అన్వేషించండి

సరికొత్త లుక్‌లో రానున్న New Kia Sonet .. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో వచ్చే మార్పులివే

New Kia Sonet: కియా సోనెట్ SUV ముందు భాగం మరింత వెడల్పుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని టెస్టింగ్‌లో ఇదే కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త LED DRLలు, మోడ్రన్ హెడ్‌ల్యాంప్‌లు ఇవ్వనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త కియా సోనెట్: ప్రీమియం లుక్, స్టైలిష్ డిజైన్ తో రానుంది.
  • పెద్ద 12.3-అంగుళాల స్క్రీన్, అధునాతన ఇంటీరియర్స్ తో వస్తుంది.
  • కొత్త K1 ప్లాట్‌ఫారమ్, ADAS తో మెరుగైన భద్రత అందిస్తుంది.
  • ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లు, భవిష్యత్ హైబ్రిడ్ టెక్నాలజీ తో రానుంది.

Kia Sonet New Design and Features | భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇదే సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును Kia Sonet తెచ్చుకుంది. ఇప్పుడు కియా కంపెనీ ఈ పాపులర్ SUVని కొత్త లుక్‌లో రీడిజైన్ చేసి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల న్యూ జనరేషన్ కియా సోనెట్‌ను టెస్టింగ్ చేస్తున్న సమయంలో కొందరు దీన్ని గుర్తించారు. దాంతో దీని డిజైన్, ఫీచర్లకు సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. కియా కొత్త సోనెట్ గతంలో కంటే చాలా స్టైలిష్‌గా, ఫీచర్-లోడెడ్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త Kia Sonet పూర్తిగా క్యామఫ్లేజ్ తో కప్పి ఉంది. అయినప్పటికీ కొత్త మోడల్‌కు సంబంధించిన పలు డిజైన్ ఎలిమెంట్స్ కనిపించాయి. కొత్త కియా సోనెట్ SUV ఫ్రంట్ లుక్ ఇప్పుడు గతంలో కంటే మరింత వెడల్పుగా, బోల్డ్‌గా కనిపించనుంది. ఇందులో పెద్ద గ్రిల్, కొత్త LED DRL, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ వచ్చే అవకాశం ఉంది. కియా కంపెనీ దీని డిజైన్‌ను తన పెద్ద SUV అయిన Kia Seltos ఆధారంగా డిజైన్ చేయవచ్చు. దీనివల్ల ఇది పాత డిజైన్ కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

ఇంటీరియర్ ఎలా ఉంటుంది?
కొత్త Kia Sonet లో కేవలం బయటి భాగంగలో మార్పులు మాత్రమే ఉండవు. దీని ఇంటీరియర్‌లో కూడా మార్పులు చూడవచ్చు. నివేదికల ప్రకారం, ఇందులో పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్, కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన సీట్లు, మరింత ప్రీమియం క్యాబిన్ ఇవ్వనున్నారు. ఇది కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్ కనెక్టెడ్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీ కూడా చేరుతుంది. దాంతో కియా సోనెట్ ఈ విభాగంలో తన ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వగలదు.

Read Also: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే

సేఫ్టీ విషయంలో కూడా కొత్త సోనెట్ చాలా స్ట్రాంగ్‌గా మారనుంది. దీనిని కొత్త K1 ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. దీనివల్ల దీని కియా సోెనెట్ బాడీ స్ట్రక్చర్, బలం మరింత మెరుగవుతాయి. దీనితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల వాహనదారులకు డ్రైవింగ్ గతంలో కంటే మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారవచ్చు.

ఇంజిన్ వివరాలు, మార్కెట్లో పోటీదారులు
కియా సోనెట్ న్యూ జనరేషన్ ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లనే కంటిన్యూ చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్లు మ్యాన్యువల్, iMT, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో రావచ్చు. సమాచారం ప్రకారం, కంపెనీ భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా వర్క్ చేస్తోంది. 

భారత మార్కెట్లో కొత్త Kia Sonet పోటీ మారుతి సుజుకీ బ్రెజ్జా ( Maruti Suzuki Brezza), Tata Nexon, మహీంద్రా ఎక్స్‌యూవీ (Mahindra XUV 3XO), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) వంటి వాహనాలతో ఉంటుంది. కియా కంపెనీ దీని కొన్ని మోడల్స్ ఈ ఏడాది రిలీజ్ చేస్తే.. వచ్చే ఏడాదికి మరికొన్ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అడ్వాన్స్డ్ సేఫ్టీతో ఈ SUV కస్టమర్లకు ఒక బలమైన ఆప్షన్‌గా మారవచ్చు.

Also Read: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

Frequently Asked Questions

కొత్త కియా సోనెట్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయి?

కొత్త కియా సోనెట్‌కు ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త LED DRL, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు ఉండనున్నాయి. కియా సెల్టోస్‌ను పోలి ఉండేలా దీని డిజైన్‌ను మార్పు చేయవచ్చు.

కొత్త కియా సోనెట్ ఇంటీరియర్‌లో ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

కొత్త సోనెట్‌లో పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్, కొత్త డ్యాష్‌బోర్డ్, మెరుగైన సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్ కనెక్టెడ్ ఫీచర్లు అందించనున్నారు.

కొత్త కియా సోనెట్‌లో ఏ ఇంజిన్‌లు అందుబాటులో ఉంటాయి?

ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కొనసాగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా పనిచేస్తున్నారు.

కొత్త కియా సోనెట్‌కు భారత మార్కెట్లో పోటీదారులు ఎవరు?

మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో కియా సోనెట్ పోటీ పడనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget