అన్వేషించండి

వెహికల్‌ లోన్‌ తీర్చేశారా? RCలో హైపోతికేషన్ తీసేయించడానికి RTOకి వెళ్లాల్సిన అవసరం లేదిప్పుడు!

కార్‌ లేదా బైక్‌ లోన్‌ పూర్తిగా చెల్లించారా? ఇక ఆర్‌టీఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. RCలో హైపోతికేషన్ తొలగింపు ప్రాసెస్‌ను వాహన్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCలో హైపోథికేషన్ తొలగింపు ఇప్పుడు ఆన్లైన్లో సులభతరం.
  • రుణం చెల్లించిన తర్వాత వాహనంపై పూర్తి హక్కులు పొందండి.
  • వాహన్ పోర్టల్లో ఫారం 35, NOC అప్లోడ్ చేయాలి.
  • కొన్ని రాష్ట్రాల్లో RTOను సందర్శించి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

RC Hypothecation Removal: మీరు బ్యాంక్‌ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని స్కూటర్‌, బైక్‌, కారు లేదా మరేదైనా వెహికల్‌ కొనుగోలు చేశారా? ఆ లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేశారా? అయితే మీకో ముఖ్యమైన శుభవార్త. ఇకపై, మీ బండి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (RC)లో హైపోతికేషన్ తొలగించేందుకు RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు వాహన్ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే హైపోతికేషన్ టెర్మినేషన్ (Hypothecation Termination In RC) పూర్తి చేయవచ్చు.            

హైపోతికేషన్ అంటే ఏమిటి? 

మీరు లోన్‌పై వాహనం కొనుగోలు చేసినప్పుడు, మీ RC కార్డులో బ్యాంక్‌ లేదా ఫైనాన్స్ సంస్థ పేరు ఉంటుంది. ఇది, ఆ వాహనం రుణ తాకట్టులో ఉందని సూచిస్తుంది. మీరు లోన్ మొత్తం చెల్లించిన తర్వాత కూడా ఆ వివరాలు RCలో అలాగే ఉంటాయి. అందుకే వాటిని అధికారికంగా తొలగించాలి. ఈ ప్రక్రియనే హైపోతికేషన్ టెర్మినేషన్ అంటారు.

ఎందుకు ఇది అవసరం?

మీరు వాహనాన్ని అమ్మాలనుకుంటే, ఓనర్‌షిప్ మార్చాలనుకుంటే లేదా RCలో పూర్తి హక్కులు మీ పేరుపైనే ఉండాలంటే హైపోతికేషన్ తొలగింపు తప్పనిసరి. ఇది చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అవసరమైన పత్రాలు

హైపొతికేషన్ టెర్మినేషన్ కోసం ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:

బ్యాంక్‌ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)

RTO ఫారం 35

ఒరిజినల్ RC

చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్

ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?

ముందుగా vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.

“Online Services”లో “Vehicle Related Services” ఎంచుకోవాలి.

మీ వెహికల్‌ రిజిస్ట్రేషన్ నంబర్‌, ఛాసిస్ నంబర్ నమోదు చేసి OTP పొందాలి.

మీ మొబైల్‌కు వచ్చిన OTP నమోదు చేసి లాగిన్ కావాలి.

“Hypothecation Termination” ఎంపిక చేసి కొనసాగాలి.

అవసరమైన డాక్యుమెంట్లు DMS ద్వారా అప్‌లోడ్ చేయాలి.

ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.

ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ RTOలో పరిశీలనకు వెళ్తుంది. అధికారుల ఆమోదం తర్వాత RCలో హైపోతికేషన్ తొలగింపు జరుగుతుంది.

కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతి లేదు

కొన్ని రాష్ట్రాల్లో, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత కూడా ఫారం 35, ఇతర అవసరమైన పత్రాలను RTOకి తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. అందుకే మీ రాష్ట్రంలో అమల్లో ఉన్న నియమాలు ముందుగా తెలుసుకోవడం మంచిది.

లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత RCలో హైపోతికేషన్ తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ సదుపాయం వల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. మీరు లోన్ క్లోజ్ చేసిన వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసి మీ వాహనంపై పూర్తి హక్కులు మీ పేరుపైనే ఉండేలా చూసుకోండి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త పడండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

RC లో హైపోతికేషన్ తొలగింపు ప్రక్రియ అంటే ఏమిటి?

లోన్‌పై కొన్న వాహనం రుణ విముక్తి పొందిన తర్వాత, RCలో ఉన్న బ్యాంక్‌ లేదా ఫైనాన్స్ సంస్థ పేరును తొలగించడమే హైపోతికేషన్ టెర్మినేషన్.

RCలో హైపోతికేషన్ తొలగింపు ఎందుకు అవసరం?

వాహనాన్ని అమ్మడానికి, ఓనర్‌షిప్ మార్చడానికి లేదా RCపై పూర్తి హక్కు పొందడానికి ఈ తొలగింపు తప్పనిసరి.

RCలో హైపోతికేషన్ తొలగింపుకు ఏ పత్రాలు కావాలి?

బ్యాంక్‌ NOC, RTO ఫారం 35, ఒరిజినల్ RC, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ అవసరం.

RCలో హైపోతికేషన్ తొలగింపును ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?

vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, 'Vehicle Related Services'లో 'Hypothecation Termination' ఎంపిక చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.

టాప్ హెడ్ లైన్స్

అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget