అన్వేషించండి

Maruti 7 seater EV: వచ్చే ఏడాది మారుతి మొదటి 7 సీటర్ EV లాంచ్.. ఏకంగా 543 కి.మీ రేం.జ్, ఆ కార్లకు గట్టి పోటీ

Maruti 7 Seater Car | మారుతి సుజుకి కంపెనీ ఫ్యామిలీతో జర్నీ చేసేలా 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఇది కియా కారెన్స్ EVకి పోటీగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించేలా వస్తుంది.

Maruti first 7 seater EV YMC | మారుతి సుజుకి భారతదేశంలో వచ్చే ఏడాది అనేక కొత్త కార్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. వీటిలో మారుతి e విటారా ఎలక్ట్రిక్ SUVతో పాటు కొత్త ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కారు కూడా ఉంది. ఈ కొత్త కారును కంపెనీ మారుతి YMC పేరుతో రూపొందించనుంది. ఇది భారతదేశంలో మారుతి కంపెనీ రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇటీవల తమ తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయడం తెలిసిందే. ప్రత్యేకంగా కుటుంబంతో వెళ్లాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ MPVని ఎర్టిగా, XL6 కంటే ఎక్కువ విభాగంలో ఉంచాలని మారుతి కంపెనీ యోచిస్తోంది. తద్వారా ఎక్కువ స్థలంతో పాటు మెరుగైన ఫీచర్‌లను పొందవచ్చు.

కియా కారెన్స్ EVతో నేరుగా పోటీ

మారుతి నుంచి రాబోయే ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు నేరుగా కియా కారెన్స్ క్లావిస్ EVకి పోటీ పడుతుంది. ఈ 2 కార్లు కూడా ఫ్యామిలీ జర్నీకి ఉపయోగించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. కియా ఇప్పటికే ఈ విభాగంలో సన్నాహాలు చేస్తుండగా, మారుతి తన బ్రాండ్ విలువ, సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా మార్కెట్‌లో పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ధర, నిర్వహణ ఖర్చుల పరంగా మారుతి ఈ విభాగంలో మంచి ఎంపికను అందించగలదని భావిస్తున్నారు.

మారుతి YMC ఎలక్ట్రిక్ MPV విడుదల ఎప్పుడు ?

మారుతి సుజుకి ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారు 2026 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2026 నుండి దీని ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ కారు రాబోయే మారుతి e విటారా ఎలక్ట్రిక్ SUV తయారు చేసిన అదే 27PL ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేయనున్నారు. దీనితో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తోందని స్పష్టమవుతుంది.

బ్యాటరీ, కి.మీ రేంజ్ 

మారుతి YMCలో e విటారాలో అందించే అదే తరహాలో బ్యాటరీ ఎంపికలు ఉండవచ్చు. ఇందులో 49kWh బ్యాటరీతో పాటు 61kWh బ్యాటరీ ప్యాక్‌లు వచ్చే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో, ఈ కారు దాదాపు 343 కిలోమీటర్ల రేంజ్ జర్నీ ఇవ్వగలదు. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో దీని పరిధి దాదాపు 543 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని అంచనా వేశారు. ఇంత పరిధితో ఈ ఎలక్ట్రిక్ MPV సుదూర ప్రయాణాలకు కూడా సరైన ఎంపికగా భావించవచ్చు. మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. మారుతి కంపెనీ దేశంలోని 1,100 కంటే ఎక్కువ నగరాల్లో 2,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 2030 నాటికి డీలర్లు, ఛార్జింగ్ భాగస్వాములతో కలిసి 1 లక్ష కంటే ఎక్కువ EV ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని మారుతి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే CNG వాహనాలు ఎందుకు ఎక్కువ దూరం నడుస్తాయంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget