అన్వేషించండి

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

హోండా ప్రీమియం వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త SUV, ZR-V హైబ్రిడ్‌ను భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2.0L స్పోర్ట్స్ హైబ్రిడ్ ఇంజిన్, 22.80 kmpl మైలేజీ, లగ్జరీ ఫీచర్స్‌తో దూసుకొచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా ZR-V హైబ్రిడ్ ప్రీమియం SUVని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
  • గత వైఫల్యాల నుండి నేర్చుకొని, భారతీయ అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది.
  • సిబియు (CBU) దిగుమతి ద్వారా ప్రీమియం ధరతో, అధునాతన ఫీచర్లతో వస్తుంది.
  • 2.0-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్, 184 PS పవర్, 22.80 kmpl మైలేజీతో వస్తుంది.

Honda ZR-V Hybrid India: భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో తనదైన గుర్తింపు ఉన్న హోండా కార్స్‌ ఇండియా, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్లాన్ వేసింది. ఈసారి ప్రీమియం కస్టమర్‌లను టార్గెట్ చేస్తూ ప్రీమియం ఎస్‌యూవీ, ZR-V హైబ్రిడ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో ప్లాన్ చేసిన గ్లోబల్- ఫస్ట్‌ వ్యూహం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఆలోచనలు మార్చుకుంది. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేసి మార్కెట్‌లో మరింతగా విస్తరించాలని చూస్తోంది. దీంతోపాటు అప్‌డేటెడ్‌ సిటీ సెడాన్‌ను కూడా రంగంలోకి దించింది.

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ఆ వ్యూహం దెబ్బతినడంతో మారిన తీరు

గ్లోబల్- ఫస్ట్‌ ఆలోచనలతో గతంలో చాలా వాహనాలను అంతర్జాతీ మోడల్స్‌తో పోటీ పడి ఇక్కడ మార్కెట్‌ను రూల్ చేద్దామని హోండా భావించింది. కానీ ఇక్కడి కస్టమర్‌లకు ఆకట్టుకోవడంలో మాత్రం ఆ ఆలోచన విఫలమైంది. ఇక్కడి పోటీని తట్టుకోలేకపోయాయి. అందుకే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్న హోండా ఇక్కడి కస్టమర్‌ మైండ్‌సెట్‌ను పూర్తిగా స్టడీ చేసింది. వారి ఆలోచనలతోపాటు ప్రాధాన్యతలను పసిగట్టింది. వాటిని బేస్ చేసుకొని ఇక్కడి వారి అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా ప్రీమియం విభాగంలో ZR-Vని తీసుకొచ్చింది. 

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ZR-V అంతర్జాతీయంగా 8 లక్షల యూనిట్లకుపైగా విక్రయించింది. ఇది అక్కడి మార్కెట్‌లో విజయవంతమైన కారుగా హోండా చెప్పుకుంటోంది. దీన్ని భారత్‌లో సిబియు (CBU - Completely Built Unit) రూపంలో దిగుమతి చేసుకొని అమ్మకాలు చేపట్టనుంది. దీని వల్ల ధర మాత్రం ప్రీమియంగా ఉంటుందని కంపెనీ ఇప్పటికే తేల్చి చెప్పింది.  

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

బుకింగ్స్ ప్రారంభం 

కొత్త హోండా ZR-V కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కార్ల డెలివరీ మాత్రం జూలై నెల నుంచి చేయనున్నట్టు హోండా కంపెనీ పేర్కొంది. కారు ఎలా ఉంటుంది ఫీచర్స్ ఏంటనే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ కారు ధర మాత్రం ఇంత వరకు రివీల్ చేయలేదు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. 

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

డిజైన్ అలా ఉందంటే... 

హోండా ZR-V డిజైన్ పరంగా చాలా విభిన్నంగా ఉంది. ఒక 'క్రాస్ఓవర్' శైలిలో కనిపిస్తుంది. వెడల్పైన గ్రాఫ్టెడ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ LED DRLలతో ఆకట్టుకుంటుంది. క్లామ్‌షెల్ బోనెట్ పైన హోండా లోగోను ఉంచారు. 19-అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, రౌండ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో స్లోపింగ్ రియర్ విండ్‌షీల్డ్, క్లియర్-లెన్స్ LED టెయిల్ ల్యాంప్స్, క్రోమ్-ప్లేటెడ్ ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ కారుకు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తాయి.

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ఈ SUV 4,568 mm పొడవు, 1,840 mm వెడల్పు, 1,620 mm ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,657 mm కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mmగా ఉంది. ఈ కారు ఇంటీరియర్ 'మినిమలిస్ట్' 'ప్రీమియం' థీమ్‌తో రూపొందించారు. డ్యాష్‌బోర్డ్‌ను కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ కలిగిన ప్లాస్టిక్ ట్రిమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ల బోస్ (Bose) ప్రీమియం ఆడియో సిస్టమ్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాయి. 

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ఈ కారు సెంటర్ కన్సోల్ 'ఎలివేటెడ్ బ్రిడ్జ్' డిజైన్‌తో ఉంది. సాంప్రదాయ గేర్ లివర్‌కు బదులుగా పుష్-బటన్ టైప్ సెలెక్టర్‌ను ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్,  వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. భద్రత విషయంలో హోండా రాజీ పడలేదు. ఇందులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్ (ADAS) టెక్నాలజీని అందించారు. హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. 

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ఇంజిన్ పనితీరు ,మైలేజీ  

హోండా ZR-Vలో భారత్‌లో మొట్టమొదటిసారిగా 2.0-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ స్పోర్ట్స్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఇది 184 PS పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని  అందుకోగలదు.

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

ఇంతటి శక్తివంతమైన ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది లీటరుకు 22.80 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇది eCVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ ఉన్నంత వరకు ఇది ఆటోమేటిక్‌ EV మోడ్‌లో డ్రైవ్ చేయవచ్చు. ఛార్జ్ తగ్గినప్పుడు పెట్రోల్ ఇంజిన్‌కు మారుతుంది. 

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!
 హోండా ZR-V హైబ్రిడ్, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొత్త చరిత్ర సృష్టించాలని ఆలోచనతో లాంచ్ అయ్యింది. అద్భుతమైన డిజైన్, లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్ కలయికతో ఇది భారతీయ కస్టమర్లను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Honda ZR-V Hybrid India: హోండా ZR-V హైబ్రిడ్ SUV ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే మైలేజీతో భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ! పూర్తి వివరాలు మీకోసం!

Frequently Asked Questions

కొత్త హోండా ZR-V హైబ్రిడ్ భారతదేశంలో ఎప్పుడు డెలివరీ చేయబడుతుంది?

కొత్త హోండా ZR-V హైబ్రిడ్ కార్ల డెలివరీ జూలై నెల నుంచి ప్రారంభం కానుంది.

హోండా ZR-V హైబ్రిడ్ ఏ ఇంజిన్‌తో వస్తుంది?

ఈ కారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2.0-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ స్పోర్ట్స్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 184 PS పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా ZR-V హైబ్రిడ్ ధర ఎంత?

కారు ధర గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.

హోండా ZR-V హైబ్రిడ్ మైలేజ్ ఎంత ఇస్తుంది?

ఈ శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్ కలిగిన కారు లీటరుకు 22.80 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget