అన్వేషించండి

Car AC Cooling Soulution: మీ కారు ఏసీ తగినంత కూలింగ్‌ ఇవ్వట్లేదా?, ఈ చిట్కాలు పాటిస్తే హిమాలయాల్లో ఉన్నట్లుంటుంది!

Car AC Cooling Tips: మండే ఎండల్లో కారులోని AC చల్లదనం, ప్రయాణాన్ని హాయిగా మారుస్తుంది. AC సరిగ్గా పనిచేయకపోతే నడిరోడ్డుపై నరకం కనిపిస్తుంది.

Car AC Cooling Problems And Solutions: కారు ఏసీ కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు, అవసరం కూడా. మారిన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, కారులో ఏసీ లేకపోతే ఓవెన్‌లో కూర్చుని ప్రయాణించినట్లు ఉంటుంది, గమ్యస్థానం చేరేసరికి ప్రయాణీకులు ఫ్రై అవుతారు. కారు ఏసీ మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి బదులు అసౌకర్యానికి గురి చేస్తుంటే, దానికి కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ కారు ఏసీ గాలి తగినంత చల్లగా లేకపోతే, దాని మూడు ప్రధాన కారణాలు & సులభమైన పరిష్కారాలు ఉన్నాయి.

1. తక్కువ రిఫ్రిజెరాంట్ (ఫ్రియాన్) స్థాయి
ఫ్రియాన్ (freon) అని పిలిచే రిఫ్రిజెరాంట్ (refrigerant), కారు AC వ్యవస్థలో చల్లని గాలిని అందించే ఒక గ్యాస్‌. ఈ గ్యాస్‌ అయిపోతే AC సరిగ్గా చల్లబడదు. ఫ్రియాన్ లెవెల్‌ తగినంత లేదనడానికి సంకేతాలు: AC ఆన్ చేసిన తర్వాత కూడా చల్లని గాలి లేకపోవడం లేదా ప్రారంభంలో కొన్ని నిమిషాలు చల్లబడిన తర్వాత వేడి గాలి బయటకు రావడం. దీనికి పరిష్కారం - అనుభవజ్ఞుడైన మెకానిక్ వద్దకు లేదా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి AC సిస్టమ్‌ ప్రెజర్‌ను & గ్యాస్ స్థాయిని తనిఖీ చేయించాలి, గ్యాస్‌ అవసరమైతే తిరిగి నింపించాలి. అలాగే, ఎక్కడైనా లీకేజీ ఉందేమో కనుక్కోవడానికి సిస్టమ్‌ను చెక్‌ చేయించాలి.

2. కండెన్సర్‌లో దుమ్ము పేరుకుపోవడం
కండెన్సర్ (Condenser) అనేది AC వ్యవస్థలో వేడిని తొలగించి రిఫ్రిజెరాంట్‌ను చల్లబరుస్తుంది. దుమ్ము, ధూళి లేదా కీటకాలు దానిలో పేరుకుపోతే అది తన పనిని సరిగా చేయలేదు. ఈ సమస్య AC కూలింగ్‌ను తగ్గిస్తుంది. దీనికి సంకేతాలు: కారు పార్క్ చేసినప్పుడు చల్లదనం చాలా తక్కువగా ఉంటుంది, అయితే నడుస్తున్నప్పుడు చల్లదనం కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి కండెన్సర్‌ను మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌తో శుభ్రం చేయాలి. అవసరమైతే వాటర్ జెట్‌తో కడగాలి. 

3. కంప్రెసర్ పని చేయకపోవడం
కంప్రెసర్‌ (Compressor) అనేది AC గుండె లాంటిది. ఎందుకంటే, ఇది చల్లటి గాలిని ఉత్పత్తి చేయడానికి రిఫ్రిజెరాంట్‌ను కంప్రెస్‌ చేస్తుంది. దీని బెల్ట్ వదులుగా ఉన్నా లేదా విరిగిపోయినా లేదా కంప్రెసర్ జామ్ అయినా AC పని చేయదు. AC ఆన్ చేసినప్పుడు వింత శబ్దాలు వినిపిస్తాయి లేదా చల్లని గాలి అస్సలు రాదు. కంప్రెసర్ పనితీరుపై ఓ కన్నేయడానికి ఇలాంటి సంకేతాలను గమనిస్తుండాలి. కారులోని AC చాలా కాలం ఉపయోగించకపోతే కంప్రెసర్‌ స్ట్రక్‌ కావచ్చు. పరిష్కారాలు - కారును సర్వీస్ సెంటర్‌లో చెక్‌ చేయించాలి & బెల్ట్ దెబ్బతింటే వెంటనే దాన్ని మార్చాలి. అవసరమైతే, కంప్రెసర్‌ను రిపేర్ కూడా చేయాల్సి రావచ్చు లేదా మార్చాల్సి రావచ్చు.

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ దుమ్ముతో మూసుకుపోయినా అది AC కూలింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్‌ను తనిఖీ చేయండి & ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget