అన్వేషించండి

భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్‌దే భవిష్యత్‌ - పెట్రోల్ ఖర్చు తగ్గించే టెక్నాలజీపై కేంద్రం ఫోకస్

భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇథనాల్ ఆధారిత వాహనాలు పెట్రోల్ ఖర్చు తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Flex fuel cars in India: భారత్‌లో గత కొన్నేళ్లుగా "ఫ్లెక్స్ ఫ్యూయల్" (Flex Fuel) వాహనాలపై చర్చలు, చర్యలు వేగంగా సాగుతున్నాయి. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏమిటి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) అంటే... ఒకే వాహనం వివిధ రకాల పెట్రోల్-ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై నడిచే టెక్నాలజీ. సాధారణ కార్లు నిర్దిష్ట శాతం ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించగలవు. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్, E20, E85 లేదా ఇంకా ఎక్కువ ఇథనాల్ శాతం ఉన్న ఇంధనాలను కూడా ఆటోమేటిక్‌గా గుర్తించి వాటిపై పనిచేస్తాయి.

సింపుల్‌గా చెప్పాలంటే... మీరు కారులో ఏ ఇంధనం పోశారో ప్రత్యేకంగా సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. వాహనంలోని సెన్సార్లు ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని గుర్తించి, ఇంజిన్ పనితీరును దానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తాయి.

E20, E85 అంటే ఏమిటి?

E20 = 20% ఇథనాల్ + 80% పెట్రోల్
E85 = 85% ఇథనాల్ + 15% పెట్రోల్

భారత్‌లో తాజా పరిస్థితి

కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా "E20 ఇంధనం" అందుబాటులోకి తీసుకురావడంపై సీరియస్‌గా ఫోకస్‌ దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక పెట్రోల్ బంకుల్లో E20 విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా E20 అనుకూల వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

టయోటా ముందంజ

భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శించిన కంపెనీగా Toyota Kirloskar Motor నిలిచింది. ఈ కంపెనీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత Toyota Innova HyCross Flex Fuel*ప్రోటోటైప్‌ను కేంద్ర రవాణా శాఖ సమక్షంలో ప్రదర్శించింది.

ఇతర కంపెనీలు కూడా సిద్ధం

Maruti Suzuki, Hyundai Motor India, Tata Motors, Mahindra & Mahindra వంటి కంపెనీలు కూడా ఇథనాల్ అనుకూల ఇంజిన్ టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు E20 అనుకూల మోడళ్లను విక్రయిస్తున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల ప్రయోజనాలు

* పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
* చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.
* కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది.
* భవిష్యత్తులో ఇంధన ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
* దేశీయ ఇంధన భద్రత బలపడుతుంది.

సవాళ్లు కూడా ఉన్నాయి

* ఇథనాల్ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచాల్సి ఉంటుంది.
* అన్ని ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది.
* ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటంతో వాహనాల మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
* ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం.

ముందున్న దారి

ప్రస్తుతం భారత మార్కెట్‌లో పూర్తి స్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు విస్తృతంగా అందుబాటులో లేకపోయినా, E20 అనుకూల వాహనాలు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ఇథనాల్ వినియోగాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు భారత రోడ్లపై భారీ స్థాయిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్‌ మొత్తం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెహికల్స్‌దే కావచ్చు!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏమిటి?

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఒకే వాహనం వివిధ రకాల పెట్రోల్-ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై నడిచే టెక్నాలజీ. వాహనంలోని సెన్సార్లు ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని గుర్తించి, ఇంజిన్ పనితీరును సర్దుబాటు చేస్తాయి.

భారత ప్రభుత్వం ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ఎందుకు ప్రోత్సహిస్తోంది?

దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది.

E20, E85 అంటే ఏమిటి?

E20 అంటే 20% ఇథనాల్ + 80% పెట్రోల్. E85 అంటే 85% ఇథనాల్ + 15% పెట్రోల్. ఇవి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం శాతాన్ని సూచిస్తాయి.

భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఏ కంపెనీ ప్రదర్శించింది?

భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రదర్శించింది. వారు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు ఉన్న సవాళ్లు ఏమిటి?

ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచాలి, అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటంతో మైలేజ్ తగ్గే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Advertisement

వీడియోలు

Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget