Top 5 Most Popular SUVs: హ్యుందాయ్ క్రెటా నుంచి మారుతి ఫ్రాంక్స్ వరకు - జులైలో బెస్ట్ సెల్లింగ్ SUVలు ఇవే, టాప్ 5 లిస్ట్ మీ కోసం!
Best Selling SUVs 2025: జులై 2025లో హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా & మహీంద్రా స్కార్పియో వంటి SUV లకు డిమాండ్ పెరిగింది. ఈ నెలలో బెస్ట్ సెల్లింగ్ SUV ల పూర్తి జాబితాను పరిశీలిద్దాం.

SUV Sales Report July 2025: భారత కార్ల మార్కెట్లో SUVలకు డిమాండ్ నెలనెలా బాగానే పెరుగుతోంది, వాటి అమ్మకాల నివేదికలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ ట్రెండ్ గత నెల (జులై 2025)లో కూడా కనిపించింది. జులై సేల్స్ రిపోర్ట్ ప్రకారం, హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ (Best Selling SUV In India). దీనితో పాటు, మహీంద్రా థార్ (Mahindra Thar) & మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) వంటి SUVల అమ్మకాలు కూడా పెరిగాయి.
2025 జులై నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 SUVల లిస్ట్:
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta మరోసారి అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. గత నెలలో, హ్యుందాయ్ క్రెటా 16,898 మంది కొత్త కొనుగోలుదారులను యాడ్ చేసుకుంది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 3% స్వల్పంగా తగ్గినప్పటికీ, దాని డిమాండ్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఈ SUV కేవలం రూ. 11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే లభిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు & 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు క్రెటాలో చూడవచ్చు. అలాగే, ADAS & 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా సాంకేతికతలు దీనిని మరింత ప్రత్యేకంగా మార్చాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఇంధనాన్ని కూడా పొదుపుగా వాడుకుంటుంది, లీటరుకు 21.8 Km వరకు ఇస్తుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా
మోస్ట్ సెల్లింగ్ టాప్-5 SUVల లిస్ట్‌లో Maruti Suzuki Brezza రెండో స్థానంలో నిలిచింది. జులై 2025లో, 14,065 యూనిట్ల అమ్మకాలతో, మెరుగైన ఫ్యామిలీ SUVగా తన స్థానాన్ని ఇది నిలబెట్టుకుంది. గత సంవత్సరం జులైతో పోలిస్తే ఈసారి సేల్స్‌లో 4% తగ్గుదల చూసినప్పటికీ, అందుబాటు ధర & మైలేజ్ కారణంగా ఈ SUV ఇప్పటికీ ప్రజలకు ఇష్టమైనది కారుగా చలామణీ అవుతోంది.
మహీంద్రా స్కార్పియో
గత నెలలో Mahindra Scorpio అద్భుతంగా పుంజుకుంది. జులై 2025లో 13,747 కొత్త యూనిట్లను అమ్మింది, ఇది గత సంవత్సరం కంటే 12% ఎక్కువ. బోల్డ్ లుక్ & ఆఫ్-రోడ్ సామర్థ్యానికి ఈ SUV ప్రసిద్ధి చెందింది & ఇప్పటికీ భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన SUVలలో ఒకటి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
Maruti Suzuki Fronx కూడా జులై అమ్మకాల రేసులో ముందు వరుసలో ఉంది. ఇది, ఆ నెలలో మొత్తం 12,872 యూనిట్ల అమ్మకాలతో బాగా ప్రాచుర్యం పొందింది. గత సంవత్సరం జులైతో పోలిస్తే దీని అమ్మకాలు 18% పెరిగాయి. ముఖ్యంగా, యువత & నగరవాసులలో ఈ SUV బాగా పాపులర్ అవుతోందని సేల్స్ రిపోర్ట్ చెబుతోంది.
టాటా నెక్సాన్
Tata Nexon కూడా జులై 2025లో 12,825 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే ఇది 8 శాతం తక్కువ అయినప్పటికీ, భద్రత విషయంలో ఇది సూపర్ కారు. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, శక్తిమంతమైన ఇంజిన్ & ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు సొంతం అని తెలుసుకోండి.





















