అన్వేషించండి

Maruti Suzuki Victoris : మారుతి విక్టోరిస్ భద్రతలో టాప్ స్కోర్! 5-స్టార్ రేటింగ్‌తో సరికొత్త ఫీచర్స్, ధర కూడా తక్కువేనా?

Maruti Suzuki Victoris : మారుతి విక్టోరిస్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ కారు తాజాగా BNCAP నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Maruti Suzuki Victoris : మారుతి సుజుకి కంపెనీ నుంచి త్వరలో రాబోతున్న  విక్టోరిస్ సెక్యూరిటీ రేటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ కారు క్రాష్‌ టెస్టులో BNCAP నుంచి ఫైవ్‌ స్టార్ రేటింగ్ పొందింది. క్రాస్ ఓవర్ ఫ్రంట్ క్రాష్ ప్రొటెక్షన్, సైడ్ క్రాష్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ అన్ని విభాగాల్లో కారు సామర్థ్యాన్ని పరీక్షించారు. అన్నింటిలో కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చిన మారుతి విక్టోరిస్‌కు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇచ్చారు.  

అన్ని వేరియెంట్స్‌కు వర్తించేలా ఈ టెస్టు జరిగింది. BNCAP పరీక్షలో పాల్గొన్న వేరియంట్ 1,549 కిలోల క్రాష్ టెస్ట్ బరువుతో అత్యంత ఖరీదైన ZXI+ స్ట్రాంగ్ హైబ్రిడ్ eCVT. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్, అలాగే స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌లను కూడా ఈ మోడల్ కవర్ చేస్తుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు విక్టోరిస్ బేస్ వేరియంట్‌కి కూడా ఫైవ్-స్టార్ రేటింగ్ వర్తిస్తుంది. అంటే బేసిక్‌  వేరియంట్‌ తీసుకున్న వాళ్లకి కూడా భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. 

1.5-లీటర్ మాన్యువల్ (LXI నుంచి ZXI+ (O)), ఫ్రంట్-వీల్ ,ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో 1.5-లీటర్ ఆటోమేటిక్ లేదా 1.5-లీటర్ eCVT స్ట్రాంగ్ హైబ్రిడ్ ఏ వేరియెంట్ ఎంచుకున్నా సరే ఈ ఫైవ్‌స్టార్ రేటింగ్ భద్రత వర్తిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ బేస్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు అన్నింటికీ వర్తిస్తుంది. మారుతి విక్టోరిస్‌ ఫీచర్స్ విషయంలో కూడా ముందంజలో ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉంది. ABS, ESP, లెవల్ 2 ADAS వంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ అన్ని వేరియెంట్స్‌లో ఉన్నాయి. ఇలా లెవల్‌ -2 ADAS అందివ్వడం ఇదే తొలిసారి.     

గాట్‌ ఇట్‌ ఆల్‌ అనే ట్యాగ్‌లైన్‌తో మారుతి విక్టోరిస్‌ను భారత్ మార్కెట్‌లోకి మారుతి సుజుకి తీసుకొస్తోంది. ఈ ఎస్‌యూవీ మోడల్ కారు ఆర్డర్‌లు స్వీకరించడం త్వరలోనే ప్రారంభించబోతోంది. ఇందులో ADAS సూట్‌ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, కర్వ్‌స్పీడ్‌ రిడక్షన్‌తో కూడిన అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్ కీప్‌ అసిస్ట్‌, హై బీమ్ అసిస్ట్‌, రియర్ క్రాస్‌ ట్రాఫిక్ అలర్ట్, లేన్ ఛేంజ్ అల్ట్‌తో బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. డిస్క్‌బ్రేక్‌లతోపాటు ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్‌ పార్కింగ్ బ్రేక్‌లు కలిగి ఉంది.  

విక్టోరిస్‌ డిజైన్ కలర్స్‌

మారుతి విక్టోరిస్‌ ఎక్కువ డిజైన్‌తో హడావుడి చేయకుండా సింపుల్‌గా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. సింపుల్‌ అండ్ స్టైలిష్‌ లుక్‌తోనే వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ముందు భాగం ఈ విటారాను పోలి ఉంటుంది. సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో సన్నని క్రోమ్‌ రిబన్స్‌తో కలిపి ఉంటాయి. బంపర్‌లో ఫాగ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి ఈ కారు లుక్‌ను మరింతగా పెంచుతాయి. 

మారుతి విక్టోరిస్‌ టర్బైన్‌ లాంటి డిజైన్‌తో 17 అంగుళాల ఏరో-కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ కలిగి ఉంది. వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే మారుతి కార్లో ఇచ్చినట్టు కాకుండా కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. ఈ కారు పొడవు 4,360mm, 1655 mm వెడల్పు, 1795 mm ఎత్తుతో వస్తోంది. వీల్‌ బేస్‌ 2600mm ఉంది. 

మారుతి విక్టోరిస్‌ పది రంగుల్లో వస్తోంది. మూడు డ్యూయల్‌ టోన్‌ లో ఉంటే ఏడు మోనోటోన్‌ ఆప్షన్‌లో వస్తున్నాయి. వీటితోపాటు మిస్టిక్ గ్రీన్, ఎటర్నల్ బ్లూ కలర్‌తో కూడా కార్లు లభిస్తాయి. కారు ఇంటీరియల్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ ఐవరీ డ్యూయల్‌ టోన్‌తో 3 లేయర్‌ డ్యాష్‌బోర్డు సాఫ్ట్‌ టచ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ కలిగి ఉంటుంది. టెక్చర్డ్‌ సీటు అప్‌హోల్‌స్టరీ, పియానో బ్లాక్ యాక్సెంట్‌లు ప్రీమియం ఇన్‌- క్యాబిన్‌ అనుభవాన్ని ఇస్తాయి. సీఎన్‌జీ సిలిండర్ అమరికలో మార్పులు చేసినందున ఈ మోడల్‌లో కూడా బూట్ స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. 

విక్టోరిస్ 10.1 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో-ఎక్స్‌ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌తో వస్తుంది. ఇది 5.1 ఛానల్‌ డాల్బీ అట్మోస్‌ సరౌండ్‌ సౌండ్‌తో 8-స్పీకర్‌ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్‌ ఇస్తున్నారు. డ్యాష్‌బోర్డ్‌లోని మరో డిస్‌ప్లే 10.5 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌- ఇప్పటి వరకు ఏ మారుతి వాహనాల్లో కనిపించదు. ఈ మోడల్‌తోనే తొలిసారిగా దీన్ని తీసుకొస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget