Grand Vitara 7 Seater: మారుతి సుజుకి నుంచి దీటైన 7 సీటర్ కారు- మహీంద్ర, హ్యూందాయ్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్
New Grand Vitara 7 Seater: ఈ మధ్య కాలంలో 7 సీటర్ల కార్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆ దిశగానే కొత్త కొత్త మోడళ్లు తీసుకొచ్చేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

Maruti Suzuki New Grand Vitara : మారుతి సుజుకి సక్సెస్‌ఫుల్ మోడల్ నెక్సా కారు లైనప్‌నకు మరో కొత్త మోడల్ జత చేయాలని చూస్తోంది. భారత్ మార్కెట్‌లో బాగా డిమాండ్ పెరుగుతున్న 7 సీటర్ల విభాగంలో కొత్త ఎస్‌వీయూ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతమైన గ్రాండ్ విటారా మోడల్‌లోనే 7 సీటర్ తీసుకురానుంది. ఇప్పుడు ఉన్న మోడల్‌కు కొన్ని మార్పులు చేస్తున్నట్టు సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త మోడల్ రాకతో గ్రాండ్ విటారా, ఇన్విక్టో మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అవుతుందని సంస్థ భావిస్తోంది. ఎస్‌వీయూ విభాగంగా భారత్‌లో గట్టిపోటీదారుగా ఉన్న సుజికి ఈ కారు లాంచ్‌తో తన స్థానాన్ని మరింతగా స్థిరపరుచుకోవాలని చూస్తోంది.
వివిధ మార్గాల్లో వస్తున్న లీక్‌లను పరిశీలిస్తే... విజయవంతమైన తమ సంస్థ కార్ల డిజైన్లను అనుసరిస్తూనే చిన్న చిన్న మార్పులు చేసేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న గ్రాండ్ విటారా కంటే కొత్త కారు కాస్త పొడవుగా ఉంటుంది. వెనుక భాగంలో చిన్న చిన్న మార్పులు చేసినట్టు అర్థమవుతుంది. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది. సిల్హౌట్ ఒకేలా ఉండే ఛాన్స్ ఉంది. అల్లాయ్ వీల్స్ డిజైన్ మార్చనున్నారు.
ఐదు సీట్ల గ్రాండ్ విటారా హెడ్‌లైట్స్ డిజైన్‌కు భిన్నమైన డిజైన్‌తో కొత్త 7 సీటర్ గ్రాండ్ విటారా వస్తోంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌తో కూడిన సంప్రదాయమైన హెడ్‌లైట్స్‌తో న్యూ మోడల్ డిజైన్ చేశారు. దీనికి ఫాగ్ ల్యాంప్స్ యాడ్ చేస్తున్నారు. ఇవి కార్నరింగ్ ఫంక్షన్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
7 సీట్ల గ్రాండ్ విటారా వీటితోపాటు మరికొన్ని అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉంటాయని అంటున్నారు. భద్రత దృష్ట్యా లెవల్-2 ADAS ఫీచర్ కల్పిస్తున్నారట. అదే జరిగితే ఇలాంటి సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న మొదటి వెహికల్ కానుంది. దీనికి దిగువ గ్రిల్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉంటాయి.
పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే పాత మోడల్‌ను కంటిన్యూ చేసినట్టు తెలుస్తోంది. ముందు చక్రాలకు పవర్(FWD), అన్ని చక్రాలకు పవర్(AWD)తో 1.5-లీటర్ NA(Naturally Aspirated) పెట్రోల్ వెర్షన్ కలిగి ఉంటుంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే ఐదు స్పీడ్ మాన్యువల్(MT) లేదా ఆరు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉంటాయి. CVT తో పనిచేసే 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది.
7 సీట్ల గ్రాండ్ విటారా వాహనం హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారీ, మహీంద్రా XUV700 వాహనాలకు గట్టి పోటీ ఇవ్వబోతుందని అంచనా వేస్తున్నారు.





















