Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Mahindra Cars Waiting Period: మహీంద్రా స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గింది. మహీంద్రా దీని కోసం రూపొందించిన స్ట్రాటజీ వర్కవుట్ అయిందనే చెప్పాలి.
Mahindra Scorpio Waiting Period: మహీంద్రా గత కొంతకాలంగా ఉత్పత్తిని పెంచడానికి, డెలివరీ కోసం వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడానికి కృషి చేస్తుంది. ఈ ప్రయత్నాలు కూడా ఫలించాయి. 2024 జనవరి చివరిలో భారతీయ ఎస్‌యూవీ తయారీదారు దాని ఆర్డర్ బ్యాక్‌లాగ్, డెలివరీ సమయాలను గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత దాని కొన్ని ఎస్‌యూవీల కోసం వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గింది. వీటిలో స్కార్పియో, స్కార్పియో ఎన్ వంటి ఎస్‌యూవీలు ఉన్నాయి.
ఏప్రిల్ నెలలో స్కార్పియో ఎన్ కోసం గరిష్ట వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఐదు నెలలుగా ఉంది. ఇది ఎంట్రీ లెవల్ జెడ్2 డీజిల్ వేరియంట్ కోసం. జెడ్2 పెట్రోల్ ట్రిమ్ వెయిటింగ్ పీరియడ్ మునుపటితో పోలిస్తే దాదాపు ఒక నెల తగ్గింది. మిడ్ స్పెక్, టాప్ స్పెక్ పెట్రోల్ వేరియంట్లు, టాప్ స్పెక్ డీజిల్ ట్రిమ్ కోసం కస్టమర్లు దాదాపు రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సి ఉండగా, మిడ్ స్పెక్ డీజిల్ వేరియంట్‌లు దాదాపు మూడు నుంచి నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంజిన్
మహీంద్రా స్కార్పియో ఎన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇందులో 203 హెచ్‌పీ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ 175 హెచ్‌పీ, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండింటిలో 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. అయితే డీజిల్ ఇంజిన్ మాత్రమే 4డబ్ల్యూడీ ఆప్షన్‌ను కలిగి ఉంది. స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.60 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ఉంటుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వెయిటింగ్ పీరియడ్
ఎంట్రీ లెవల్ స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్ డెలివరీ కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు ఒక నెల నుంచి రెండు, మూడు నెలల వరకు తగ్గింది. మరోవైపు టాప్ స్పెక్ స్కార్పియో క్లాసిక్ ఎస్11 కోసం వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఉంటుంది.
స్కార్పియో క్లాసిక్ ఇంజిన్
స్కార్పియో క్లాసిక్ ఏకైక 132 హెచ్‌పీ, 300 ఎన్ఎం, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ఆప్షన్ లేదా 4డబ్ల్యూడీ ఆప్షన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం స్కార్పియో క్లాసిక్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.13.59 లక్షల నుంచి రూ.17.35 లక్షల మధ్య ఉన్నాయి.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
Master the art of staying cool & more. Take control of the temperature inside your Mahindra XUV 3XO with Adrenox enabled Remote Climate Control.
— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) April 17, 2024
Stay tuned.
Know more: https://t.co/zt2womMQp6#ComingSoon #MahindraXUV3XO pic.twitter.com/lAB4LyMQyz