Hyundai Creta Electric: క్రెటా ఎలక్ట్రిక్‌ను పరిచయం చేసిన హ్యుందాయ్ - ఎలా ఉందంటే?
Hyundai Creta Electric Launched: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఈ కారు త్వరలో అధికారికంగా లాంచ్ కానుంది.
Hyundai Creta Electric Unveiled: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన క్రెటా ఈవీని ఆవిష్కరించింది. ఇంతకుముందు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు జనవరి 17వ తేదీ నుంచి జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ కానుంది. కంపెనీ ఇప్పటికే కారు డిజైన్, స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది.
కొత్త హ్యుందాయ్ క్రెటాను ఎలక్ట్రిక్ డిజైన్ ఇటీవల విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ఆధారంగా రూపొందించారు. కారు బాడీ ప్యానెల్స్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ ఇందులో అందించారు. క్రెటాలో పిక్సెల్ వంటి డిటైలింగ్‌తో ముందు, వెనుక కొత్త బంపర్లు అందించారు. ఇందులో ఎలక్ట్రిక్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్ కూడా ఉంది. ఇది గాలి ప్రవాహాన్ని మేనేజ్ చేస్తుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ వివరాలు ఇలా...
కారు డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్ సెటప్‌ను పొందుతుంది. ఇది కొత్త ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్‌ను పొందుతుంది. క్రెటా ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ, ఏడీఏఎస్, అలాగే డిజిటల్ కీ ఫీచర్‌ను పొందుతుంది. కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందుతుంది. ఇందులో 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. వీటిలో మొదటి బ్యాటరీ 390 కిలోమీటర్లు, రెండో బ్యాటరీ 473 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తాయి.
క్రెటా ఎలక్ట్రిక్‌లో మూడు మోడ్‌లు...
క్రెటా ఎలక్ట్రిక్ 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. క్రెటా ఎలక్ట్రిక్‌లో మూడు డ్రైవ్ మోడ్‌లు అందించారు. వీటిలో ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. కారులో స్టీరింగ్ కాలమ్ మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కూడా అందించారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం క్రెటా ఎలక్ట్రిక్ కేవలం 58 నిమిషాల్లో (డీసీ ఛార్జింగ్) 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఈ కారును ఫాస్ట్‌గా ఛార్జింగ్ చేయవచ్చు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
A bold new chapter in electric begins soon.
— Hyundai India (@HyundaiIndia) January 1, 2025
Hyundai CRETA Electric is set to change the way you drive, forever. The countdown to innovation has begun! Coming soon.#Hyundai #HyundaiIndia #ILoveHyundai #CRETAElectric #ElectricisnowCRETA pic.twitter.com/N4RKHXbJDw
Smart. Powerful. Revolutionary.
— Hyundai India (@HyundaiIndia) January 2, 2025
The Hyundai #CRETAElectric redefines the SUV experience. With striking design, global EV tech, and unmatched performance, it’s built to turn heads and spark change.
Are you ready? Because #ElectricIsNowCRETA
Coming soon.#HyundaiIndia #ILoveHyundai pic.twitter.com/2PJQrB7uKC