Maruti Fronx: 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కొత్త ఫీచర్లు! EMI, డౌన్‌పేమెంట్ వివరాలు, కొనడానికి ఎంత జీతం అవసరం?
Maruti Fronx EMI Options: మారుతి ఫ్రాంక్స్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చింది, గతంలో కంటే సురక్షితంగా మారింది. నెలకు రూ. 12,137 EMI తో మీరు ఈ కార్‌కు ఓనర్ కావచ్చు.

Maruti Fronx Price, Down Payment, Loan and EMI Details మారుతి సుజుకి, తన పాపులర్ SUV ఫ్రాంక్స్‌ను 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌డేట్ చేసింది, అన్ని వేరియంట్‌లలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్‌లు అందిస్తోంది. దీంతో, ఈ SUV, కుటుంబ ప్రయాణానికి మునుపటి కంటే సురక్షితంగా మారింది. భద్రత పెరుగుదలతో పాటు, కొన్ని వేరియంట్‌ల ధర స్వల్పంగా రూ. 4,000 వరకు పెరిగింది.
మారుతి ఫ్రాంక్స్ ధర
విజయవాడలో, మారుతి ఫ్రాంక్స్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,54,500. RTO ఛార్జీలు దాదాపు రూ. 1.06 లక్షలు, & బీమా దాదాపు రూ. 30,00, ఇతర ఖర్చులు కలిపితే, బెజవాడలో మారుతి ఫ్రాంక్స్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.91 లక్షలు అవుతుంది.
హైదరాబాద్‌లో కూడా మారుతి ఫ్రాంక్స్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,54,500. అయితే, పన్నులు, ఇతర ఛార్జీల్లో వ్యత్యాసాల కారణంగా, భాగ్యనగరంలో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 9.08 లక్షలు అవుతుంది.
డౌన్ పేమెంట్
మీరు, హైదరాబాద్‌లో మారుతి ఫ్రాంక్స్‌ను కార్ లోన్‌పై కొనాలంటే, కనీసం రూ. 1.53 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. ఇది పోను, మిగిలిన రూ. 7.55 లక్షలు కార్ లోన్ లభిస్తుంది. బ్యాంక్ ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో మంజూరు చేసిందని భావిస్తే, మీరు నెలకు ఎంత EMI చెల్లించాలంటే...
EMI ఆప్షన్స్
7 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలంటే, నెలకు రూ. 12,137 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, నెలనెలా రూ. 13,598 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
5 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే, నెలకు రూ. 15,660 EMI అవుతుంది.
4 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే, నెలకు రూ. 18,773 EMI చెల్లించాలి.
మారుతి ఫ్రాంక్స్ కొనడానికి ఎంత జీతం అవసరం?
ఈ EMI ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి మీకు ఎంత జీతం ఉండాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ నెలవారీ ఆదాయం రూ. 40,000 - రూ. 50,000 మధ్య ఉంటే & మీకు మరే ఇతర పెద్ద రుణం లేకపోతే, మీరు ఈ SUV EMI ని సులభంగా చెల్లించవచ్చు. చాలా బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు మీ జీతంలో 30-40% వరకు EMI కోసం ఉపయోగించవచ్చని నమ్ముతాయి. అంటే, రూ. 45,000 జీతంతో రూ. 13,500 నుంచి రూ. 18,000 వరకు EMI ని కట్టడం మీకు సాధ్యమవుతుంది.
మారుతి ఫ్రాంక్స్ ఇంజిన్ ఎంపికలు & మైలేజ్
మారుతి ఫ్రాంక్స్‌ను పెట్రోల్ & CNG ఇంధన ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. దీనికి రెండు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మొదటిది - 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 99 bhp పవర్‌ను & 147.6 Nm టార్క్‌ను ఇస్తుంది. రెండోది - 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 89 bhp పవర్‌ను & 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. CNG మోడ్‌లో, పవర్ 76 bhpకి & టార్క్ 98.5 Nmకి తగ్గుతుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 5-స్పీడ్ AMT ఎంపికలు రెండూ ఉంటాయి. CNG వెర్షన్‌లో క్లెయిమ్డ్ మైలేజ్ 28.51 కిమీ/కిలో, ఈ కారణంగా ఈ కారు దాని విభాగంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన SUVగా నిలిచింది.
దీని ధర కొంచెం పెరిగినప్పటికీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ఆధునిక ఫీచర్లు దీనిని స్మార్ట్ & సురక్షితమైన కుటుంబ కారుగా మార్చాయి. ఈ కారు కొనడానికి ముందు, మీ ఆదాయం, ఖర్చులు & ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతలను జాగ్రత్తగా పరిశీలించండి.



















