అన్వేషించండి

Maruti Suzuki Budget Cars : మధ్యతరగతికి తగ్గట్టుగా మారుతి తీసుకొచ్చిన పది లక్షల లోపు బడ్జెట్ కార్లు ఇవే! ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకోండి?

Maruti Suzuki Budget Cars:భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజల మొదటి ఎంపికగా నిలుస్తోంది మారుతి సుజుకీ. పది లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో 13 రకాల విభిన్న మోడళ్లతో తన ఆధిపత్యాన్ని కొనసాగితోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి రూ. 10 లక్షలలోపు 13 కార్ల మోడళ్లను అందిస్తోంది.
  • అధిక మైలేజీ, తక్కువ నిర్వహణతో మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి.
  • హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ, సెడాన్, ఎంపీవీ విభాగాలలో అనేక రకాల కార్లు ఉన్నాయి.
  • భద్రతా ఫీచర్లు, సీఎన్జీ వేరియంట్లు, ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో విడుదల కానుంది.

Maruti Suzuki Budget Cars : భారత్‌లో సామాన్యుడి కారు కల నిజయం చేయడంలో మారుతి సుజుకి పాత్ర అమోఘం. ముఖ్యంగా పది లక్షల రూపాయల లోపు ధరలో విభిన్న బాడీ స్టైల్స్‌, ఇంధన రకాలు, అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను అందించడంలో ఈ సంస్థ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో మధ్యతరగతికి 13 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 

భారతీయ వినియోగదారులు మారుతి కార్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటి అసాధారణమైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు. ఈ బడ్జెట్‌ విభాగంలో లభించే 12 మోడళ్లు లీటరకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తున్నాయి. అదనంగా రీసేల్ వాల్యూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వీస్ నెట్‌వర్క్ వినియోగదారులకు ఈ బ్రాండ్ పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. 

ప్రజలకు అందుబాటులో ఉన్న మోడల్స్ ఇవే 

మారుతి సుజుకి తన పది లక్షల బడ్జెట్‌ను హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ, ఎంపీవీ, సెడాన్ వంటి విభాగాల్లో విస్తరించింది. 

హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి  చాలా బలంగా ఉంది. ఇక్కడ మొదటి ఎంపిక మారుతి ఆల్టో కే 10. ఇది 3.70 లక్,ళ నుంచి 5.45 లక్షల ధరలో లభిస్తుంది. ఈకారు 24.4 నుంచి 33.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తర్వాత మైక్రో ఎస్‌యూవీ లుక్‌లో ఉండే మారుతి ఎస్‌ప్రెస్సో. ఇది 3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ మైలేజీ ఇచ్చేది మారుతి సెలెరియో. ఇది సీఎజీపై 34.4కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. స్విఫ్ట్‌ 5.79 లక్షల నుంచి బలెనో 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి స్టైల్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. 

ఎస్‌యూవీ, సెడాన్‌లో ఆకట్టుకుంటున్న మారుతి 

6.85 లక్షలతో లభించే మారుతి ఫ్రాంక్‌ నియో రెట్రో లుక్‌తో ఆకర్షిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నమ్మకమైన మోడల్‌ మారుతి బ్రెజ్జా. దీని ధర 8.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సెడాన్ ప్రియులను 6.26 లక్షల ప్రారంభదరతో మారుతి డిజైర్ బాగా నచ్చుతోంది. ఇది సీఎన్జీ విభాగంలో 33.7కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. 

ఎంపీవీ, కమర్షియల్‌లోనూ టాప్

మారుతి ఎర్టిగా ఫ్యామిలీ ఎంపీవీగా పేరొంది. ఇది 8.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి ఈకో వాణిజ్య అవసరాల కోసం పెద్ద కుటుంబాల కోసం ఉపయోగపడుతోంది. దీని ధర 5.21 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

భద్రతలోనూ చాలా అప్‌డేషన్స్‌ 

ఒకప్పుడు భద్రత విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న మారుతి, ఇప్పుడు తన ప్రమాణాలను మెరుగుపరుచుకుంది. పది లక్షల లోపు లభించే కార్లలో పది మోడళ్లు ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. దాదాపు అన్ని మోడల్స్‌లో ABS సిస్టమ్ వస్తోంది. సెంట్రల్ లాకింగ్ తప్పనిసరి అయ్యింది. ప్రీమియం మోడల్స్‌లో 60 డిగ్రీ కమెరా, సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఫోన్ చార్జింగ్, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉంటున్నాయి. 

త్వరలో మారుతి నుంచి బ్రెజ్జా ఫేస్‌లిఫ్‌ లాంచ్ చేయనుంది. దీని అంచనా ధర 8.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మారుతిలో పది లక్షల రూపాయల లోపు మోడల్స్‌ 13 ఉండగా, వాటిలో పది మోడల్స్ సీఎన్జీ వేరియంట్లలో కూడా లభిస్తున్నాయి. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.    

Frequently Asked Questions

పది లక్షల రూపాయల లోపు మారుతి సుజుకిలో ఎన్ని కార్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

పది లక్షల రూపాయల లోపు మారుతి సుజుకి నుంచి 13 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది మోడళ్లు సీఎన్జీ వేరియంట్లలో కూడా లభిస్తాయి.

మారుతి కార్లను వినియోగదారులు ఎక్కువగా ఎందుకు ఎంచుకుంటారు?

మారుతి కార్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు అసాధారణమైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి రీసేల్ వాల్యూ మరియు దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్.

మారుతి సుజుకి ఏయే కార్ల విభాగాలలో మోడళ్లను అందిస్తుంది?

మారుతి సుజుకి తన పది లక్షల బడ్జెట్‌ను హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ, ఎంపీవీ, సెడాన్ వంటి విభాగాలలో విస్తరించింది.

భద్రతా విషయంలో మారుతి కార్లలో ఎలాంటి అప్‌డేషన్స్‌ ఉన్నాయి?

పది లక్షల లోపు కార్లలో పది మోడళ్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. దాదాపు అన్ని మోడల్స్‌లో ABS సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ తప్పనిసరి అయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget