Hyundai Creta Sales: మూడు నెలల్లోనే లక్ష మార్కు - మార్కెట్లో క్రెటా దండయాత్ర!
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ మూడు నెలల్లోనే లక్ష మార్కును దాటాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Hyundai Creta Facelift Bookings: లాంచ్ అయిన మూడు నెలల్లోనే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. భారీ మైలురాయిని కూడా దాటింది. 2024 జనవరిలో లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఇప్పటివరకు లక్షకు పైగా బుకింగ్‌లను నమోదు చేసింది.
రికార్డు స్థాయిలో సేల్స్
సేల్స్, బుకింగ్స్ విషయంలో హ్యుందాయ్ రికార్డులు బద్దలు కొడుతూ ఛార్ట్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. విశేషమేమిటంటే ఈ ఎస్‌యూవీ ఫిబ్రవరిలో 50 వేల బుకింగ్స్‌ను, మార్చిలో 80 వేల బుకింగ్స్‌ను దాటింది. హ్యుందాయ్ క్రెటా సమీప ప్రత్యర్థి కియా సెల్టోస్ ఈ ఘనత సాధించడానికి ఆరు నెలల సమయం తీసుకుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
రూ. 11 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్లో లాంచ్ అయిన క్రెటా ఎస్‌యూవీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. E, EX, S, S(O), SX, SX Tech, SX(O) అనే ఏడు వేరియంట్లలో హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఇటీవల ఈ మోడల్ ధర రూ.10,800 పెరిగింది.
త్వరలో ఎలక్ట్రిక్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి సంబంధించిన ఆల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను దేశంలోకి తీసుకురావడానికి కూడా కంపెనీ కృషి చేస్తోంది. ఈ మోడల్ ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. 2024 చివరిలో ఈ కారు మనదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
కంపెనీ ఏం చెప్పింది?
ఈ ఘనతపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "ఇటీవల లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా 2024 జనవరిలో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అద్భుతమైన స్పందనను పొందుతోంది. కేవలం మూడు నెలల్లోనే అద్భుతమైన స్పందనను పొందింది. లక్షకు పైబడిన బుకింగ్స్‌లో సన్‌రూఫ్ మోడల్స్ ఏకంగా 71 శాతం ఉన్నాయి. కనెక్టెడ్ వేరియంట్లు కూడా 52 శాతం వాటాను అందించాయి. ఇది యువ భారతీయ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు నిదర్శనం." అన్నారు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
12th
11th