Royal Enfield Hunter 350 కొనాలని ఉందా? కేవలం ₹30,000తో ఇంటికి తెచ్చుకోండి! EMI వివరాలు, మైలేజ్ వివరాలు ఇవే!
Hunter 350 Finance Plan: మీరు రూ. 20,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తానికి బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. ఆ డబ్బును సులభమైన EMIల్లో తిరిగి చెల్లించవచ్చు.

Royal Enfield Hunter 350 Price, Down Payment Details: కాలేజ్ లేదా ఆఫీసుకు వెళ్లే కుర్రవాళ్ల కలల బండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. మీరు కూడా ఈ బ్రాండ్ మోటర్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, హంటర్ 350 బైక్ మీకు సరిగ్గా సరిపోవచ్చు. ఇది, ఈ కంపెనీ లాంచ్ చేసిన అత్యంత చౌకైన & అత్యంత పాపులారిటీ ఉన్న బైక్, ముఖ్యంగా యువ రైడర్లు చాలా ఇష్టపడతారు. మీ దగ్గర ఈ బండి కొనాలన్న కోరిక ఉన్నా కావలసినంత డబ్బు లేకపోతే, కేవలం 30,000 రూపాయలతో మీరు ఈ బైక్‌ను ఇంటికి తీసుకువెళ్లే ఉపాయం ఒకటి ఉంది.
హంటర్ 350 బైక్ ఆన్-రోడ్ ధర ఎంత?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 1.91 లక్షలు. ఈ మొత్తంలో... ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలు, RTO ఛార్జీలు దాదాపు రూ. 20,000, బీమా దాదాపు రూ. 13,000 &స్టాండర్డ్ యాక్ససరీస్, అదనపు వారంటీ వంటి ఇతర ఖర్చులు దాదాపు రూ. 9,000 కలిసి ఉంటాయి.
రూ. 20,000లకే కొనండి!
మీ దగ్గర 20,000 ఉంటే, షోరూమ్‌కు వెళ్లి ఈ డబ్బును డౌన్ పేమెంట్ చేయండి. అక్కడే ఉండే బ్యాంక్ ప్రతినిధులు, మిగిలిన మొత్తానికి అంటే 1.71 లక్షల రూపాయలకు రుణం ఇప్పిస్తారు. బ్యాంక్ మీకు 9% వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. ఇప్పుడు, EMI గణాంకాలు చూద్దాం...
4 సంవత్సరాల (48 నెలలు) కాలానికి బ్యాంక్ రుణం ఇచ్చిందని అనుకుంటే, మీ నెలవారీ EMI రూ. 4,845 ఉంటుంది.
3 సంవత్సరాల్లో (36 నెలలు) రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, మీరు నెలకు రూ. 6,033 EMI చెల్లించాలి.
2 సంవత్సరాల (24 నెలలు) లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు ప్రతినెలా రూ. 8,408 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
బ్యాంక్ మంజూరు చేసే రుణ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
రుస్తుం లాంటి బండి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లో 349cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ & ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 20.4 PS పవర్ & 27 Nm టార్క్‌ను ఇస్తుంది, మేలుజాతి గుర్రంలా పరుగులు తీస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ కారణంగా ఈ మోటార్ సైకిల్ నగర ట్రాఫిక్ & హైవేలు రెండింటిలోనూ మృదువైన & బలమైన పనితీరును అందించగలదు.
ఎంత మైలేజ్ ఇస్తుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మైలేజ్ లీటరుకు 36 కిలోమీటర్లుగా ARAI ధృవీకరించింది. దీనికి 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ ట్యాంకును పూర్తిగా నింపి కిక్ కొడితే, ఈ బైక్ దాదాపు 468 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఒక వ్యక్తి రోజూ 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం బైక్ నడుపుతాడు అనుకుంటే, ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మళ్ళీ 12 నుంచి 15 రోజుల వరకు పెట్రోల్ బంక్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదు.





















