Mahindra Scorpio N: స్కార్పియో ఎన్ కొనడానికి బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, నెలకు ఎంత EMI చెల్లించాలి?
Mahindra Scorpio N EMI Calculation: మీరు ఈ కారును కొనాలంటే పుల్ పేమెంట్ చేయక్కరలేదు. బదులుగా, కేవలం 20 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి, EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Mahindra Scorpio N Price, Down Payment, Loan and EMI Details: మన దేశంలోని అత్యంత విలాసవంతమైన SUVలలో మహీంద్రా స్కార్పియో N ఒకటి. ఈ బండి పేరు తెలీని వ్యక్తి భారతదేశంలో ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ మహీంద్ర బ్రాండ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ కారు 6-సీటర్ & 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. ఈ కారును పెట్రోల్ లేదా డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో కొనుగోలు చేయవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Scorpio N ex-showroom price) రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది.
హైదరాబాద్‌లో రేటు
మహీంద్రా స్కార్పియో N కొనడానికి ముందు, మీరు ఈ కారులో వేరియంట్ కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ముఖ్యం. దీనిలో బేస్ వేరియంట్ Z2 Petrol MT 7 STR (ESP) ను హైదరాబాద్‌లో కొనాలంటే... రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్ ధర (Mahindra Scorpio N on-road price) రూ. 17.60 లక్షలు అవుతుంది.
ఎంత లోన్ వస్తుంది?
ఈ పవర్‌ఫుల్ SUVని కొనడానికి మీరు రూ. 3.60 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 14 లక్షలు కార్ లోన్ రూపంలో లభిస్తుంది. ఈ లోన్ మీద బ్యాంక్ 9 శాతం వడ్డీ తీసుకుంటుందని అనుకుందాం. అసలు + వడ్డీని కలిపి EMIల రూపంలో బ్యాంక్‌కు కట్టేస్తే పెద్దగా భారం లేకుండానే లోన్ మొత్తం తీరిపోతుంది.
EMI ప్లాన్
7 సంవత్సరాల్లో లోన్ మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 22,525 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల్లో లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, నెలకు రూ. 25,236 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల రుణ కాల పరిమితి పెట్టుకుంటే, నెలకు రూ. 29,062 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేసే ఆప్షన్ ఎంచుకుంటే, నెలకు రూ. 34,839 EMI చెల్లించాలి.
కార్ లోన్, వార్షిక వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయగలిగితే, బ్యాంక్‌కు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం అంత తగ్గుతుంది.
ఏ EMI ప్లాన్ మీకు సూటవుతుంది?
మీ జీతం రూ. 60 వేల నుంచి రూ. 70 వేల మధ్యలో ఉండి, ఇతర EMIలు ఏవీ లేకపోతే, మీరు ఈ కారు కొనవచ్చు & 6 లేదా 7 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీకు జీతంతో పాటు ఇతర ఆదాయం కూడా ఉంటే, ఇంతకంటే తక్కువ లోన్ టెన్యూర్ (4 లేదా 5 సంవత్సరాలు) కూడా ఎంచుకోవచ్చు.
ఇంజిన్ ఎంపికలు
స్కార్పియో N 2.0L టర్బో-పెట్రోల్ & 2.2L డీజిల్ ఇంజిన్ ఎంపికలతో ఉంది.
డిజైన్
స్కార్పియో N టాల్ & బాక్సీ డిజైన్‌తో గంభీరంగా కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ & విశాలమైన క్యాబిన్ దీని అసెట్స్. అందుకే ఈ SUV అంటే జనాలకు పిచ్చి.
భద్రత
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్/డీసెంట్ కంట్రోల్, ABS, ESP & డ్రైవర్ డ్రిప్సీ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సాంకేతికత
స్కార్పియో N లో వైర్‌లెస్ కనెక్టివిటీతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి.





















