అన్వేషించండి

జనవరి 5న ఎంట్రీ ఇస్తున్న Mahindra XUV 7XO - Mahindra XUV700 కంటే కొత్తగా ఏం మార్పులు తెస్తోంది?

Mahindra XUV 7XO మరికొన్ని రోజుల్లో రివీల్‌ కాబోతోంది. ఇది, Mahindra XUV700 Facelift వెర్షన్‌. కొత్త డిజైన్‌, మూడు స్క్రీన్‌ సెటప్‌, ADAS, 6 & 7 సీట్లతో మరింత ప్రీమియం SUV‌గా వచ్చేందుకు సిద్ధమైంది.

Mahindra XUV 7XO Launch Date: 2026లో, తన ఫ్లాగ్‌షిప్‌ ICE SUV అయిన XUV700కి భారీ అప్‌డేట్‌ను (ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌) తీసుకురానుంది మహీంద్రా. ఈ కొత్త వెర్షన్‌ “XUV 7XO” పేరుతో జనవరి 5న అధికారికంగా పరిచయం కానుంది. ఇప్పటికే టీజర్లు విడుదలవడంతో ఈ SUVపై ఆసక్తి మరింత పెరిగింది. మధ్యస్థాయి కుటుంబాలకు, లాంగ్‌ హైవే ప్రయాణాలు చేసేవారికి, ప్రీమియం ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులకు XUV 7XO బాగా దృష్టిని ఆకర్షిస్తోంది.

ధరలు ఎలా ఉండొచ్చు?

ప్రస్తుతం అమ్ముడవుతున్న XUV700 ధరలు ₹13.66 లక్షల నుంచి ₹23.71 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్‌-షోరూమ్‌). కొత్త మోడల్‌, అప్‌డేటెడ్‌ ఫీచర్లు, సంవత్సరాంతర ఖర్చుల పెరుగుదల వంటివన్నీ కలిపితే, XUV 7XO ధరలు ₹14 లక్షల నుంచి ₹25 లక్షల వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ధరల శ్రేణిలో, ఇది, Hyundai Alcazar & Tata Safari కేటగిరీలో బలమైన పోటీదారుగా నిలుస్తుంది.

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌లో ఏంటి కొత్తదనం?

XUV 7XOలో కూడా XUV700లో ఉన్నట్లే 4 రకాల పవర్‌ట్రెయిన్‌లు వస్తాయి.

2.0-లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌: 200hp పవర్‌, 380Nm టార్క్‌

6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఆప్షన్‌

2.2-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌: 185hp వరకు పవర్‌, 450Nm వరకు టార్క్‌

డీజిల్‌ వేరియంట్‌లో AWD ఆప్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేయకపోయినా, ట్యూనింగ్‌లో కొన్ని మెరుగుదలలు చేసి మరింత స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవం ఇవ్వొచ్చని ఆటో ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేస్తున్నారు.

బాహ్య రూపంలో వచ్చే మార్పులు ఏంటి?

  • డిజైన్‌ విషయంలో XUV700 స్టైల్‌ కొనసాగుతుంది.
  • కొత్త గ్రిల్‌ డిజైన్‌
  • XEV 9S మాదిరి C-షేప్‌ DRLs
  • వెనుక భాగంలో LED లైట్‌బార్‌ స్టైల్‌
  • షార్ప్‌ స్టైల్‌ బంపర్‌లు
  • కొత్త అల్లాయ్‌ వీల్స్‌ డిజైన్‌

ఇవన్నీ ఈ SUVని కొత్త తరహా లుక్‌తో తీసుకొస్తాయి. అయితే మొత్తం సిల్హౌట్‌ను (ఓవరాల్‌ బాడీ) మాత్రం మార్చకుండా అదే విధంగా కొనసాగిస్తుండటం గమనించదగ్గ విషయం.

ఇంటీరియర్‌లో పెద్ద అప్‌డేట్‌ ఇదే

  • XUV 7XO ఇంటీరియర్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు 3-స్క్రీన్‌ లేఅవుట్‌.
  • 12.3 ఇంచుల డ్రైవర్ డిస్‌ప్లే
  • 12.3 ఇంచుల సెంటర్‌ టచ్‌స్క్రీన్‌
  • 12.3 ఇంచుల ప్యాసింజర్‌ స్క్రీన్‌

ఈ లగ్జరీ ఇంటీరియర్‌ సెటప్‌ ఈ SUVని మరింత ప్రీమియం లుక్‌తో చూపిస్తుంది. అదనంగా,

  • మెరుగైన కేబిన్‌ మెటీరియల్స్‌
  • కొత్త కలర్‌ థీమ్స్‌
  • సౌకర్యానికి సంబంధించిన కొన్ని కొత్త ఫీచర్లు చేర్చే అవకాశం ఉంది.

సేఫ్టీ ఫీచర్లలో పెద్ద అప్‌డేట్‌

టాప్‌ వేరియంట్‌లలో Level-2 ADAS తప్పకుండా ఉంటుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. కొన్ని మహీంద్రా మోడల్స్‌ Bharat NCAPలో 5-స్టార్‌ రేటింగ్‌లతో మంచి మార్కులు తెచ్చుకున్నాయి. XUV 7XO కూడా అదే రేంజ్‌లో ఉండవచ్చని భావిస్తున్నారు.

సీటింగ్‌ ఆప్షన్లు

5-సీటర్‌ వేరియంట్‌ వచ్చే అవకాశాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ.. 6-సీటర్‌, 7-సీటర్‌ ఆప్షన్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి.

పోటీకార్లు

3-వరుసల SUV సెగ్మెంట్‌లో XUV 7XO బలమైన పోటీ ఇస్తుంది. ముఖ్యంగా... Hyundai Alcazar, Tata Safari, MG Hector Plus కు గట్టి కాంపిటీటర్‌ అవుతుంది.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Advertisement

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget