అన్వేషించండి

Diesel Car Protect In Winter: చలికాలంలో డీజిల్ కారులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి - 8 కీలక సూచనలు

చలికాలంలో డీజిల్ కారు స్టార్టింగ్ సమస్యలు, ఫ్యూయల్ జెల్లింగ్, బ్యాటరీ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ 8 చిట్కాలు తప్పనిసరిగా పాటించండి. మీ కారును వింటర్‌లో సురక్షితంగా ఉంచే పూర్తి గైడ్.

Protection Tips To Diesel Car This Winter: చలికాలం వస్తే డీజిల్ కార్లు ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి. ఉదయం స్టార్ట్ అవ్వకపోవడం, ఇంజిన్ స్పందన తగ్గిపోవడం, ఫ్యూయల్ గట్టి పడటం, బ్యాటరీ పవర్ తగ్గిపోవడం - ఇవన్నీ భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో సాధారణ సమస్యలు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌ వంటి ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల డీజిల్ కార్లకు చిన్న లేదా పెద్ద సమస్యలు తలెత్తుతాయి. కానీ ముందే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ డీజిల్ కారు వింటర్‌లో కూడా స్మూత్‌గా పని చేస్తుంది. దీనికోసం పాటించాల్సిన 8 ముఖ్య సూచనలు ఇవీ:

1. వింటర్ గ్రేడ్ డీజిల్ వాడండి (ఫ్యూయల్ జెల్లింగ్ ఆపుతుంది)
చలి ఎక్కువైనప్పుడు డీజిల్ గట్టిపడి జెల్లీలా మారుతుంది. దీన్ని ఫ్యూయల్ జెల్లింగ్ అంటారు. ఇలాంటి ఫ్యూయల్ ఫిల్టర్‌ గుండా సరిగ్గా వెళ్లకపోవడంతో కారు స్టార్ట్ కాకపోవచ్చు. అందుకే వింటర్ గ్రేడ్ డీజిల్ దొరికితే అదే వాడండి. సురక్షితంగా ఉండాలంటే STP Diesel Treatment వంటి యాంటీ-జెల్ వంటివి కూడా ప్రతి రీఫిల్‌లో వేయడం మంచిది.

2. ఫ్యూయల్ ట్యాంక్ ఎప్పుడూ ఫుల్‌గా ఉంచండి
ట్యాంక్ సగమే ఉన్నప్పుడు లోపల తేమ పేరుకుని మంచుగా మారుతుంది. ఇది ఫ్యూయల్ లైన్లను బ్లాక్‌ చేస్తుంది. ట్యాంక్ ఫుల్‌గా ఉంచితే ఈ సమస్య ఉండదు. చలికాలంలో ఇది చాలా చిన్న టిప్‌, కానీ అత్యంత ఉపయోగకరమైన విషయం.

3. బ్యాటరీను ముందే టెస్ట్ చేయించుకోండి
చలి సమయంలో బ్యాటరీ పనితీరు సహజంగానే తగ్గుతుంది. పవర్ తగ్గితే కారు లైన్‌లోకి రావడానికి ఎక్కువ టైమ్‌ తీసుకుంటుంది. అందుకే సీజన్ ప్రారంభంలోనే బ్యాటరీ టెస్ట్ చేయించి, టెర్మినల్స్‌పై ఉండే కార్బన్ తుడిచేయండి. చార్జింగ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయించండి.

4. సరైన వింటర్ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ వాడండి
చలికాలంలో ఇంజిన్ ఆయిల్ కూడా మందంగా మారుతుంది. దీని వల్ల కోల్డ్ స్టార్ట్ సమయంలో ఆయిల్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వదు. మెకానిక్ సూచనల ప్రకారం 5W-30 లేదా 5W-40 వంటి వింటర్ గ్రేడ్‌ సింథటిక్ ఆయిల్ వాడడం. ఇలా చేస్తే కోల్డ్ స్టార్ట్ సాఫ్ట్‌గా జరుగుతుంది.

5. కూలెంట్ లెవెల్ తప్పనిసరిగా చెక్ చేయండి
కూలెంట్ కేవలం వేడి తగ్గించడానికే కాదు, చలి సమయాల్లో ఇంజిన్ గడ్డ కట్టకుండా కూడా కాపాడుతుంది. కూలంట్ లెవెల్ సరిగ్గా ఉందా, వాటర్–యాంటీఫ్రీజ్ మిశ్రమం మాన్యువల్ ప్రకారం ఉందా అన్నది చూసుకోండి. అవసరమైతే హైడ్రోమీటర్‌తో టెస్ట్ చేయించండి.

6. గ్లో ప్లగ్స్‌ని చెక్ చేయించుకోండి
డీజిల్ ఇంజిన్లలో గ్లో ప్లగ్స్ చిన్న హీటర్స్‌లా పని చేస్తాయి. ఇవి సరిగా లేకపోతే కోల్డ్ స్టార్ట్ సమస్యలు తప్పవు. ఉదయం స్టార్ట్ అవ్వడానికి టైం తీసుకోవడం, వైట్ స్మోక్ రావడం, ఇంజిన్ షేక్ అవ్వడం వంటివి కనిపిస్తే గ్లో ప్లగ్స్ మార్చే టైమ్ వచ్చిందని అర్థం.

7. కారు స్టార్ట్ చేసిన వెంటనే రేవ్ చేయకండి
చలికాలంలో ఉదయం పూట కారు స్టార్ట్ చేసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాలు ఇంజిన్‌ వార్మప్ కోసం వదిలేయండి. వెంటనే యాక్సిలరేట్ చేస్తే ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అదే విధంగా, కారును గ్యారేజ్‌లో లేదా షెల్టర్డ్ స్థలంలో పార్క్ చేస్తే చలిలో ఇంజిన్ ఎక్కువగా చల్లబడకుండా ఉంటుంది.

8. వింటర్ ముందు కారుకు ఓవరాల్ సర్వీస్ చేయించండి
బెల్ట్స్‌, హోసెస్‌, ఫిల్టర్స్‌ చెక్ చేయించుకోవడం వల్ల చిన్న సమస్యలను ముందే గుర్తించవచ్చు. వింటర్ సీజన్‌లో హైవే ట్రావెల్స్ ప్లాన్ చేస్తే ఇది తప్పనిసరి.

ఈ 8 సింపుల్ హాక్స్‌ పాటిస్తే మీ డీజిల్ కారు చలికాలంలో కూడా హెల్దీగా, రెస్పాన్సివ్‌గా పని చేస్తుంది. కోల్డ్ స్టార్ట్ సమస్యలు తగ్గుతాయి, ఫ్యూయల్ జెల్లింగ్ & బ్యాటరీ ఇష్యూలు రావు. చిన్న జాగ్రత్తలే పెద్ద ఇబ్బందులను దూరం చేస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Embed widget