు ఇంజిన్లు..
ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త Renault కిగర్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు లభిస్తున్నాయి. మొదటిది 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది సిటీలో సాఫీగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. రెండవది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఎక్కువ పవర్ , స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్లలో మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ సుమారు 19.83 కిలోమీటర్లు  ప్ర‌తి లీట‌రుకు మైలేజీ ఇస్తుంద‌ని తెలుస్తోంది. అలాగే టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 20.38 కిలోమీటర్లు లీటరుకు ఇస్తుందని తెలుస్తోంది.

అద్భుతమైన ఫీచర్లు..
ఫీచర్ల విషయానికి వస్తే, రెనో కిగర్  ప్రీమియం లుక్ లో  రూపొందించబడింది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్‌ప్లే, వైర్లెస్ మొబైల్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దాంతో పాటు, Renault భద్రత పరంగా కూడా ఈ మోడల్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఉంటాయి, అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీటు మౌంటులు, అలాగే ABS మరియు EBD వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి  Renault కిగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 మోడల్‌ ఒక బడ్జెట్‌లో లభించే, ఆకర్షణీయమైన, అధునాతన ఫీచర్లతో కూడిన పూర్తి భద్రత కలిగిన SUVగా నిలుస్తోంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ,  మారుతి ఫ్రాంక్స్ వంటి ప్రీమియం సబ్-కాంపాక్ట్ SUVలకు ఇది గట్టి పోటీనిస్తున్నది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget