News
News
X

Kia Sonet Sales Record: రెండేళ్లలోనే 1.5 లక్షల యూనిట్లు - కియా సోనెట్ సూపర్ సేల్స్ రికార్డు!

కియా సోనెట్ కారు 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటిందని కంపెనీ ప్రకటించింది.

FOLLOW US: 

దక్షిణ కొరియా కార్ల తయారీ బ్రాండ్ కియా మోటార్స్ కారు సోనెట్ మనదేశంలో కొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ కారు 1.5 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయిందని కంపెనీ తెలిపింది. మనదేశంలో ఏ బ్రాండ్‌కు అయినా ఇది పెద్ద మైలురాయి. కియా నిజానికి మనదేశంలో కొత్త బ్రాండే అయినా భారతీయులను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి.

కియా పేరెంట్ కంపెనీ హ్యుండాయ్‌కి మనదేశంలో మంచి మార్కెట్ ఉండటం కియాకు కలిసొచ్చింది. కియా లాంచ్ చేసిన కార్ల మీద కూడా కొంచెం హ్యుండాయ్ మార్కు కనిపిస్తుంది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో కియా సోనెట్ ఫేవరెట్ కారుగా మారిపోయింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఎక్కువగా అందుతున్నాయి. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉండటం విశేషం.

కియా సోనెట్‌కు సంబంధించి ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే కరోనావైరస్ పీక్‌లో ఉన్న టైంలో ఈ కారు లాంచ్ అయింది. 2020 సెప్టెంబర్‌లో ఈ కారును కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత చిప్ స్టోరేజ్, సప్లై చైన్ సమస్యలు ఇన్ని చుట్టుముట్టినా కియా 1.5 లక్షల యూనిట్లను డెలివరీ చేయగలిగింది.

కియా ఇటీవలే తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను కూడా మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.59.95 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర కాగా... టాప్ ఎండ్ జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.65.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.

ప్రత్యేకమైన ఈవీ ప్లాట్‌ఫాంపై కియా ఈవీ6ను రూపొందించారు. కియా మనదేశంలో మొదట కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ కారు కావడం విశేషం. కియా ఈవీ6 కోసం మొత్తంగా 350 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. మొదట బుక్ చేసుకున్న 100 మంది వినియోగదారులకు కారును కచ్చితంగా డెలివరీ చేయనున్నారు. మిగిలిన వారికి బుకింగ్ అమౌంట్ రీఫండ్ ఇస్తారా... లేదా ఇంపోర్ట్ నంబర్ పెంచి వారికి కూడా డెలివరీ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ రాలేదు.

దీనికి డెలివరీలు 2022 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. కియా ఈవీ6 ఒక ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కారు. సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద లార్జ్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఇందులో అందించారు. ముందువైపు బంపర్ డిజైన్ చాలా క్లీన్‌గా స్టైలిష్‌గా ఉండనుంది. కారు డిజైన్ కూడా స్పోర్టీగా ఉంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 528 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 350 కేడబ్ల్యూహెచ్ చార్జర్‌ను ఉపయోగిస్తే 10 నుంచి 80 శాతం చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ తెలిపింది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 25 Jun 2022 06:31 PM (IST) Tags: Kia Kia Sonet Sales Kia Sonet 1.5 Lakh Units Sales Kia Sonet Sales Record Kia Sonet

సంబంధిత కథనాలు

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!