లంబోర్ఘిని ఉరుస్ SE లాంచ్, ధర అక్షరాల రూ.4.57 కోట్లు! పైసలకు తగినట్లు ఫీచర్లు
Lamborghini Urus SE Launched in india: లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ భారతీయ మార్కెట్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. ఈ సూపర్ లగ్జరీ కారు ధరను రూ. 4.57 కోట్లుగా నిర్ణయించింది.
Lamborghini Urus SE Launched in india: ఇటాలియన్ బ్రాండ్ కంపెనీ లంబోర్ఘిని నుంచి ఉరుస్ సిరీస్ అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కార్ మోడల్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా ఈ కార్లకు కొంచెం డిమాండ్ ఎక్కువే అని చెప్పాలి. గత సంవత్సరం భారత్‌లో లంబోర్ఘిని 103 యూనిట్లను విక్రయించింది. దీంతో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక విక్రయాలను నమోదు చేసి బెంచ్‌మార్క్‌ని సెట్ చేసుకుంది. తొలిసారి మూడంకెల సంఖ్యను ఆ కంపెనీ అందుకోవడంతో ఇండియాలో పూర్తి స్థాయిలో మార్కెట్‌ని విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తుంది. అందులో భాగంగా తాజాగా లంబోర్ఘిని నుంచి సరికొత్త ఉరుసు ఎస్‌ఈ (Urus SE)ని విడుదల చేసింది. దీనిని రూ. 4.57 కోట్ల ప్రారంభ ధరతో అందుబాటులో తెచ్చింది. లంబోర్ఘిని తొలిసారిగా భారత్‌లో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ EV (PHEV)గా కూడా వచ్చింది. అంటే ఇది ఓ హైబ్రిడ్ లగ్జరీ కారుగా మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది అన్నమాట.
డిజైన్ & స్టైలింగ్
Urus SE ఇదే మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మార్పులను చేశారు. బానెట్ గ్రిల్ మునుపటి కంటే కొంచె పెద్దగా ఇవ్వబడ్డాయి. ఇందులోని హెడ్‌ల్యాంప్స్ బానెట్‌లో కలిసిపోయేలా సన్నగా అందించారు. అంతే కాకుండా హెడ్‌లైట్‌లను కవర్ చేసే కొత్త DRLలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెనుక వైపున టెయిల్‌గేట్ స్పాయిలర్‌తో కలిసేలా కొత్త LED టెయిల్ లైట్లతో అప్‌డేట్ చేశారు.
పవర్‌ట్రెయిన్
ఈ సూపర్ లగ్జరీ SUV పవర్‌ట్రెయిన్‌లో భారీ అప్‌డేట్స్‌ని కలిగి ఉంది. ముఖ్యంగా ఇది PHEV సిస్టమ్‌తో జతచేయబడిన ఎలక్ట్రీఫైడ్ 4.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజిన్ ద్వారా పవర్‌ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 620bhp పవర్ మరియు 800nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో సపోర్టు చేయబడి ఉంది. ఈ వెర్షన్‌లో 189 hp మరియు 483 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Urus SE ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఫుల్ ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది గంటకు 130 గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇక దీని ఒరిజినల్ స్పీడ్ గంటకు 312 కి.మీగా ఉంది. ఈ సూపర్ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఇంటీరియర్ ఫీచర్లు
ఉరుస్ SE లంబోర్ఘిని 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో కూడిన ఫ్రంట్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. క్యాబిన్‌లో అప్‌డేట్ చేసిన ఎయిర్ వెంట్స్, అల్యూమినియం యాక్సెంట్స్, డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌లో విలీనం చేయబడిన డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.
డ్రైవింగ్ మోడ్‌లు
ఉరుస్ SE ఏడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. సాధారణ డ్రైవింగ్ కోసం స్ట్రాడ, స్పోర్ట్, కోర్సా మోడ్స్ ఉండగా. ఆఫ్-రోడ్ కోసం నెవ్, టెర్రా, సబ్బియా అనే మోడ్స్ ఉన్నాయి. ఇక విభిన్న రకాల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం EV డ్రైవ్, హైబ్రిడ్, రీఛార్జ్ మరియు ఫర్ఫామెన్స్ మోడ్స్ కలవు. డిజైన్, పవర్‌ట్రెయిన్, ఇంటీరియర్ ఫీచర్‌లు మరియు డ్రైవింగ్ మోడ్స్ అన్నింటిలోనూ ఇది పూర్తి అప్‌డేట్స్‌తో వచ్చింది. ఏ విధంగా చూసుకున్న లంబోర్ఘిని ఉరుస్ SE ఒక హై ఫర్ఫామెన్స్ కలిగిన సూపర్ లగ్జరీ కారుగా అందుబాటులో ఉంటుంది.