అన్వేషించండి

భారత్ NCAPలో 5 స్టార్ దక్కించుకున్న Maruti e Vitara – అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్‌లో ఫుల్ మార్కులు

మారుతి ఇ విటారా భారత్ NCAP క్రాష్‌ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. అడల్డ్‌, చైల్డ్ ప్రొటెక్షన్‌లో అత్యుత్తమ స్కోర్లు అందుకున్న ఈ SUVలో ఉన్న సేఫ్టీ ఫీచర్లు ఇవి.

Maruti e Vitara Safety: మారుతి సుజుకి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ కారు ఇ విటారాను ఇండియా-స్పెక్ రూపంలో పరిచయం చేసింది (లాంచ్‌ చేయలేదు). ఈ ఎలక్ట్రిక్ కారును 49kWh & 61kWh వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది & ARAI-రేటెడ్ రేంజ్ 543 కి.మీ. వరకు ఉంటుంది. ఈ కారు కోసం, మారుతి, సబ్‌స్క్రిప్షన్ & BaaS స్కీమ్‌లను అందించనుంది. 2,000 పాయింట్లకు పైగా ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇ విటారా బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి, దీని 2026 ప్రారంభంలో ఈ కారును లాంచ్‌ చేస్తుంది.

మరో బిగ్‌ అప్‌డేట్‌ 
మారుతి ఇ విటారా భద్రత పరంగా పెద్ద ఘనత సాధించింది. భారత్ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP లేదా B NCAP‌) తాజాగా ప్రకటించిన క్రాష్‌ టెస్ట్‌ ఫలితాల్లో, ఈ ఎలక్ట్రిక్‌ SUV 5 స్టార్ రేటింగ్ సాధించింది, మారుతి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కార్లలో సేఫ్టీ పరంగా అత్యుత్తమ మోడల్‌గా నిలిచింది. డిజైర్‌, బాలెనో, ఇన్విక్టో తర్వాత భారత్ NCAP పరీక్షల్లో నిలిచిన నాలుగో మారుతి మోడల్‌ కూడా ఇదే.

పెద్దల భద్రతలో దాదాపు ఫుల్ స్కోర్‌
భారత్ NCAP టెస్టింగ్‌లో, ఇ విటారా, అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ ‍(AOP) విభాగంలో మొత్తం 32 పాయింట్లకు 31.49 స్కోర్‌ సాధించింది. ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ డిఫార్మబుల్‌ బారియర్‌ టెస్ట్‌లో డ్రైవర్‌ తల, మెడ, తొడలు, పాదాలకు ‘గుడ్‌’ ప్రొటెక్షన్‌ లభించిందని టెస్టింగ్‌ సంస్థ వెల్లడించింది. ఛాతి, టిబియాలకు మాత్రం ‘అడిక్వేట్‌’ ప్రొటెక్షన్‌ నమోదైంది. అయితే సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టుల్లో మాత్రం తల నుంచి పెల్విస్‌ వరకు ప్రతిభాగానికీ ‘గుడ్‌’ రేటింగ్ రావడం ఇ విటారాకు పెద్ద ప్లస్‌గా మారింది.

పిల్లల భద్రతలో కూడా టాప్‌ పెర్ఫార్మెన్స్‌
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ (COP) విభాగంలో కూడా ఇ విటారా 49కి 43 పాయింట్లు అందుకుంది. ఇక్కడ డైనమిక్‌ స్కోర్‌లో ఫుల్ (24/24), CRS ఇన్‌స్టలేషన్‌ స్కోర్‌లో కూడా ఫుల్ (12/12) వచ్చింది. 18 నెలలు, 3 సంవత్సరాల పిల్లల మోడల్‌ డమ్మీలను రియర్‌వర్డ్‌ ఫేసింగ్‌లో ఉంచి టెస్ట్‌ చేశారు. ఫ్రంట్‌, సైడ్ క్రాష్‌ టెస్టుల్లో రెండూ ఫుల్ పాయింట్లు సాధించాయి. వాహనంలో కొన్ని ఫిక్స్‌డ్‌ పాయింట్లు లేకపోవడం వల్ల వాహన అసెస్‌మెంట్‌ విభాగంలో 6 పాయింట్లు కోల్పోయింది.

సేఫ్టీ ఫీచర్ల జాబితా కూడా బలంగా ఉంది

ఇ విటారా టాప్‌ స్పెక్‌ అయిన "ఆల్ఫా" వెర్షన్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి:

  • 7 ఎయిర్‌బ్యాగ్స్‌
  • లెవల్‌ 2 ADAS
  • 360-డిగ్రీ కెమెరా
  • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ + ఆటోహోల్డ్
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ (TPMS)
  • ISOFIX చైల్డ్ సీట్ ఆంకరేజ్‌

మారుతి బ్రాండ్‌ నుంచి Victoris తర్వాత 'లెవల్‌ 2 ADAS'తో వచ్చిన రెండో మోడల్‌ ఇదే కావడం మరో ఆసక్తికరమైన విషయం.

BE 6 తో పోలిక – మారుతిపై స్వల్ప ఆధిక్యం
మార్కెట్లో ఇ విటారాకు ప్రధాన ప్రత్యర్థి Mahindra BE 6 కూడా ఇదే ఏడాది భారత్ NCAPలో 5 స్టార్ సాధించింది. అయితే BE 6, ఇ విటారాతో పోలిస్తే AOPలో 0.49 పాయింట్లు, COPలో 2 పాయింట్లు ఎక్కువ తెచ్చుకుంది. అయినప్పటికీ రెండూ భద్రత పరంగా టాప్‌ SUVలలో ఉంటాయి.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ SUVలకు డిమాండ్‌ పెరుగుతున్న ఈ సమయంలో, ఇ విటారా లాంటి సేఫ్టీ-సెంట్రిక్‌ మోడల్‌ రావడం పెద్ద ప్లస్‌. కుటుంబ ప్రయాణాలు, హైవే రైడ్స్‌, రోజువారీ కమ్యూట్‌.. ఇలా ఏ అవసరానికైనా ఈ SUV సేఫ్టీ పరంగా మంచి నమ్మకం ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget