అన్వేషించండి

కొత్త Baleno వర్సెస్ Tata Altroz.. మీ బడ్జెట్‌లో బెస్ట్ కారు ఏది.. రీసేల్ వాల్యూ దేనికి ఎక్కువ

6 లక్షల ఎక్స్ షోరూమ్ బడ్జెట్‌లో కొత్త మారుతి బలెనో, టాటా ఆల్ట్రోజ్‌లలో ఏ కారు అత్యంత విలువైనది ఇక్కడ తెలుసుకోండి. మీకు మైలేజ్ ముఖ్యమా, సేఫ్టీ ముఖ్యమో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి బలెనో మైలేజీ, టాటా ఆల్ట్రోజ్ భద్రతతో పోటీ.
  • బలెనో అధిక మైలేజీ, ఆల్ట్రోజ్ అత్యుత్తమ 5-స్టార్ భద్రత.
  • బలెనో తక్కువ నిర్వహణ, అధిక రీసేల్ విలువ అందిస్తుంది.
  • ఆల్ట్రోజ్ ప్రీమియం క్యాబిన్, ధృడమైన బాడీ నిర్మాణాన్ని కలిగి.

భారత్‌లో రోజురోజుకూహ్యాచ్‌బ్యాక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. దాంతో ఆటోమొబైల్ కంపెనీలు హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బలెనో, టాటా ఆల్ట్రోజ్ పేర్లు ముందుగా వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఈ 2 కార్లు తమ సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందాయి. వినియోగదారులు వీటిని ఇష్టపడి నమ్మకంగా కొంటున్నారు. ఒకవైపు బలెనో అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, నమ్మకమైన ఇంజిన్‌కు పేరుగాంచింది. మరోవైపు టాటా ఆల్ట్రోజ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో పాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్,  ప్రీమియం డిజైన్ కారణంగా మార్కెట్లో నిలదొక్కుకుంది.

అయితే రూ. 6 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో రెండు కార్ల బేస్ లేదా లోయర్-మిడ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, మీ నగదుకు తగిన విలువ చేసే కారను సెలెక్ట్ చేసుకోవం ముఖ్యం. అందుకోసం మీ అవసరాల ప్రకారం ఏ కారు సెట్ అవుతుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

మైలేజ్‌లో వీటి మధ్య పోటీ

ఇంజిన్, పనితీరు పరంగా మారుతి బలెనో 1.2 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ చాలా రిఫైన్డ్‌గా, స్మూత్‌ అని భావిస్తారు. ఈ ఇంజిన్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేందుకు చాలా సులభం. అలాగే దీని థ్రాటిల్ రెస్పాన్స్ కూడా వేగంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైలేజ్ విషయంలో బలెనో పైచేయి సాధిస్తుంది. లీటరుకు 20 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. మరోవైపు టాటా ఆల్ట్రోజ్‌లో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు బాగానే ఉన్నప్పటికీ రిఫైన్మెంట్ విషయంలో బలెనో కంటే కొంచెం వెనుకంజలో ఉంటుంది. ఆల్ట్రోజ్ మైలేజ్ లీటరుకు సుమారు 18 నుంచి 19 కిలోమీటర్ల మధ్య ఇస్తుంది. 

Also Read: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

సేఫ్టీలో ఏది బెస్ట్

మీ మొదటి ప్రాధాన్యం సేఫ్టీ అయితే టాటా ఆల్ట్రోజ్ అత్యంత బలమైన పోటీదారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా ఆల్ట్రోజ్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ బడ్జెట్‌లో అత్యంత సురక్షిత కార్లలో ఒకటిగా చెప్పవచ్చు. దీని బాడీ షెల్, డోర్ స్ట్రాంగ్ నెస్ తాకగానే తెలుస్తుంది.

మారుతి బలెనోలో ఇప్పుడు గతంతో పోలిస్తే మెరుగైన సేఫ్టీ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ, క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా ఆల్ట్రోజ్ ఇప్పటికీ బలెనో కంటే ముందుంటుంది. 

క్యాబిన్, కంఫర్ట్‌లో ఏది ఫస్ట్ 

కేబిన్ స్పేస్ విషయానికి వస్తే రెండు కార్లూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 5 మంది కూర్చోవడానికి సరిపడే స్పేస్ ఇస్తాయి. మారుతి బలెనోలో చాలా విశాలంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దీని సీట్లు లాంగ్ జర్నీకి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని రియర్ లెగ్‌రూమ్ కూడా అద్భుతంమని చెబుతారు.

టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్ చాలా ప్రీమియం. అలాగే దీని 90 డిగ్రీల వరకు తెరుచుకునే డోర్లు కారులో ఎక్కడం, దిగడం సులభం చేస్తాయి. ఆల్ట్రోజ్ సీట్లు కొంచెం మెరుగ్గా అనిపిస్తాయి. అలాగే దీని డాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా మోడ్రన్. అయితే, మారుతి బలెనో రియర్ సీట్ కంఫర్ట్ కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది.

Also Read: క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌

రీసేల్ వాల్యూ దేనికి ఎక్కువ?

భారత్‌లో మారుతి సుజుకి నెట్‌వర్క్ చాలా పెద్దది. దాంతో బలెనో సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ చాలా చౌకగా అందుబాటులో ఉంటాయి. మీరు కారును 4-5 సంవత్సరాలు నడిపి అమ్మాలనుకుంటే, బలెనో రీసేల్ విలువ ఎక్కువ. 

టాటా సర్వీస్ గత కొన్ని సంవత్సరాల్లో చాలా మెరుగైంది. మెయింటెనెన్స్ విషయంలో ఇది మారుతి కంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే బలెనో తీసుకోవాలి. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం అయితే ఆల్ట్రోజ్‌ను ఎంచుకోండి.

Frequently Asked Questions

మారుతి బలెనో, టాటా ఆల్ట్రోజ్ లలో ఏ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?

మారుతి బలెనో లీటరుకు 20-22 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ లీటరుకు సుమారు 18-19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మైలేజీ విషయంలో బలెనో ముందంజలో ఉంది.

భద్రత విషయంలో టాటా ఆల్ట్రోజ్, మారుతి బలెనోలలో ఏది మంచిది?

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా ఆల్ట్రోజ్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. బలెనోలో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, బిల్డ్ క్వాలిటీ, క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో ఆల్ట్రోజ్ ముందుంది.

మారుతి బలెనో లేదా టాటా ఆల్ట్రోజ్ లలో దేనికి రీసేల్ వాల్యూ ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ?

మారుతి సుజుకి నెట్‌వర్క్ పెద్దది కాబట్టి, బలెనోకు సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ చౌకగా లభిస్తాయి, రీసేల్ విలువ కూడా ఎక్కువ. టాటా మెయింటెనెన్స్ బలెనో కంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది.

క్యాబిన్ సౌకర్యం విషయంలో బలెనో, ఆల్ట్రోజ్ కార్లలో ఏది మెరుగ్గా ఉంటుంది?

రెండు కార్లలో 5 మందికి సరిపడా స్థలం ఉంటుంది. బలెనో విశాలమైన భావనను కలిగిస్తుంది, లాంగ్ జర్నీలకు సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన రియర్ లెగ్‌రూమ్‌ను కలిగి ఉంది. ఆల్ట్రోజ్ ప్రీమియం ఇంటీరియర్, సులభంగా ఎక్కడానికి 90 డిగ్రీల డోర్‌లు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Travis Head Exit:  SRH అభిమానులకు హెడ్ షాక్ .. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
SRH అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన హెడ్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
Embed widget