అన్వేషించండి

Maruti Suzuki Hustler: పంచ్‌కు పోటీగా హజ్లర్ - దించడానికి రెడీ అవుతున్న మారుతి సుజుకి!

Maruti Suzuki New Car: మారుతి సుజుకి హజ్లర్ భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. లాంచ్ అయ్యాక టాటా పంచ్‌కు ఈ కారు పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు.

Maruti Suzuki Hustler Mini SUV: టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎస్‌యూవీల్లో ఒకటి. మారుతి సుజుకి తన కొత్త కారుతో ఈ ఎస్‌యూవీకి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. మారుతి సుజుకి హజ్లర్ భారతదేశంలోని రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఈ కారును చాలా కాలంగా తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది.

టెస్టింగ్‌లో కనిపించిన హజ్లర్
మారుతి సుజుకి హజ్లర్ టెస్ట్ మ్యూల్ భారతదేశంలో టెస్టింగ్‌లో కనిపించింది. ఈ కారు మనదేశంలో ఢిల్లీ రోడ్లపై కనిపించింది. ఈ టెస్ట్ మ్యూల్‌లో సుజుకి లోగో, హజ్లర్ పేరు కనిపించలేదు. తద్వారా ఈ కారు ఐడెంటిటీని దాచింది. ఇది కాకుండా టైర్లపై కనిపించే సుజుకి లోగోను టెస్టింగ్ మ్యూల్‌పై కూడా కవర్ చేశారు.

సుజుకి లోగో, హజ్లర్ బ్రాండ్ మినహా మొత్తం కారును వెల్లడించలేదు. ఈ కారు డ్యూయల్ టోన్ స్కీమ్‌తో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు లైట్ వైట్/సిల్వర్ షేడ్‌తో రోడ్డుపైకి వచ్చింది. ఈ కారు పైకప్పు డార్క్ గ్రే కలర్‌లో కనిపించింది.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

ఈ సుజుకి కారు భారతదేశంలో లాంచ్ అవుతుందా?
మారుతి సుజుకి హజ్లర్ ఒక టాల్ బాయ్ కారు. ఈ కారు పొడవు 3,395 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,475 మిల్లీమీటర్లుగా ఉంది. మన దేశ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ కారు చాలా చిన్నది. మారుతి సుజుకి ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకువస్తే భారతీయ మార్కెట్ ప్రకారం సైజు కొంచెం పెద్దగా ఉండాలి. 

ఆటో పరిశ్రమ విక్రయాల ప్రకారం నాలుగు మీటర్ల లోపు పొడవున్న 7 సీటర్ కారు భారతీయ మార్కెట్లోకి వచ్చాక ప్రజలను మెప్పించడం కొంచెం కష్టమైన పని అని చెప్పాలి. ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే టాటా పంచ్‌కు మంచి పోటీని ఇవ్వవచ్చు.

మనదేశంలో బడ్జెట్ కార్ల విషయంలో మారుతి సుజుకి నంబర్ వన్ అని చెప్పవచ్చు. కానీ గత కొంతకాలంగా రూ.10 లక్షల్లోపు మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోల దగ్గర నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో మారుతి సుజుకి ఈ విభాగంలో తిరిగి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. ఆ ప్రయత్నాల నుంచే ఈ హజ్లర్ పుట్టిందని అనుకోవాలి.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget