అన్వేషించండి

Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మే 2026 లో ఏకంగా 2,42,688 వాహనాలను విక్రయించి తన హిస్టరీలోనే బెస్ట్ మంత్లీ సేల్స్ రికార్డును క్రియేట్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి మే 2026 నెలలో 2,42,688 వాహనాలను విక్రయించింది.
  • SUV లైనప్, ప్యాసింజర్ కార్ల విభాగం అమ్మకాలను పెంచాయి.
  • ఎగుమతులలో 41,914 యూనిట్లతో గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.

Maruti Suzuki Achieves Highest Ever Monthly Sales In May: ఇండియాలోనే బిగ్గెస్ట్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మే 2026 నెలలో సేల్స్ పరంగా ఒక మేజర్ మైలురాయిని దాటింది. కంపెనీ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఈ ఒక్క నెలలోనే టోటల్ గా 2,42,688 వెహికల్స్ అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే టైమ్ తో పోలిస్తే ఈసారి విక్రయాలు భారీగా పెరిగాయి. ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీలు, కమర్షియల్ వెహికల్స్ కు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో మారుతి సుజుకి తన ఆల్ టైమ్ బెస్ట్ డొమెస్టిక్ సేల్స్ పర్ఫార్మెన్స్ ను నమోదు చేసింది. కేవలం ఇండియా మార్కెట్ లోనే రికార్డ్ స్థాయిలో 1,93,535 యూనిట్లను సేల్ చేసి సరికొత్త కంపెనీ రికార్డును నెలకొల్పింది. ఇందులో ప్యాసింజర్ వెహికల్స్ తో పాటు లైట్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి.

Read Also: Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ? నెలవారీ EMI ప్లాన్, రేంజ్ వివరాలు

ఎస్‌యూవీ సెగ్మెంట్ లో ఫుల్ క్రేజ్..

మారుతి సుజుకి సక్సెస్ లో కంపెనీకి చెందిన యుటిలిటీ వెహికల్స్ (SUV) లైనప్ కీ రోల్ ప్లే చేసింది. బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ ఎల్ 6, జిమ్నీ మోడల్స్ అన్నీ కలిసి టోటల్ గా 79,267 యూనిట్ల సేల్స్ ను నమోదు చేశాయి. స్టైలిష్ లుక్, ప్రాక్టికల్ ఫీచర్లు ఇష్టపడే బైయర్స్ ను మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా కార్లు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో గ్రాండ్ విటారా ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ ఆప్షన్ గా కొనసాగుతోంది. వీటితో పాటు రీసెంట్ గా లాంచ్ అయిన మారుతి ఈ విటారా (e Vitara) ఎలక్ట్రిక్ కార్ కూడా కంపెనీ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో గ్రోత్ కు తన వంతు కాంట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది.

Read Also: Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు.. 

ప్యాసింజర్ కార్ల విభాగంలోనూ దూకుడు.. 

ఎస్‌యూవీలతో పాటు మారుతి ప్యాసింజర్ కార్ల రేంజ్ కూడా మార్కెట్ లో అంతే పాపులర్ గా నిలిచింది. కస్టమర్ల ఫేవరెట్ మోడల్స్ అయిన బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్, సియాజ్ కార్ల కంబైన్డ్ సేల్స్ ఏకంగా 81,555 యూనిట్లకు రీచ్ అయ్యాయి. దీనివల్ల ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి తన తిరుగులేని ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరోవైపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే ఎంట్రీ లెవెల్ మోడల్స్ అయిన మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి, మే నెలలో మొత్తంగా 16,275 యూనిట్ల రిజిస్టర్డ్ సేల్స్ ను సాధించాయి.

ఎగుమతుల్లో 41 వేల మార్కు దాటిన మారుతి.. 

కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్ లోనూ మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ కనిపించింది. మే 2026 లో కంపెనీ ఏకంగా 41,914 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది మే నెలలో జరిగిన 31,219 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే ఈసారి ఎక్స్ పోర్ట్స్ లో సాలిడ్ జంప్ కనిపించింది. డొమెస్టిక్ సేల్స్, ఎక్స్ పోర్ట్స్ అన్నీ కలిపి 2,42,688 యూనిట్లకు చేరడంతో మారుతి సుజుకి హిస్టరీలోనే మే 2026 ఒక బెస్ట్ మంత్ గా నిలిచిపోనుంది. ఫ్రాంక్స్, బ్రెజ్జా, బాలెనో, స్విఫ్ట్ మోడల్స్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే రాబోయే నెలల్లో కూడా కంపెనీ ఇదే సేల్స్ మొమెంటం కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది.

Frequently Asked Questions

మే 2026 నెలలో మారుతి సుజుకి మొత్తం ఎన్ని వాహనాలను విక్రయించింది?

మే 2026 నెలలో మారుతి సుజుకి మొత్తం 2,42,688 వాహనాలను విక్రయించింది. ఇది కంపెనీ అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డు.

భారతదేశంలో మారుతి సుజుకి ఎన్ని యూనిట్లను విక్రయించింది?

భారతదేశంలో మారుతి సుజుకి రికార్డు స్థాయిలో 1,93,535 యూనిట్లను విక్రయించింది. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, లైట్ కమర్షియల్ వాహనాలు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి SUVల అమ్మకాలకు ఏ మోడల్స్ దోహదపడ్డాయి?

బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, జిమ్నీ మోడల్స్ కలిపి 79,267 యూనిట్ల అమ్మకాలు సాధించాయి. ఫ్రాంక్స్, బ్రెజ్జా కార్లు కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మే 2026 లో మారుతి సుజుకి ఎన్ని యూనిట్లను ఎగుమతి చేసింది?

మే 2026 లో మారుతి సుజుకి 41,914 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget