Honda CB 350 Dlx లేదా Hunter 350: కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Royal Enfield Hunter 350 & Honda CB 350 Dlx రెండూ దాదాపు ఒకే విధమైన పవర్ అవుట్‌పుట్ అందిస్తాయి, కానీ హోండా CB 350 కొంచెం ఎక్కువ టార్క్‌ను కలిగి ఉంది.

Royal Enfield Hunter 350 vs Honda CB 350 Dlx: తెలుగు రాష్ట్రాల్లో 350cc మోటార్ సైకిళ్లు దుమ్మురేపుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 & హోండా CB 350 Dlx ఈ విభాగంలో, యూత్‌లో మోస్ట్ పాపులర్ అయ్యాయి. ఈ రెండు బైక్‌లు శక్తిమంతమైన ఇంజన్లు & ఆకర్షణీయమైన లక్షణాలతో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు, ఈ రెండు మోటార్ సైకిళ్లలో ఏది కొనడం స్మార్ట్ డెసిషన్ అవుతుంది?.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350... 20.2 bhp పవర్ & 27 Nm టార్క్ ఉత్పత్తి చేసే 349 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. హోండా CB 350 Dlx 348.36 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది, ఇది 15.5 కిలోవాట్ (సుమారు 20.8 bhp) పవర్ & 29.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది, ఈ బండి కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది.
ఫీచర్ల పరంగా ఏది స్మార్ట్?
హంటర్ 350 లో కొత్త LED హెడ్‌ల్యాంప్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ పాడ్, USB ఛార్జింగ్ పోర్ట్, 17 అంగుళాల టైర్లు, డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS & సిక్స్-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. హోండా CB 350 Dlx లో డ్యూయల్-ఛానల్ ABS, ముందు & వెనుక డిస్క్ బ్రేక్‌లు, 18 & 19 అంగుళాల టైర్లు, ESS టెక్నాలజీ, LED హెడ్‌ల్యాంప్ & LED ఇండికేటర్లు, సెమీ-డిజిటల్ క్లస్టర్, స్ప్లిట్ సీట్ & ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఉన్నాయి.
కలర్స్ & వేరియంట్లు
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350ని - గ్రాఫైట్ గ్రే, టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ, డాపర్ గ్రే, రియో వైట్ & ఫ్యాక్టరీ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. హోండా CB 350 Dlx - పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ & రెబెల్ రెడ్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది.
ధరలు ఎలా ఉన్నాయి?
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ధర (Royal Enfield Hunter 350 Price) రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. హోండా CB 350 Dlx ధర (Honda CB 350 Dlx Price) రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు దాదాపు రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఏ బండి సరైనది?
మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉండి, స్టైలిష్ డిజైన్ & ఫీచర్లతో కూడిన బైక్‌ను కోరుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మంచి ఎంపిక కావచ్చు. మరింత రిఫైన్డ్ ఇంజిన్, మృదువైన ప్రయాణం & ప్రీమియం లుక్స్ ఉన్న బైక్ కావాలనుకుంటే, హోండా CB 350 Dlx మీ ఆలోచనలకు సరిపోతుంది.





















