అన్వేషించండి

Honda Shine లేదా Hero HF Deluxe రెండిటిలో ఏ బైక్ కొనడం బెటర్ ? ధర, మైలేజీ చూస్తే క్లారిటీ

మీరు Hero HF Deluxe లేదా Honda Shine లలో తక్కువ బడ్జెట్ బైకును, అధిక మైలేజీ బైకును ఎంచుకోవాలని చూస్తున్నారా. అయితే ఇంజిన్, మైలేజ్, ఫీచర్లలో ఏది మంచిదో పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే ప్రైవేట్ గా వెహికల్ ఉండాలని అంతా భావిస్తున్నారు. అది కారయినా కావొచ్చు. లేక బైక్, స్కూటీలు కావొచ్చు. తక్కువ బడ్జెట్‌లో రోజువారీ జర్నీ కోసం చవకైన, మంచి మైలేజీనిచ్చే, తక్కువ మెయింటనెన్స్ కలిగిన బైక్‌ను కొనాలని భావిస్తున్నారా.. అయితే మీకు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), లేక హోండా షైన్ 100 (Honda Shine 100) రూపంలో 2 ఛాయిస్ ఉన్నాయి. ఈ బైక్‌లు ముఖ్యంగా రోజువారీ ఆఫీసుకు, వ్యాపారానికి వెళ్లేవారు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ బైకులు 100cc విభాగంలో నమ్మదగ్గ కమ్యూటర్ బైక్‌లు, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ బైక్ ఫీచర్లు, పవర్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి. 

రెండు బైక్‌ల ధరలలో వ్యత్యాసం

Hero HF Deluxe ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,992 కు ప్రారంభం కాగా, రూ. 68,417 వరకు ఉంటుంది. Honda Shine 100 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 65,243 కాగా, టాప్ వేరియంట్ కోసం మీరు రూ. 71,511 వరకు ఖర్చు చేయాలి. అయితే ఇది కూడా ఎక్స్ షోరూమ్ ధర. కనుక ఆన్-రోడ్ ధర విషయానికి వస్తే, Hero HF Deluxe ఢిల్లీలో దాదాపు రూ. 69,000కి కస్టమర్ల చేతికి వస్తుంది. అయితే Honda Shine 100 దాదాపు రూ. 77,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹ 63,212 నుంచి ప్రారంభమై, వేరియంట్ బట్టి గరిష్టంగా హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో (HF DELUXE PRO) కోసం ₹ 69,234 గా నిర్ణయించారు. మీ బడ్జెట్ కాస్త తక్కువైతే Hero HF Deluxe కొనుగోలు చేయవచ్చు.

బైక్స్ ఇంజిన్, పనితీరు

Hero HF Deluxe 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. ఈ బైక్ 8.02 PS పవర్, 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. మరోవైపు Honda Shine 100 బైక్ 98.98cc ఇంజిన్‌తో వస్తోంది. ఈ బైక్ 7.38 PS పవర్, 8.05 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. Hero బైక్ కొంచెం ఎక్కువ పవర్‌ఫుల్. సిటీ ట్రాఫిక్‌లో మంచి పికప్‌తో సాగిపోవచ్చు. Honda Shine 100 ఇంజిన్ మరింత స్మూత్ గా ఉంటుంది. తక్కువ వైబ్రేషన్‌తో సాఫీగా డ్రైవింగ్ చేయవచ్చు. 

మైలేజ్, ఫీచర్లలో ఎవరు ముందున్నారు?

Hero HF Deluxe క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీ వెళ్తుంది. అయితే రియల్‌గా అయితే 60 నుంచి 65 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. Honda Shine 100 మైలేజ్ 55– 65 kmpl మధ్య ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, రెండింటిలోనూ ప్రైమరీ కమ్యూటర్ ఫీచర్లు ఉన్నాయి. అయితే Hero బైకులో i3S టెక్నాలజీ మైలేజీని పెంచడానికి పనికొస్తుంది. Honda లో CBS సేఫ్టీ ఫీచర్ స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. మీరు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ కోరుకుంటే మీకు Hero HF Deluxe బెస్ట్ ఛాయిస్. మీరు సాఫీగా నడిచే ఇంజిన్, Honda బ్రాండ్ నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారైతే Honda Shine 100 సీసీ బైక్ కొనుగోలు చేయవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget