అన్వేషించండి

Mahindra Thar Prices Hike: థార్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మహీంద్రా థార్ ధరలు! ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

Mahindra Thar News: మహీంద్రా థార్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల  నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరల వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

Mahindra Thar Prices Hiked in India: ఇండియ‌న్ రోడ్లపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఈ త్రీ-డోర్ ఎస్‌యూవీ ధరను కంపెనీ గరిష్టంగా రూ. 43,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6 నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే థార్ ధరలు పెరగడం ఇది రెండవసారి. గత జనవరిలో కూడా రూ. 20,000 వరకు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్ల వాహనాల ధరలను 2.5 శాతం వరకు పెంచుతామని మహీంద్రా సంస్థ గతంలోనే హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని థార్ మోడల్ పై అమలు చేసింది.

ఏ వేరియంట్‌పై ఎంత పెరిగింది?
మహీంద్రా థార్ లైనప్‌లో ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి 2.2 డీజిల్ ఆటోమేటిక్ (LXT 4WD 2.2 Diesel AT) వేరియంట్‌పై అత్యధికంగా రూ. 43,500 ధర పెరిగింది. దీని తర్వాతి స్థానంలో ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి 2.0 పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది, దీని ధర రూ. 41,500 పెరిగింది. మాన్యువల్ వేరియంట్ల విషయానికి వస్తే, డీజిల్ మాన్యువల్ పై రూ. 39,500, పెట్రోల్ మాన్యువల్ పై రూ. 37,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఎక్స్‌టి 2డబ్ల్యుడి డీజిల్, ఎల్ఎక్స్‌టి 4డబ్ల్యుడి పెట్రోల్ మోడళ్లపై రూ. 30,500 మేర కంపెనీ పెంచింది. అయితే, ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఏఎక్స్‌టి 2డబ్ల్యుడి 1.5 డీజిల్ మాన్యువల్ ధర మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రూ. 9.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్దే కొనసాగుతోంది.

మెకానికల్ ఆప్షన్లు - పర్ఫార్మెన్స్..
మహీంద్రా థార్ ప్రస్తుతం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్లు గా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 2025లో చిన్నపాటి అప్‌డేట్స్ పొందిన ఈ మోడల్, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇప్పటికీ ఫేవరెట్ ఛాయిస్‌గా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్..
ప్రస్తుత ధరల పెంపు ఒక వైపు కొన సాగుతుండగా, మరోవైపు మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఇది ఇటీవల లాంచ్ అయిన 'థార్ రాక్స్' (Thar Roxx) నుంచి స్ఫూర్తి పొందిన హెడ్‌లైట్, గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. బాడీ స్ట్రక్చర్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొన్ని మెకానికల్ అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. ఎస్‌యూవీ మార్కెట్లో మంచి రోడ్ ప్రెజెన్స్ కావాలనుకునే వారికి థార్ ఒక ఐకానిక్ మోడల్. కాకపోతే వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య వాహన ప్రియులకు కొంచెం నిరాశ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో టయోటా వంటి ఇతర కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తుంటే, మహీంద్రా మాత్రం ధరలు పెంచడం గమనార్హం. ఈ అంశం అమ్మ‌కాల‌పై కాస్త ప్రభావం చూపించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget