Honda Electric Moped: హోండా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్, మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!
రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ మోపెడ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కాలుష్యరహిత వాహనాల పట్ల వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి.. తయారీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కార్లు, మోటార్‌సైకిళ్లు, సైకిళ్ల సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని వాహన తయారీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వినియోగదారుల నుంచి వస్తున్న భారీ స్పందనతో మరిన్న విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
యూరప్, ఆసియా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పెట్రో, గ్యాస్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చి చేరుతున్నాయి. వీటి మూలంగా కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, స్కూటర్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా భారీ స్థాయిలో వస్తూనే ఉన్నాయి. వీటి మూలంగా రానున్న రోజుల్లో పలు నగరాల్లో, పట్టణాల్లోని వీధులు నిశ్శబ్దంగా, శుభ్రంగా మారే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మోటరింగ్ పరిశ్రమలోని ప్రధాన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మార్కెటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హోండా కంపెనీ సైతం కీలక ప్రణాళికలు రూపొందిస్తున్నది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ విభాగంలో ప్రధానంగా మూడు రకాల వాహనాలను ఉత్పత్తి చేయాలని గుర్తించింది. ఇండియన్ ఆటోమోటివ్ పబ్లికేషన్ కార్ అండ్ బైక్ ప్రచురించిన ప్రత్యేక నివేదికలో హోండా మోటార్ సైకిల్స్ ఇండియా(HMSI) ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అట్సుషి ఒగాటా ఎలక్ట్రిక్ సెగ్మెంట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
హోండా కంపెనీ EB (ఎలక్ట్రిక్ బైక్), EM (ఎలక్ట్రిక్ మోపెడ్), EV (ఎలక్ట్రిక్ వెహికల్స్) కింద వాహనాలను విడుదల చేసే ప్రణాళికలను కలిగి ఉందని ఒగాటా తెలిపారు. హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ సెక్టార్ లో మంచి ప్రగతి సాధించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మోపెడ్ ICE స్పీక్‌కి అనువదించబడినప్పుడు 100cc నుంచి 125cc శ్రేణి కమ్యూటర్ స్కూటర్‌లకు సమానంగా ఉండబోతున్నట్లు తెలిపారు. హోండా ఏప్రిల్, 2023 నాటికి భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని కార్ అండ్ బైక్ నివేదిక వెల్లడించింది.
EVల విషయానికి వస్తే భారత మార్కెట్ కోసం హోండా భారీ ప్రణాళికలను రూపొందిస్తున్నది. అందులో భాగంగానే హోండా ఎలక్ట్రిక్ మోపెడ్‌ను ఆకట్టుకునే స్పెక్స్‌తో సరసమైన ధరకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మోపెడ్ మంచి ప్రజాదరణ పొందిన Ola S1, Ather 450X వంటి వాహనాలకు ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ మోపెడ్ తర్వాత హోండా హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే చైనాలో హోండా U-GO ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. భారత్ లో విడుదల చేసే మోపెడ్ U-GOలో కొన్ని మార్పులతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?