అన్వేషించండి

Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!

Car SafetyTips in Summer :వేసవిలో కారు లోపల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటవచ్చు. అగ్నిప్రమాదాలు జరగకుండా కారులో వదిలివేయకూడని ప్రమాదకరమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకుందాం.

Car SafetyTips in Summer :ఇండియాలో వేసవి కాలం మొదలైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ చేరుకోవడం సర్వసాధారణం. ఈ తీవ్రమైన వేడి నుండి తప్పించుకోవడానికి చాలామంది బైక్ కంటే కారులో ప్రయాణించడానికే మొగ్గు చూపుతారు. అయితే, కారు లోపల మనం తెలియకుండా వదిలేసే కొన్ని వస్తువులు బాంబుల్లా మారి పేలిపోయే అవకాశం ఉంది. ప్రాణాంతకమైన ఆ ఐదు వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పర్ఫ్యూమ్స్, డియోడరెంట్లు (Aerosol Sprays):

చాలామంది కార్లలో బాడీ స్ప్రేలు లేదా రూమ్ ఫ్రెషనర్లు ఉంచుతారు. ఈ ఎయిరోసోల్ కంటైనర్లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా మంటలు అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఎండలో నిలిపి ఉంచిన కారు లోపల వేడి పెరిగినప్పుడు, ఈ బాటిల్స్ ఒత్తిడికి లోనై ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని కారులో ఉంచకపోవడమే మంచిది.

లైటర్లు (Lighters):

లైటర్లలో గ్యాసోలిన్ ఇంధనంగా ఉంటుంది. పెట్రోల్ లాగానే ఇది కూడా త్వరగా ఆవిరైపోతుంది. నేరుగా ఎండ తగిలే చోట లైటర్ ఉంచితే, చిన్న నిప్పురవ్వ తగిలినా కారు మొత్తం తగలబడిపోయే ఛాన్స్ ఉంది. పొరపాటున మీ దగ్గర లైటర్ ఉంటే, దానిని ఎండ తగలని గ్లోవ్ బాక్స్ లేదా సురక్షితమైన ప్రదేశంలో దాచండి.

మెరిసే వస్తువులు, సీడీలు (Shiny Objects):

కారును అందంగా అలంకరించుకోవడానికి కొందరు రియర్-వ్యూ మిర్రర్ వద్ద సీడీలు (CDs) లేదా ఇతర మెరిసే వస్తువులను వేలాడదీస్తారు. ఈ వస్తువులు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి (Reflect). ఈ రిఫ్లెక్షన్ కారులోని ఇతర భాగాలపై పడి, అక్కడ ఉష్ణోగ్రత పెరిగి మంటలు చెలరేగేలా చేస్తుంది. అలంకరణ కోసం ఇలాంటి రిఫ్లెక్టివ్ వస్తువులను వాడటం మానుకోండి.

బ్యాటరీతో పనిచేసే పరికరాలు (Battery Powered Devices):

పవర్ బ్యాంకులు, పాత మొబైల్ ఫోన్లు కారులో వదిలేయడం అత్యంత ప్రమాదకరం. వీటిలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒక పరిమితి వరకే వేడిని తట్టుకోగలవు. క్లోజ్ చేసిన కారులో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ బ్యాటరీలలో కెమికల్ రియాక్షన్ జరిగి అవి ఉబ్బిపోతాయి లేదా పేలిపోతాయి. వీటిని కారులోనే మర్చిపోకుండా వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్:

ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. డ్యాష్ బోర్డ్ లేదా సీటుపై నేరుగా ఎండ తగిలేలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంచితే, అది ఒక లెన్స్ (Lens) లాగా పనిచేస్తుంది. సూర్యకాంతిని ఒకే చోట కేంద్రీకృతం చేయడం ద్వారా సీటు కవర్లకు మంటలు అంటుకునేలా చేస్తుంది. నీళ్ల బాటిళ్లను ఎప్పుడూ ఒక బ్యాగులో లేదా బట్టతో కప్పి ఉంచాలి. ఓవ‌రాల్ గా చెప్పాలంటే, ఎండకాలంలో కారును వీలైనంత వరకు నీడలో పార్క్ చేయండి. పైన చెప్పిన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండి మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget