అన్వేషించండి

Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?

Car Maintenance Guide: కారు కొనడం సులభమే కానీ, దాన్ని మెయింటెనెన్స్‌ మరింత కష్టం. కొన్ని చిట్కాలు పాటిస్తే అది కూడా పెద్ద భారం కాకుండా చూసుకోవచ్చు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారును ఒకే వేగంతో నడపండి; అధిక వేగం ఇంధనాన్ని వృధా చేస్తుంది.
  • అనవసరంగా క్లచ్ నొక్కడం, గేర్లు మార్చకపోవడం ఇంధన వ్యయాన్ని పెంచుతుంది.
  • 30 సెకన్ల కంటే ఎక్కువ ఆగినప్పుడు ఇంజిన్ ఆపివేయండి; కాలుష్యం తగ్గుతుంది.
  • టైర్లలో సరైన గాలి స్థాయి, క్రమమైన సర్వీసింగ్ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి.

Car Maintenance Guide: చాలా మందికి కారులో తిరగాలనే ఉంటుంది. కానీ దాని మెయింటెనెన్స్‌ భారంగా భావించి కారు అనే ఆలోచనను పక్కన పెట్టేస్తుంటారు. కాస్త ముందడుగు వేద్దామంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఫిల్లింగ్ స్టేషన్ల ముందు భారీగా బారులు తీరిన వాహనాలు చూస్తుంటే భయపడిపోయే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కారు అవసరం ఉన్నా సరే కొనడానికి భయపడే వారి కోసం కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ చిట్కాలు పాటిస్తే మీరు తక్కువ ఖర్చుతోనే కారును నడపొచ్చు. 

కారు ఎప్పుడు కూడా ఒకేరకమైన వేగంతో నడపాలి. అధిక వేగంతో నడిపినా, మరీ తక్కువ వేగంతో నడిపినా ఇంజిన్‌పై భారం పడుతుంది. దీని వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అందుకే బ్యాలెన్స్డ్‌గా కారు నడపడం నేర్చుకుంటే మీకు పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గుతుంది. సాధారణ వేగంతో నడిపితే ఇంధనం ఖర్చు తగ్గడమే కాకుండా, ఇంజిన్‌ లైఫ్ కూడా మెరుగుపడుతుంది. రిపేర్‌లు తగ్గిపోతాయి. 

చాలా మంది క్లచ్‌ వాడకంలో చేసే తప్పులు చేస్తుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా సరే క్లచ్‌ను తొక్కిపెట్టి ఉంటారు. ఇది కూడా మీ కారు మైలేజీ పడిపోవడానికి కారణం కావచ్చు. ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో వెళ్లేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. పదే పదే క్లచ్ నొక్కిపెట్టి ఉంటారు. ఇది ఇంధనాన్ని భారీగా ఖర్చు చేయడమే కాకుండా క్లచ్‌ కూడా త్వరగా అరిగిపోతుంది. 

అవసరమైనప్పుడు గేర్‌లు మార్చడం. చాలా మంది ఈ విషయంలో కూడా తప్పులు చేస్తుంటారు. గేర్ మార్చాల్సి వచ్చినప్పుడు క్లచ్‌పై కాలు వేసి నడిపిస్తుంటారు. గేర్ మార్చకుండానే వెళ్తుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ కారు ఇంజిన్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇంధనం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఏ వేగంలో వెళ్తున్నామో గ్రహించి దానికి అనుగుణంగానే గేర్‌లు మారుస్తూ ఉండాలి. 

మరికొందరు కారు ఎక్కువ సమయం ఆపాల్సి వచ్చినప్పుడు కూడా ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఉంచుతారు. ఇది కూడా మీ పెట్రోల్ ఖర్చును పెంచేస్తుంది. దీని వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది. అందుకే 30 సెకన్లు కంటే ఎక్కువ ఆగిన ప్రతిసారీ ఇంజిన్ అఫ్ చేయడం మీ కారుకు మీ జేబులు మంచిది. 

సర్వీసింగ్ విషయంలో కూడా తప్పులు జరుగుతుంటాయి. టైం లేదని, లేదా సర్వీసింగ్ సెంటర్ దూరంగా ఉందని చెప్పి చాలా మంది సర్వీసింగ్ చేయడంలో అలసత్వం చూపిస్తుంటారు. ఇది కూడా మీ కారు మైలేజీని భారీగా తగ్గిస్తుంది. పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. సర్వీసింగ్ చేయడం వల్ల ఫిల్టర్స్, ఇంజిన్ ఆయిల్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తపడొచ్చు. ఫలితంగా కారు ఇంజిన్‌కు లైఫ్ వస్తుంది. 

కార్ల టైర్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కారు మాన్యువల్‌లో పేర్కొన్నట్టు కార్ల టైర్లలో గాలి ఉండాలి. లేకుంటే ఆ ప్రభావం మీ కారు ఇంజిన్‌పై పడుతుంది. గాలి తక్కువ ఉన్న సమయంలో డ్రైవింగ్ చేస్తే కారును ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కువ ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. దీని వల్ల ఎక్కువ పెట్రోల్, డీజిల్ వినియోగించాల్సి వస్తుంది. 

అన్నింటి కంటే ముఖ్యమైంది. తక్కువ దూరాలకు ఈవీలు కానీ, లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ వాడటం మంచిది. రోజు వారి చిన్న చిన్న దూరాలను నడవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులు కూడా మిగులుతాయి. 

Frequently Asked Questions

కారును ఒకే రకమైన వేగంతో నడపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కారును స్థిరమైన వేగంతో నడపడం వల్ల ఇంజిన్‌పై భారం తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది మరియు ఇంజిన్ జీవితకాలం పెరుగుతుంది.

ట్రాఫిక్‌లో క్లచ్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

అవసరం లేకపోయినా క్లచ్‌ను నొక్కి ఉంచడం వల్ల ఇంధనం వృధా అవ్వడమే కాకుండా, క్లచ్ త్వరగా అరిగిపోతుంది.

గేర్లు మార్చేటప్పుడు చేసే సాధారణ పొరపాటు ఏమిటి?

సరైన సమయంలో గేర్లు మార్చకపోవడం లేదా గేర్ మార్చేటప్పుడు క్లచ్‌పై కాలు ఉంచి నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి, ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది.

ఎక్కువ సేపు కారు ఆపినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల లాభం ఏమిటి?

30 సెకన్ల కంటే ఎక్కువ సేపు కారు ఆపినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది.

కారు టైర్లలో గాలి సరిగ్గా లేకపోతే ఏమి జరుగుతుంది?

టైర్లలో గాలి తక్కువగా ఉంటే, కారును ముందుకు తీసుకెళ్లడానికి ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది, దీనివల్ల పెట్రోల్/డీజిల్ వినియోగం పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget