Tata Punch EV EMI Plan: రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో టాటా పంచ్ EV కొంటే నెలకు ఎంత EMI కట్టాలి?
Tata Punch EV Finance Plan: పూర్తిగా ఛార్జ్ చేస్తే, టాటా పంచ్ EV 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ చెబుతోంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.

Tata Punch EV Price, Down Payment, Loan and EMI Details: గత కొన్ని సంవత్సరాలుగా, ప్రజలు ఇతర వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, దీంతో EVలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కార్ల తయారీ కంపెనీలు కొత్త ఫీచర్లు, మెరుగైన కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ఇదే కారణం. టాటా మోటార్స్ ఈ విభాగంలో చురుగ్గా పని చేస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ - టాటా పంచ్ EV. ఇది ఆర్థికంగా సౌలభ్యంగా ఉండడమే కాదు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతోనూ అదరగొడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ EV ఆన్-రోడ్ ధర ఎంత?
టాటా పంచ్ EV ఎక్స్-షోరూమ్ ధర 9,99,000 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర దాదాపు 10.51 లక్షల రూపాయలు. మీ దగ్గర కేవలం రూ. 51,000 డౌన్ పేమెంట్ ఉంటే చాలు, ఈ బెస్ట్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయవచ్చు. మీరు టాటా మోటార్స్ షోరూమ్‌కు వెళ్లి, ఈ డబ్బును డౌన్ పేమెంట్ చేయండి. అక్కడే ఉండే ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్, మిగిలిన డబ్బును (రూ. 10 లక్షలు) మీకు కార్ లోన్‌గా ఇప్పిస్తాడు. అంటే, మీ చేతి నుంచి వెళ్లేది కేవలం రూ. 51,000 అయితే, మీ చేతిలోకి వచ్చేది రూ. 10.51 లక్షల విలువైన టాటా పంచ్ EV కారు తాళాలు.
బ్యాంక్ మీకు ఇచ్చిన రూ. 10,00,000 లోన్ మీద ఏడాదికి 9% వడ్డీ తీసుకుంటుందని అనుకుందాం. ఇప్పుడు, మీరు నెలకు ఎంత EMI చెల్లించాలో లెక్కిద్దాం.
* 7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా ఈ రుణం తీసుకుంటే, మీరు నెలకు రూ. 16,089 EMI చొప్పున 84 వాయిదాలు చెల్లించాలి.
* 6 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకుంటే, నెలకు రూ. 18,026 EMI చొప్పున 72 వాయిదాలు చెల్లించాలి.
* 5 సంవత్సరాల లోన్ టెన్యూర్ కోసం మీరు నెలకు రూ. 20,758 EMI చొప్పున 60 వాయిదాలు చెల్లించాలి.
* 4 సంవత్సరాల్లో ఈ రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 24,885 EMI చొప్పున 48 వాయిదాలు చెల్లించాలి.
మీ జీతం రూ. 50,000 నుంచి రూ. 60,000 మధ్య ఉంటే, మీపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా, 6 లేదా 7 సంవత్సరాల కాలపరిమితతో లోన్ తీసుకోవచ్చు.
కార్ లోన్ మొత్తం, బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. నగరాలు & డీలర్‌షిప్‌లను బట్టి ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు.
టాటా పంచ్ EV ఫీచర్లు & ఇంజిన్ పవర్
టాటా పంచ్ EV, విద్యుత్ కోసం 25 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను AC ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు & DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ర్టిక్ కారు ఎక్కడా ఆగకుండా 315 కి.మీ. దూరం ప్రయాణించగలదని టాటా మోటార్స్ చెబుతోంది. అలాగే, టాటా పంచ్ EV ఆక్సిలేటర్ తొక్కితే గంటకు గరిష్టంగా 140 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. కంపెనీ డేటా ప్రకారం, 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి ఈ బండికి 9.5 సెకన్లు చాలు.





















