అన్వేషించండి

Vehicle RC download Online: వెహికల్ RC పోగొట్టుకున్నారా? ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా? 

Vehicle RC download Online:ఒక వెహికల్‌ ఎవరి పేరు మీద ఉందని చెప్పడానికి RC మాత్రమే అధికారిక ధ్రువీకరణ పత్రం. దీన్ని మీకు ప్రాంతీయ రవాణా కార్యాలయం జారీ చేస్తుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాహనం RC పోయినా, చిరిగినా ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు.
  • వాహన్ 4.0 ప్లాట్‌ఫామ్ ద్వారా RC డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • VAHAN పోర్టల్ లేదా DigiLocker ద్వారా RC డిజిటల్ కాపీ పొందండి.
  • RC అనేది వాహన యాజమాన్యాన్ని నిరూపించే చట్టబద్ధమైన పత్రం.

Vehicle RC download Online: మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోయినా, చిరిగిపోయినా లేదా అనుకోకుండా ఎక్కడైనా పడిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. గతంలో, ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి కొత్తదాని కోసం అప్లై చేయాల్సి వచ్చింది. కొత్త ఆర్సీ వచ్చేందుకు చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో మీరు ఆప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీ ఇంటి నుంచే మీ RC డిజిటల్ కాపీని కొన్ని నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి, మీ ఇంటి నుంచే మీ వెహికల్‌ RCని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో వివరిస్తాము. 

RC ఎందుకు అవసరం?

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) అనేది వెహికల్‌ మీ పేరు మీద రిజిస్టర్ ఉందని చెప్పడానికి అధికారిక పత్రం. ప్రాంతీయ రవాణా కార్యాలయం జారీ చేస్తుంది. వాహనానికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తుంది. ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, యజమాని పేరు , చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసినప్పుడు, బీమా క్లెయిమ్‌లు, వాహన అమ్మకాలు లేదా బ్యాంకు రుణాలు వంటి వివిధ పరిస్థితులకు RC అవసరం అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫిజికల్‌గా కానీ డిజిటల్ రూపంలో కానీ RC కలిగి ఉండటం చాలా అవసరం. DigiLocker, mParivahan వంటి ప్రభుత్వ యాప్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న RC కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. 

వెహికల్ 4.0 అంటే ఏమిటి?

వాహన్ 4.0 అనేది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది వాహన రిజిస్ట్రేషన్, సంబంధిత సేవలను సరళీకృతం,  ట్రాన్సపరెంట్‌ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ దేశవ్యాప్తంగా ఉన్న RTOల ఏకీకృత డేటాబేస్‌ను ఉపయోగిస్తుంది, వివిధ రాష్ట్రాల మధ్య వాహన సంబంధిత సమాచారాన్ని పంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్‌  బదిలీ, పన్ను చెల్లింపు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, హైపోథెకేషన్ సంబంధిత సేవలను ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు. RCల డిజిటల్ కాపీలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RC డిజిటల్ కాపీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? 

  • RC డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ VAHAN పోర్టల్‌కి వెళ్లండి.
  • దీని తర్వాత, ఆన్‌లైన్ సర్వీస్‌కి వెళ్లి, వాహన సంబంధిత సేవలపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వండి.
  • ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను నమోదు చేయండి.
  • తర్వాత డౌన్‌లోడ్ డాక్యుమెంట్ లేదా ఆర్‌సి ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి. 
  • దీని తర్వాత మీ RC స్క్రీన్‌పై కనిపిస్తుంది, దీనిని మీరు PDFగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిలాకర్ నుంచి కూడా ఆర్‌సిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

వాహన పోర్టల్ కాకుండా, మీరు డిజిలాకర్ నుంచి ఆర్‌సిని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
దీని కోసం, ముందుగా డిజిలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విభాగాన్ని ఎంచుకోండి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు వెళ్లి వాహన సమాచారాన్ని ఫిల్ చేయండి. డిజిలాకర్ ప్రొఫైల్‌లో నమోదు చేసిన పేరు, ఆర్‌సిలో నమోదు చేసిన పేరు సరిపోవాలి. దీని తర్వాత మీ డిజిటల్ RC జారీ చేసిన పత్రాల విభాగంలో కనిపిస్తుంది. ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.

Frequently Asked Questions

వాహనం RC పోయినా, చిరిగినా ఏమి చేయాలి?

RC పోయినా, చిరిగినా ఇప్పుడు మీరు ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మీ RC డిజిటల్ కాపీని కొన్ని నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RC ఎందుకు అవసరం?

RC అనేది వాహనం మీ పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పే అధికారిక పత్రం. ట్రాఫిక్ పోలీసులు, బీమా క్లెయిమ్‌లు, వాహన అమ్మకాలు వంటి వివిధ సందర్భాలలో ఇది అవసరం.

వాహన్ 4.0 అంటే ఏమిటి?

వాహన్ 4.0 అనేది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది వాహన రిజిస్ట్రేషన్, సంబంధిత సేవలను సులభతరం చేస్తుంది.

RC డిజిటల్ కాపీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

VAHAN పోర్టల్‌కి వెళ్లి, ఆన్‌లైన్ సర్వీస్‌లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో లాగిన్ అయి, RC ప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

DigiLocker నుంచి RC డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

అవును, DigiLocker యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విభాగాన్ని ఎంచుకుని RCని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget