Rolls Royce Cars Latest Updates: షాకింగ్.. ఒకేసారి 3 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసిన ఇండియన్ బిజినెస్ మేన్.. ఆ మోడల్స్ ఏంటంటే..?
రోల్స్ రాయిస్ 3 కార్లను ఒకేసారి కొనుగోలు చేసిన ఒక భారతీయ బిజినెస్ మేన్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారారు. సోషల్ మీడియాలో ఈ కార్లకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. ఆ కార్ల మోడల్ ఏంటో తెలుసుకుందామా..!!

Rolls Royce Cars Model details: అత్యంత ప్రీమియం కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కు ఒక రేంజీ ఉంటుంది. ఆ కార్లును కొనడం కూడా అంతా ఆషామాషీ కాదని చెబుతారు. కొంత హోదా చూసి, కూడా కార్లను అమ్ముతారని వినికిడి. అలాంటిది ఆ కారును ఒక్కటి కొనుగోలు చేస్తేనే ఆ వ్యక్తి లైమ్ లైట్లో ఉంటాడు. అలాంటిది ఒకేరోజు మూడు రోల్స్ రాయిస్ కార్లను ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ బిజినిస్ మేన్.. సంజయ్ ఘోడావత్ ఒకే రోజులో మూడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. వీటిలో రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II, ఘోస్ట్ సిరీస్ II ,స్పెక్టర్ EV ఉన్నాయి. ఈ లగ్జరీ కార్ల మొత్తం ధర దాదాపు రూ. 27 కోట్లు ఉంటుందని అంచనా.. అతని కార్ కలెక్షన్‌ను ఒకసారి పరిశీలిద్దాం.
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II
రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన SUVలలో ఒకటి. సంజయ్ ఘోడావత్ దీనిని ఇగువాజు బ్లూ రంగులో కొన్నారు. దీనికి స్లిమ్ LED హెడ్‌లైట్లు, L-ఆకారపు DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్లు), కొత్త ఫ్రంట్ గ్రిల్ ,అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. లోపల, "గ్యాలరీ" గ్లాస్ ప్యానెల్ , కొత్త స్పిరిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 6.75-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్ (571 bhp, 850 Nm) ద్వారా నడుస్తుంది. దీని ధర రూ. 10.50 కోట్లు, ఎక్స్-షోరూమ్.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II అనేది రెండవ తరం ఫ్యాషన్ సెడాన్, ఇది బోహేమియన్ రెడ్ రంగులో లభిస్తుంది. దీనికి కొత్త హెడ్‌లైట్లు, బంపర్లు , చక్రాలు కూడా ఉన్నాయి. స్మూత్ డ్రైవింగ్ అనూభూతి, లగ్జరీ పరంగా ఈ కారు చాలా అధునాతనమైనది. దీని ఇంజిన్ అదే 6.75-లీటర్ V12, ఇది 563 bhp ,850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర దాదాపు రూ. 8.95 కోట్లు (ఎక్స్-షోరూమ్).
రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV
స్పెక్టర్ EV అనేది రోల్స్ రాయిస్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ఇంపీరియల్ జేడ్ (ఆకుపచ్చ రంగు) రంగులో అందుబాటులో ఉంది. దీనికి 102 kWh బ్యాటరీ ఉంది, ఇది 530 కి.మీ వరకు రేంజ్ కలిగి ఉంటుంది. రెండు మోటార్ల సెటప్ ఉంది, ఇది మొత్తం 585 bhp ,900 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. బరువుగా ఉన్నప్పటికీ, ఇది కేవలం 4.5 సెకన్లలో 0–100 కి.మీ వేగాన్ని చేరుకుంటుది. దీని ప్రారంభ ధర 7.5 కోట్లు. ఈ మూడు కార్ల డెలివరీ ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. సంజయ్ ఘోడావత్ ఈ మూడు రోల్స్ రాయిస్ కార్ల మధ్యలో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. సంజయ్ ఘోడావత్ గ్రూప్ (SGG) కి సంజయ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇంధన, విమానయానం , విద్య వంటి అనేక రంగాలలో ఆయన కంపెనీలు ఉన్నాయి.. అలాగే సంజయ్ ఘోడావత్ విశ్వవిద్యాలయ చాన్స్ లర్ గా కూడా సంజయ్ వ్యవహరిస్తున్నారు.





















