అన్వేషించండి

Buying Used Car: సెకండ్‌ హ్యాండ్ కారు కొనేప్పుడు వీటిని చెక్‌ చేయండి, లేదంటే మీకే నష్టం

Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ఆలోచిస్తున్నవాళ్లు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాలి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

Old Car Or Pre-Owned Car Buying Tips: కుటుంబ అవసరాల కోసం లేదా సెలవుల్లో టూర్లు ప్లాన్‌ చేయడానికి సొంత కారు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి కల. కానీ.. అధిక ధర లేదా మరేదైనా కారణం వల్ల ఎక్కువ మంది విషయంలో ఈ కల నెరవేరదు. కొంతమంది, కాస్త రాజీ పడి, కొత్త కారు బదులు పాత కారు/ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటారు. ఉపయోగించిన కారు (Used Car) కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు, ముందుగా కొన్ని విషయాలను తెలుసుకుంటే నష్టపోకుండా ఉంటారు.

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కాస్త అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి సమస్యలు లేని మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.

మీ బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకోండి
సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ముందు, మొదటి & అతి ముఖ్యమైన విషయం మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం. మీ బడ్జెట్‌ దాటి వెళితే ఆర్థిక భారం పెరుగుతుంది, దాదాపు కొత్త కారు ధర అవుతుంది. మీకు నచ్చిన కారు మార్కెట్ విలువ, పునఃవిక్రయం విలువ & డిమాండ్ గురించి సమాచారాన్ని సేకరించాలి. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అదే కారు ధరను చెక్‌ చేయండి. మీ బడ్జెట్‌ను బట్టి ఒక ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి.

మీరు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయండి
మీరు కొనాలనుకుంటున్న పాత కారును ఎంచుకున్న తర్వాత, ఆ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఏదో కాస్త దూరం అలా వెళ్లి ఇలా వస్తే ఆ కారులో లోపాలు కనిపించవు, వీలైనంత లాంగ్‌ డ్రైవ్‌ చేయండి. తద్వారా, ఆ కారు బాగా నడుస్తుందో లేదో మీకు తెలుస్తుంది & ఏదైనా సమస్య ఉంటే మీరు ముందుగానే అర్థం చేసుకుంటారు. వీలైతే, అనుభవజ్ఞుడైన వ్యక్తిని మీతో తీసుకువెళ్లి అతనితో కూడా కారును నడపించండి.

ఖర్చు అంచనా కూడా అవసరం
మూడోది & మరో అతి ముఖ్యమైన విషయం 'అంచనా'. టెస్ట్ డ్రైవ్ సమయంలో మీరు గమనించిన విషయాలు, లోపాలు, ఆ బండి మార్కెట్ ధర & అడిగే ధర అన్నింటినీ అంచనా వేయండి. కారులో ఏవైనా లోపాలు ఉంటే, వాటిని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా అంచనా వేసి, కార్‌ అమ్మే ధర నుంచి ఆ ఖర్చులను తగ్గించి అడగండి. లేదా, మరమ్మతులన్నీ చేయించి ఇమ్మడి చెప్పండి. ఏం చేసినా మీ డబ్బుకు సరైన విలువ ఇచ్చే కారును మాత్రమే ఎంచుకోండి. 

మెకానిక్ చేత చెక్ చేయించండి
పాత కారు కొనే ముందు దానిని మంచి మెకానిక్ ద్వారా తనిఖీ చేయించడం లేదా కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. మీరు ఈ పని చేస్తే, ఆ కారులో మీరు అర్ధం చేసుకోలేని ఏదైనా సమస్య ఉంటే మీకు తెలుస్తుంది. కాబట్టి, సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ కొనేప్పుడు ఈ విషయాన్ని విస్మరించొద్దు.

సర్వీస్ రికార్డును చెక్‌ చేయండి
టెస్ట్‌ డ్రైవ్‌ తర్వాత ఆ బండి సర్వీస్ రికార్డును కూడా తనిఖీ చేయాలి. దీనివల్ల, ఆ వాహనానికి ఎన్ని సర్వీస్‌లు చేయించారు & ఏయే విడిభాగాలు మార్చారు అనే విషయం మీకు తెలుస్తుంది.

పేపర్లను కూడా తనిఖీ చేయండి 
సెకండ్‌ హ్యాండ్‌ కారును ఖరారు చేసుకునే ముందు, ఆ కారుకు సంబంధించిన అన్ని పేపర్లను క్షుణ్ణంగా చూడండి. కారు ఛాసిస్ నంబర్ & ఇంజిన్ నంబర్‌ను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పోల్చి చూడండి. అది సరిపోలకపోతే ఆ కారులో ఏదో తిరకాసు ఉందని అర్ధం, దానిని కొనకండి.

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Embed widget