అన్వేషించండి

విదేశాల్లో కార్ నడపాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరి - దీని కోసం ఎలా అప్లై చేయాలి?

ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవ్ చేయాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరం. దీని కోసం ఎలా అప్లై చేయాలి? అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజు వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విదేశాల్లో డ్రైవింగ్ చేయాలంటే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (IDP) తప్పనిసరి.
  • IDP మీ భారతీయ లైసెన్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఇస్తుంది, 150 దేశాల్లో చెల్లుతుంది.
  • పరివాహన్ పోర్టల్ ద్వారా IDP కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • IDP పొందడం చట్టపరమైన సమస్యలను నివారిస్తుంది, ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

Indian Driving Licence Abroad: విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అక్కడ స్వయంగా కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కేవలం ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ & వీసా ఉన్నంత మాత్రాన విదేశాల్లో చట్టబద్ధంగా డ్రైవ్ చేయలేరు.

విదేశాల్లో డ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరం. ఇది మీ భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చే అధికారిక పత్రం.       

IDP అంటే ఏమిటి?

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ఆధారంగా జారీ చేసే పత్రం. ఇది మీ డ్రైవింగ్ అర్హతలను అనేక భాషల్లో అనువదించి విదేశీ అధికారులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.

ఈ IDP 150కి పైగా దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. ఇందులో మీ ఫోటో, వ్యక్తిగత వివరాలు, మీరు నడపగల వాహనాల కేటగిరీలు ఉంటాయి.

సాధారణంగా, IDP జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. విదేశాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు IDPతో పాటు మీ ఒరిజినల్ ఇండియన్ లైసెన్స్, పాస్‌పోర్ట్ కూడా తప్పనిసరిగా మీ వెంట ఉండాలి.

ఎక్కడ అప్లై చేయాలి?

IDP కోసం అప్లై చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ (Ministry of Road Transport and Highways) నిర్వహిస్తున్న పరివాహన్‌ పోర్టల్‌ (Parivahan Portal) ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

IDP కోసం Form 4A నింపాలి. ఈ ఫారం పరివాహన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

అప్లికేషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు:

చెల్లుబాటు అయ్యే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ

Form 1Aలో మెడికల్ సర్టిఫికేట్

పాస్‌పోర్ట్ ప్రూఫ్

వీసా ప్రూఫ్ (అవసరమైతే)

నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

రూ. 1,000 ఫీజు

ఈ ఫీజును UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆధార్ ధృవీకరణ లేదా స్థానిక RTO వద్ద అపాయింట్‌మెంట్ అవసరం కావచ్చు.

అప్లికేషన్ సమర్పించి ధృవీకరణ పూర్తయిన తర్వాత సాధారణంగా 3 నుంచి 7 పని దినాల్లో IDP ని మీ నమోదిత చిరునామాకు పంపిస్తారు.

ఎందుకు అవసరం?

కొన్ని దేశాల్లో IDP లేకుండా కారును అద్దెకు తీసుకోవడం లేదా డ్రైవ్ చేయడం అసాధ్యం. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే IDP పొందడం మంచిది.

విదేశాల్లో స్వేచ్ఛగా డ్రైవింగ్ చేసి మంచి అనుభవం పొందాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరి. కేవలం ఇండియన్ లైసెన్స్ మాత్రమే మీకు సరిపోదు. ప్రయాణానికి ముందు సరైన పత్రాలు సిద్ధం చేసుకుని చట్టబద్ధంగా డ్రైవ్ చేయండి. ప్లానింగ్ సరిగా ఉంటే విదేశీ ప్రయాణం మరింత సులభం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

విదేశాల్లో డ్రైవ్ చేయడానికి భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందా?

లేదు, కేవలం భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ & వీసా ఉంటే విదేశాల్లో చట్టబద్ధంగా డ్రైవ్ చేయలేరు. దీనికి తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అవసరం.

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) అంటే ఏమిటి?

IDP అనేది ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ఆధారంగా జారీ చేసే పత్రం. ఇది మీ డ్రైవింగ్ అర్హతలను విదేశీ అధికారులకు సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.

IDP ఎక్కడ మరియు ఎలా అప్లై చేయాలి?

IDP కోసం కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ పరివాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. Form 4A నింపి, అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజు చెల్లించాలి.

IDP తో పాటు ఏ ఇతర పత్రాలు తీసుకెళ్లాలి?

విదేశాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు IDP తో పాటు మీ ఒరిజినల్ ఇండియన్ లైసెన్స్, పాస్‌పోర్ట్ కూడా తప్పనిసరిగా మీ వెంట ఉండాలి.

IDP పొందడం ఎందుకు అవసరం?

కొన్ని దేశాల్లో IDP లేకుండా కారును అద్దెకు తీసుకోవడం లేదా డ్రైవ్ చేయడం అసాధ్యం. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది, కాబట్టి ఇది తప్పనిసరి.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget