మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది. లీకైన ఫోటోలలో బాక్సీ సిల్హౌట్, రగ్గడ్ డిజైన్, 5 డోర్ లేఅవుట్ ఉన్నాయి.
Mahindra Thar Electric వస్తోంది.. టెస్టింగ్‌లో తొలిసారి కనిపించిన కారు లుక్, అంచనా ధర వివరాలు
మహీంద్రా థార్ EV తొలిసారిగా భారత రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. విజన్ T ఇన్స్‌పైర్డ్ లుక్, 5 డోర్ బాడీ, పెద్ద అలాయ్ వీల్స్ సహా పూర్తి వివరాలు తెలుసుకోండి.

- మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ టెస్టింగ్, బాక్సీ డిజైన్, 5-డోర్ లేఅవుట్ వెల్లడించింది.
- మస్కులర్ ముందు భాగం, 19-20 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ప్రత్యేకతలు.
- కొత్తగా కనిపించే వెనుక భాగం, ఇండిపెండెంట్ సస్పెన్షన్ సౌకర్యం మెరుగుపరుస్తుంది.
- ఆధునిక క్యాబిన్, టచ్‌స్క్రీన్, డ్యూయల్ మోటార్ సెటప్ అంచనా.
మహీంద్రా ఆటోమొబైల్ కంపెనీ నుంచి అధికంగా వార్తల్లో నిలిచే కారు 'థార్'. మన దేశంలో థార్‌కి ఉన్న క్రేజ్, వాల్యూ వేరని ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రోడ్డుపై ఈ కారులో వెళ్తుంటే ఆ స్వ్యాగ్ కొత్తగా కనిపిస్తుంది. మహీంద్రాకు చెందిన అత్యంత ఆసక్తికరమైన ఆల్-ఎలక్ట్రిక్ SUV థార్ ఎలక్ట్రిక్ ఎట్టకేలకు భారత రహదారులపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది. రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ధర ఉండే అవకాశం ఉందని అంచనాలున్నాయి.
లీకైన ఫోటోలలో మహీంద్రా ఎలక్ట్రిక్ SUV బాక్సీ సిల్హౌట్, రగ్గడ్ డిజైన్, 5 డోర్ లేఅవుట్ కనిపిస్తున్నాయి. మహీంద్రా కంపెనీ తన ఈ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ కారుపై వేగంగా పనిచేస్తోంది. త్వరలోనే దీనిని రెడీ చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. మీరు కూడా థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, ఈ స్పై షాట్‌లో వెల్లడైన కారుకు సంబంధించిన 4 అతిపెద్ద, స్పెషాలిటీస్ ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రెసివ్ ఫ్రంట్ లుక్
టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ ప్రొఫైల్ అత్యంత మస్కులర్, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇందులో 2 స్టెప్ ఆకారంలో ఉండే వెడల్పాటి గ్రిల్ ఇచ్చారు. దీనికి రెండువైపులా చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్ హౌసింగ్, అందులో LED లైటింగ్ ఇస్తున్నారు. దాంతో పాటు ఫ్లాట్ క్లామ్‌షెల్ బోనెట్, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, పెద్ద దీర్ఘచతురస్రాకార ORVMలు, స్ట్రాంగ్ ఫ్రంట్ బంపర్ థార్ కారుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ బాక్సీ లుక్‌ను అందిస్తున్నాయి.
పెద్ద అలాయ్ వీల్స్
ఎలక్ట్రిక్ థార్ సైడ్ నుంచి పరిశీలిస్తే.. థార్ ఎలక్ట్రిక్‌ను 5 డోర్ల ప్రాక్టికల్ లేఅవుట్‌తో రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఫ్లాట్ రూఫ్, నిటారైన పిల్లర్లు ఇచ్చారు. ఇందులో ప్రయాణించేవారు థార్ లోకి సులభంగా ఎక్కడానికి, దిగడానికి డోర్ల కింద బలమైన సైడ్ స్టెప్స్ ఇచ్చారు. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దీనికి పెద్ద వీల్స్ ఉంటాయి. వైరల్ అయిన ఫొటోల్లో దాదాపు 19 లేదా 20 అంగుళాల పెద్ద అలాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ మోడల్‌లోని అత్యంత అగ్రెసివ్ టైర్లతో పోలిస్తే, ఈ టెస్ట్ కారులో రోడ్ ఓరియెంటెడ్, రెగ్యులర్ టైర్లు అమర్చారు.
కొత్తగా కనిపించే రియర్ లుక్
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ కారు వెనుక భాగంలో పెద్ద రియర్ గ్లాస్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కనిపిస్తున్నాయి. ఈ టెస్ట్ కారు టెయిల్‌గేట్‌పై బయటి వైపు స్పేర్ వీల్ అమర్చినట్లు కనిపించలేదు. అయితే ప్రొడక్షన్ మోడల్‌లో చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కారు అండర్‌బాడీలో అతిపెద్ద టెక్నికల్ మార్పు చేశారు. అక్కడ రియర్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సెటప్ కనిపిస్తోంది. రెగ్యూలర్ రియర్ యాక్సిల్ నుంచి చేసిన ఈ మార్పు కారు రైడ్ క్వాలిటీని, ఆన్-రోడ్ డ్రైవింగ్ కంఫర్ట్ పెంచుతుంది.
మోడ్రన్ కేబిన్
వైరల్ అయిన ఫొటోల ప్రకారం.. కేబిన్ లోపల ఇల్యూమినేటెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, A-పిల్లర్స్ వద్ద స్ట్రాంగ్ గ్రాబ్ హ్యాండిల్స్ వస్తున్నాయి. విజన్ T, ఈ మధ్య వచ్చిన స్కార్పియో లైఫ్‌స్టైలర్ మాదిరిగానే ఇందులో కూడా మహీంద్రా కొత్త పెద్ద పోర్ట్రెయిట్-స్టైల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో పాటు 2 యాక్సిళ్లపై డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఇస్తారని అందరూ అంచనా వేస్తున్నారు.
Frequently Asked Questions
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎక్కడ, ఏ రూపంలో కనిపించింది?
థార్ ఎలక్ట్రిక్ ముందు, వెనుక డిజైన్ ప్రత్యేకతలు ఏమిటి?
ముందు భాగంలో మస్కులర్ ప్రొఫైల్, 2-స్టెప్ గ్రిల్, చతురస్రాకార LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద గ్లాస్, రైడ్ క్వాలిటీ కోసం కొత్త రియర్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సెటప్ కనిపిస్తాయి.
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ కేబిన్ లోపల ఏ ప్రత్యేకతలు ఉన్నాయి?
కేబిన్ లోపల ఇల్యూమినేటెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బలమైన గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. కొత్త పోర్ట్రెయిట్-స్టైల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
థార్ ఎలక్ట్రిక్ కారుకు ఎలాంటి వీల్స్, సైడ్ ఫీచర్లు ఉన్నాయి?
ఈ కారుకు దాదాపు 19 లేదా 20 అంగుళాల పెద్ద అలాయ్ వీల్స్ అమర్చారు. ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి, దిగడానికి బలమైన సైడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు























