అన్వేషించండి

Tata Punch EMI: ఏప్రిల్‌లో ఎక్కువగా అమ్ముడుపోయిన టాటా పంచ్‌ కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి? ఈ మోడల్ ఏ కార్లతో పోటీ పడుతుంది?

Tata Punch EMI: భారతీయ కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ఏప్రిల్ నెల విక్రయాల్లో టాటా పంచ్ టాప్‌లో నిలిచింది. ఇంతకీ ఈ కారు కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా పంచ్ ఏప్రిల్ లో 19,107 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది.
  • మారుతి ఫ్రాంక్స్ 18,829 యూనిట్లతో, టాటా నెక్సాన్ 18,126 యూనిట్లతో పోటీ ఇస్తున్నాయి.
  • టాటా పంచ్ 6.85 లక్షల నుండి ప్రారంభమై, EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
  • EMI మోడల్, వేరియంట్, డౌన్ పేమెంట్, రుణ వ్యవధిపై ఆధారపడి మారుతుంది.

India Top Selling SUVs Tata Punch EMI: భారత్‌లో వాహన వినియోగదారుల అభిరుచి మారుతోంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌ కార్లకు పెట్టింది పేరైన మన దేశంలో ఇప్పుడు చిన్న క్రాస్‌ఓవర్లు, రైజ్‌ హ్యాచ్‌బ్యాక్‌లు, కంపాక్ట్‌ ఎస్‌యూవీల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అరుదుగా కనిపించే సబ్‌4 మీటర్ విభాగంలో భారత్‌లో అత్యంత పోటీతత్వంతో కూడిన రంగంగా మారింది. దాదాపు ప్రతి వాహన తయారీ సంస్థ ఈ విభాగంలో కనీసం ఒక మోడ్ అయినా రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్‌ నెల అమ్మకాలు పరిశీలిస్తే  భారతీయ వినియోగదారులు ఏ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. 

నంబర్ వన్‌ స్థానంలో పంచ్ 

గత నెలలో టాటా మోటార్స్ తన పంచ్‌ పవర్‌ను చూపించింది. టాటా పంచ్ మోడ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌లో మొత్తం 19,107 యూనిట్లను విక్రయించి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో టాటా పంచ్‌ను అప్‌డేట్‌ చేయడం ఆ సంస్థకు బాగా కలిసి వచ్చింది. టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి తీసుకురావడంతో వినియోగదారులు ఎగబడ్డారు. పంచ్‌ ఇప్పుడు మాన్యువల్‌, ఏఎంటీ గేర్ బాక్స్‌ ఆప్షన్స్‌తోపాటు, పెట్రోల్, సీఎన్జీ ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో లభిస్తోంది. 

పంచ్‌కు పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు 

దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ఫ్రాంక్స్‌ మోడల్‌తో టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఏప్రిల్‌లో ఈ కారు 18,829 యూనిట్ల విక్రయాలతో ఇది రెండో స్థానంలో ఉంది. బలేనో ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి ఫ్రాంక్స్, మారుతి లైన్‌లో టర్బో- పెట్రోల్‌ ఇంజిన్‌ను ఆఫర్ చేస్తున్న ఏకైక మోడల్ కావడంతో కొనుగోలు సంఖ్య పెరిగింది.   

మూడో స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. ఇది 18,126 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది పెట్రోల్‌, డీజిల్, సీఎన్జీ, ఈవీ రూపాల్లో అందుబాటులో ఉంది. దీని తర్వాత హ్యుందాయ్ క్రెటా (15,291) మహీంద్రా స్కార్పియో(14,719),మారుతి బ్రెజ్జా(14,124), టయోటా విక్టోరిస్‌(13,701) హ్యుందాయ్‌ వెన్యూ(12, 420), కియా సెల్టోస్‌(10,566) కియా సోనెట్‌(10,537) గత నెలలో అమ్ముడయ్యాయి. 

అమ్మకాల్లో టాప్‌లో ఉన్న పంచ్‌ ఈఎంఐ ఎంత?

టాటా పంచ్‌ పెట్రోల్‌ ఎంటీ వెహికల్‌ 6.85 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు మీరు కొనాలని అనుకుంటే మీరు మొత్తం అమౌంట్‌ను ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. ఒక లక్ష రూపాయలు డౌన్‌పేమెంట్‌ చెల్లించి మిగతా అమౌంట్‌ కోసం లోన్‌కు వెళ్లొచ్చు. అంటే ఐదు లక్షల 90 వేల రూపాయలను 9 శాతం వడ్డీతో ఏడేళ్ల కోసం లోన్ తీసుకుంటే మీరు నెలకు 9, 493 రూపాయలు చెల్లించాలి. అదే అమౌంట్‌ ఆరేళ్లకు తీసుకుంటే నెలకు 10, 635 రూపాయలు చెల్లించాలి. ఐదేళ్లకు తీసుకుంటే 12, 247 రూపాయలు నెల నెల బ్యాంకులో జమ చేయాలి. నాలుగేళ్లకు తీసుకుంటే 14, 682 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. మూడు సంవత్సరాల కోసం అప్పుగా తీసుకుంటే 18, 762 రూపాయలు చెల్లించాలి. రెండేళ్లకు తీసుకుంటే మీరు 26, 954 చెల్లించాలి. 

ఈఎంఐ అనేది మీరు ఎంచుకున్న మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. మీరు ఉండే రాష్ట్రంలో ఉన్న పన్నుల ఆధారంగా కూడా మారుతుంది. మీ సిబిల్ స్కోరు సరిగా ఉంటే తక్కువ వడ్డికే మీకు లోన్ లభిస్తుంది. అదే మీ సిబిల్ సరిగా లేకపోతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన SUV ఏది?

ఏప్రిల్ నెలలో టాటా పంచ్ అత్యధికంగా 19,107 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది.

టాటా పంచ్ EMI ఎంత?

లక్ష రూపాయల డౌన్ పేమెంట్ తో, 5.90 లక్షల రూపాయలకు 9% వడ్డీతో 7 సంవత్సరాల లోన్ తీసుకుంటే, EMI నెలకు 9,493 రూపాయలు వస్తుంది.

టాటా పంచ్ తో పాటు ఏయే SUVలు అమ్మకాలలో పోటీ ఇస్తున్నాయి?

మారుతి ఫ్రాంక్స్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి బ్రెజ్జా, టయోటా విక్టోరిస్, హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్, కియా సోనెట్ అమ్మకాలలో పోటీనిస్తున్నాయి.

EMI మొత్తం వేరియంట్ మరియు కాలపరిమితిని బట్టి మారుతుందా?

అవును, EMI మీరు ఎంచుకున్న మోడల్, వేరియంట్, లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు, మరియు మీ సిబిల్ స్కోరుపై ఆధారపడి మారుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget