అన్వేషించండి

స్విఫ్ట్‌, వాగన్‌ఆర్‌పై భారీ బెనిఫిట్స్‌, లిస్ట్‌లో ఇంకొన్ని మారుతి కార్లు - ఫిబ్రవరి 28 వరకే ఈ ఆఫర్లు

ఫిబ్రవరి 2026లో మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని షోరూమ్‌లలో ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి స్విఫ్ట్ పై ₹45,000 వరకు, వాగన్ ఆర్ పై ₹37,500 వరకు ఆఫర్లు.
  • వాగన్ ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 మోడళ్లపై ₹37,500 వరకు ప్రయోజనం.
  • మారుతి బ్రెజ్జాపై ₹30,000 వరకు, డిజైర్, ఎర్టిగాపై పరిమిత కార్పొరేట్ ఆఫర్లు.
  • ఫిబ్రవరి 28, 2026 వరకు ఆఫర్లు, స్టాక్ అందుబాటును బట్టి మారవచ్చు.

Maruti Suzuki Discount Offers February 2026: కొత్త కార్‌ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇదే సరైన సమయం కావచ్చు. Maruti Suzuki, తన అరేనా డివిజన్‌ కార్లపై ఫిబ్రవరి 2026లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా Maruti Swiftపై ₹45,000 వరకు, Maruti Wagon Rపై ₹37,500 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

స్విఫ్ట్‌పై గరిష్ట బెనిఫిట్‌

స్విఫ్ట్‌ AMT వేరియంట్లపై గరిష్టంగా ₹45,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. మాన్యువల్‌ పెట్రోల్‌, CNG వేరియంట్లపై ₹40,000 వరకు డిస్కౌంట్‌ ఉంది. ప్రస్తుతం స్విఫ్ట్‌ ధర ₹5.78 లక్షల నుంచి ₹8.64 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). హైదరాబాద్‌, విజయవాడలో ఆఫర్‌ మొత్తాలు డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది. స్టాక్‌ అందుబాటులో ఉన్నంతవరకే ఈ బెనిఫిట్స్‌ వర్తిస్తాయి.

వాగన్‌ఆర్‌, సెలెరియో, ఎస్‌-ప్రెస్సో, ఆల్టో K10కు ఒకే రకం ఆఫర్లు

వాగన్‌ఆర్‌పై మొత్తం ₹37,500 వరకు ప్రయోజనం అందిస్తున్నారు. ఇందులో ₹10,000 కన్స్యూమర్‌ ఆఫర్‌, ₹15,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ లేదా ₹25,000 స్క్రాప్‌ బోనస్‌, అలాగే ₹2,500 కార్పొరేట్‌ ఆఫర్‌ ఉన్నాయి. వాగన్‌ఆర్‌ ప్రారంభ ధర ₹4.98 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

అలాగే Maruti Celerio, Maruti S-Presso, Maruti Alto K10 మోడళ్లపై కూడా ₹37,500 వరకు లాభం ఉంది. ఆల్టో K10 ధర ₹3.69 లక్షల నుంచి మొదలవుతుంది (ఎక్స్‌-షోరూమ్‌ ధర). ప్రస్తుతం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన మారుతి కార్‌ ఇదే.

బ్రెజ్జా, డిజైర్‌, ఎర్టిగాపై కూడా ప్రయోజనాలు            

Maruti Brezzaపై ₹30,000 వరకు ఆఫర్‌ ఉంది. ఇందులో ₹15,000 ఎక్స్చేంజ్‌ లేదా ₹25,000 స్క్రాప్‌ బోనస్‌, ₹5,000 కార్పొరేట్‌ ఆఫర్‌ ఉన్నాయి. బ్రెజ్జా ధర ₹8.25 లక్షల నుంచి ₹12.85 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

Maruti Dzire & Maruti Ertigaపై మాత్రం పరిమిత కార్పొరేట్‌ ఆఫర్లు మాత్రమే ఉన్నాయి. డిజైర్‌పై ₹2,500, ఎర్టిగాపై ₹5,000 వరకు లాభం లభిస్తుంది. డిజైర్‌ ప్రారంభ ధర ₹6.25 లక్షలు, ఎర్టిగా ₹8.80 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి ప్రారంభమవుతుంది.

కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయం

ఈ ఆఫర్లు నగరానికి నగరానికి మారవచ్చు. హైదరాబాద్‌, విజయవాడ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీ సమీపంలోని మారుతి అరేనా షోరూమ్‌ను సంప్రదించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం మంచిది. స్టాక్‌ అందుబాటులో ఉన్నంతవరకే డిస్కౌంట్‌లు వర్తిస్తాయి.

మొత్తానికి, ఫిబ్రవరిలో మారుతి కార్‌ కొనాలని అనుకుంటే ఇది మంచి అవకాశం. ముఖ్యంగా స్విఫ్ట్‌, వాగన్‌ఆర్‌ వంటి పాపులర్‌ మోడళ్లపై ఇంత భారీ బెనిఫిట్‌ అరుదుగా కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా మీ బడ్జెట్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకుని ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.     

Frequently Asked Questions

ఫిబ్రవరి 2026లో మారుతి సుజుకి ఏయే కార్లపై ఆఫర్లు అందిస్తోంది?

మారుతి సుజుకి తన అరేనా డివిజన్ కార్లపై ఫిబ్రవరి 2026లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా స్విఫ్ట్, వాగన్ ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, బ్రెజ్జా, డిజైర్, మరియు ఎర్టిగా మోడళ్లపై ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

స్విఫ్ట్ కారుపై ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుంది?

స్విఫ్ట్ AMT వేరియంట్లపై గరిష్టంగా ₹45,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. మాన్యువల్ పెట్రోల్, CNG వేరియంట్లపై ₹40,000 వరకు డిస్కౌంట్ ఉంది.

వాగన్ ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 మోడళ్లపై ఎంత ప్రయోజనం ఉంది?

వాగన్ ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో K10 మోడళ్లపై మొత్తం ₹37,500 వరకు లాభం ఉంది. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ లేదా స్క్రాప్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ కలిసి ఉన్నాయి.

బ్రెజ్జాపై ఆఫర్ వివరాలు ఏమిటి?

మారుతి బ్రెజ్జాపై ₹30,000 వరకు ఆఫర్ ఉంది. ఇందులో ఎక్స్చేంజ్ లేదా స్క్రాప్ బోనస్, మరియు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి.

ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి?

ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరానికి నగరానికి ఆఫర్ మొత్తాలు మారే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget