Maruti Suzuki Eeco: దేశంలోనే అత్యంత చవకైన 7 సీటర్ కారు అమ్మకాల రికార్డులు బద్దలు కొట్టింది! ఫీచర్స్ విషయంలో తగ్గేదేలే!
Maruti Suzuki Eeco: భారతదేశంలో Maruti Suzuki Eeco అత్యంత చవకైన 7-సీటర్ కొత్త రికార్డులు బద్దలు కొట్టింది. ఆగస్టు 2025లో 10,000 మందికిపైగా కొనుగోలుదారులు దీనిని ఎంచుకున్నారు.

Maruti Suzuki Eeco:భారతీయ మార్కెట్‌లో Maruti Suzuki Eeco ఇప్పటికీ దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ కారుగా పరిగణిస్తున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, విశాలమైన స్పేస్ కారణంగా ఇది ఫ్యామిలీ, వాణిజ్య వినియోగదారులకు మొదటి ఎంపికగా ఉంది. ఆగస్టు 2025లో కూడా దీని క్రేజ్ కొనసాగింది. కేవలం ఒక్క నెలలో Eeco 10,785 మంది కొత్త కస్టమర్‌లు కొనుగోలు చేేశారు. ఈ విషయాన్ని కంపెనీయే అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడే కాదు గత ఏడాది కూడా ఆ మోడల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు చేసిన అమ్మకాలు గత సంవత్సరం ఆగస్టు 2024లో నమోదైన 10,985 యూనిట్లకు దగ్గరగా ఉంది.
శక్తివంతమైన ఇంజిన్, మైలేజ్
Maruti Suzuki Eecoలో కంపెనీ 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ VVT పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ 18.76 bhp పవర్, 104 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మైలేజ్‌లో కూడా చాలా బాగుంది. పెట్రోల్ వేరియంట్‌లో ఇది 19.71 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. CNG మోడ్‌లో 26.78 km/kg మైలేజ్ ఇస్తుంది. అందుకే ఈ కారు టాక్సీ, వాణిజ్య విభాగంలో కూడా బాగా అమ్ముడవుతుంది.
ఉన్న ఫీచర్లు ఏంటీ?
తక్కువ ధర ఉన్నప్పటికీ, Maruti Eecoలో అనేక ముఖ్యమైన, సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రీక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో EBD, స్లైడింగ్ డోర్, రివర్స్ పార్కింగ్ సెన్సర్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. దీనితోపాటు, ఇది కొత్త స్టీరింగ్ వీల్, హీటర్ , మరింత సౌకర్యవంతమైన సీటింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది.
వేరియంట్‌లు వాటి ధరలు
Maruti Suzuki Eeco ధర మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల కూడా అమ్మకాలు పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. కంపెనీ దీనిని రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్) బేసిక్ ప్రైస్‌తో ప్రారంభించింది. టాప్ వేరియంట్ రూ.6.96 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 13 వేరియంట్‌లు, 5 రంగుల ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ ఫ్యామిలీ కారును కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా మారింది. అందుకే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.
Maruti Eeco ఎందుకు బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్?
తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా Maruti Suzuki Eeco ఎల్లప్పుడూ బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్‌గా కొనసాగుతోంది. ఆగస్టు 2025లో 10,785 యూనిట్ల అమ్మకాలతో భారతీయ మార్కెట్‌లో ఇప్పటికీ బలమైన డిమాండ్ ఉందని మరోసారి నిరూపించాయి.
Maruti Eeco హైదరాబాద్‌లో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?
Maruti Suzuki Eeco హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ 6.86లక్షల రూపాయలు. ఈ కారు కొనాలంటే ముందుగా లక్షా 16వేల రూపాయలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. తర్వాత మిగతా అమౌంట్‌ను ఐదేళ్లకు ఈఎంఐగా నెల నెల చెల్లించాలి. 5,69,624 రూపాయల మిగతా అమౌంట్‌కు 8 శాతం వడ్డీకి ఐదేేళ్ల టెన్యూర్‌కు లోన్ తీసుకుంటే నెలకు 11,547 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ తగ్గిన కొద్దీ మీ ఈఎంఐ పెరుగుతూ ఉంటుంది.





















