అన్వేషించండి

BH Number Plate: ఏపీ, తెలంగాణలో భారత్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఎలా అప్లై చేయాలి?

Bharat Series Registration Details: భారత్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ ఎవరికి ఇస్తారు, తెలుగు ప్రజలు ఆ నంబర్‌ ప్లేట్‌ ఎలా తీసుకోవాలి?. పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.

How To Apply For Bharat Series Registration Number: దేశమంతా వాహన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను సులభంగా మార్చాలనే ఉద్దేశంతో, భారత ప్రభుత్వం, భారత్‌ సిరీస్‌ (BH Series) నంబర్‌ ప్లేట్‌ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ సిరీస్‌తో ఉన్న చాలా వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ప్రతి రాష్ట్రంలోనూ పాత విధానంలోనే వెహికల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, భారత్‌ సిరీస్‌ అవసరం ఏంటి?.

భారత్‌ సిరీస్‌ (BH Series) అంటే ఏంటి, ఉపయోగం ఏంటి?
భారత్‌ సిరీస్‌ నంబర్ ప్లేట్‌ స్కీమ్‌ను 2021లో కేంద్ర రవాణా శాఖ ప్రవేశపెట్టింది. దీనివల్ల, ఒక రాష్ట్రంలో రిజిస్టర్‌ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లినా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకంగా, తరచూ రాష్ట్రాలు మారే ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వేరే రాష్ట్రానికి తరలిన తరువాత వాహన రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా, నో-అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే BH సిరీస్ నంబర్ వాహనాలను దేశంలో ఎక్కడైనా నడపవచ్చు. అయితే ఈ నూతన విధానం గురించి ఇంకా చాలామందికి స్పష్టత లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నివసించే వాళ్లు ఈ నంబర్‌ను ఎలా పొందాలి? ఎవరి కోసం ఇది అందుబాటులో ఉంది?

ఉదాహరణకు.. BH సిరీస్‌ నంబర్లు ఇలా కనిపిస్తాయి: "21 BH 25 2345 AA". ఇందులో... 21 అంటే బండి రిజిస్ట్రేషన్‌ జరిగిన 2021 సంవత్సరం, BH అంటే భారత్‌ సిరీస్‌, 2345 అనేది ర్యాండమ్‌గా ఇచ్చే సీరియల్‌ నంబర్‌ను, AA అనేది ఆల్ఫాబెట్స్‌ను (I&O కాకుండా) సూచిస్తుంది.

భారత్‌ సిరీస్‌ నంబర్ ప్లేట్‌ పొందడానికి ఎవరు అర్హులు?

కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం, BH సిరీస్‌ నంబర్‌ కోసం ఈ కేటగిరీలవారు అర్హులు:

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు

రక్షణ శాఖ ఉద్యోగులు

బ్యాంకింగ్‌, PSU ఉద్యోగులు

ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు (కంపెనీ పేరు కనీసం 4 రాష్ట్రాల్లో నమోదై ఉంటే). ప్రైవేట్ ఉద్యోగులు ఈ నంబర్‌ పొందాలంటే, తమ కంపెనీకి క్రాస్-స్టేట్‌ ప్రెజెన్స్ ఉందని చూపించే సర్టిఫికెట్‌ అవసరం.

తెలుగు ప్రజలు ఎలా దరఖాస్తు చేయాలి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నివసించే వారు BH సిరీస్‌ నంబర్‌ కోసం వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే దరఖాస్తు చేయాలి. ఇందుకోసం డీలర్‌ ద్వారా లేదా Parivahan పోర్టల్ ద్వారా అప్లై చేయవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు:

ఉద్యోగాన్ని సూచించే ID ప్రూఫ్

ప్రైవేట్ కంపెనీ అయితే, కంపెనీ నుంచి సరైన ఫార్మాట్‌లో NOC లేదా అఫిడవిట్

చిరునామా రుజువు

పాన్‌, ఆధార్‌ 

RC అప్లికేషన్, ఫామ్‌ 20

ఎంత ఫీజు చెల్లించాలి?

రాష్ట్రాల్లో జరిగే సాధారణ రిజిస్ట్రేషన్‌ సమయంలో, వాహన యజమాని లైఫ్‌ టైమ్‌ రోడ్‌ టాక్స్‌ (15 ఏళ్ళు) కట్టాలి. అయితే, BH సిరీస్‌ నంబర్‌ తీసుకునేవాళ్లు మొదటి రెండు సంవత్సరాల కోసం రోడ్డు పన్ను (Road Tax) కట్టాలి. ఆ తర్వాత రెండేళ్లకు ఒకసారి కట్టుకుంటూ వెళ్లాలి.దీనివల్ల, తరచూ రాష్ట్రాలు మారేవాళ్లకు భారం తగ్గుతుంది.

కీలక పాయింట్లు

ఇప్పటికే రిజిస్టర్‌ చేసిన వాహనానికి BH సిరీస్‌ అప్లై చేయడం సాధ్యపడదు.

వాహన కొనుగోలు సమయంలోనే ఇది కావాలని స్పష్టంగా చెబితే మాత్రమే డీలర్ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డీలర్లు ఈ సేవ అందిస్తున్నా, కొన్ని చోట్ల ఇంకా అవగాహన లోపం ఉంది.

ఉద్యోగ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేరే రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్‌ చక్కగా ఉపయోగపడుతుంది. దీని గురించి అధికారిక వెబ్‌సైట్‌ లేదా స్థానిక RTO వద్ద పూర్తి సమాచారం పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget