అన్వేషించండి

రూ.87,733కే Honda Dio 125 X ఎడిషన్‌ లాంచ్‌ - కొత్త పెయింట్‌, అదే పవర్‌

Honda Dio 125 X ఎడిషన్‌ మన మార్కెట్లో లాంచ్‌ అయింది. డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌, కొత్త డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్‌ ధర, ఫీచర్లు, వేరియంట్ల పోలిక పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Honda Dio 125 X Edition Price And Specifications: యువతను లక్ష్యంగా చేసుకుని, హోండా కంపెనీ, మరో స్టైలిష్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితమే వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేసిన ఈ స్కూటర్‌ను, ఇప్పుడు అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ Dio 125 X ఎడిషన్‌ను రూ.87,733 (ఎక్స్‌ షోరూమ్‌) ధరకు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త X ఎడిషన్‌, మెకానికల్‌గా స్టాండర్డ్‌ Dio 125తో పూర్తిగా ఒకేలా ఉన్నప్పటికీ, లుక్‌ పరంగా మాత్రం స్పెషల్‌గా రూపొందించారు. ముఖ్యంగా యువతకు నచ్చేలా డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ స్కీమ్‌ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

కొత్త లుక్‌ - అదే ఇంజిన్‌

Honda Dio 125 X ఎడిషన్‌కు బ్లూ - గ్రే కలర్‌ డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ స్కీమ్ ఇచ్చారు. దీనికి తోడు కాంట్రాస్టింగ్‌ రెడ్‌ కలర్‌ అలాయ్‌ వీల్స్ స్కూటర్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. ఇప్పటికే ఉన్న Dio 125తో పోలిస్తే ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మెకానికల్‌గా చూస్తే, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో కూడా, స్టాండర్డ్‌ Dio 125లో ఉన్న అదే 123.9cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.3 హెచ్‌పీ పవర్‌, 10.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు సరిపడేలా ఈ ఇంజిన్‌ను ట్యూన్‌ చేశారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఫీచర్ల విషయానికి వస్తే, Dio 125 X ఎడిషన్‌ స్టాండర్డ్‌ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో TFT డిస్‌ప్లే ఉంది. అయితే, చాలా మంది ఆశించే బ్లూటూత్‌ కనెక్టివిటీ మాత్రం ఇందులో లేదు. కాల్‌ అలర్ట్స్‌, నోటిఫికేషన్స్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు కేవలం టాప్‌ వేరియంట్‌ అయిన Dio 125 H-Smartలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అలాగే, X ఎడిషన్‌లో కీ లెస్‌ ఇగ్నిషన్‌ వంటి ఫీచర్‌ కూడా ఇవ్వలేదు. ఈ కారణంగానే ఇది H-Smart వేరియంట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తోంది.

ధర & వేరియంట్ల పోలిక

ధర విషయానికి వస్తే, Dio 125 X ఎడిషన్‌ స్టాండర్డ్‌ వేరియంట్‌తో పోలిస్తే రూ.1,000 ఎక్కువ. అయితే, టాప్‌ వేరియంట్‌ అయిన Dio 125 H-Smart‌తో పోలిస్తే రూ.3,950 తక్కువ ధరలో లభిస్తోంది. అంటే, స్టైల్‌ కావాలి కానీ అదనపు టెక్‌ ఫీచర్లు అవసరం లేదనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

పోటీలో ఏయే స్కూటర్లు ఉన్నాయి?

మన మార్కెట్లో Honda Dio 125కు గట్టి పోటీ ఉంది. ఇది TVS Ntorq 125, Suzuki Avenis, Yamaha RayZR 125 Hybrid, Hero Xoom 125 వంటి పాపులర్‌ స్కూటర్లతో పోటీపడుతోంది. స్పోర్టీ లుక్‌, హోండా బ్రాండ్‌ నమ్మకంతో Dio 125 X ఎడిషన్‌ ఈ సెగ్మెంట్‌లో మంచి స్పందన పొందే అవకాశాలు ఉన్నాయి.

చివరగా... స్టైల్‌, నమ్మకమైన ఇంజిన్‌, హోండా బ్రాండ్‌ కావాలనుకునే యువతకు, లేడీస్‌కు Honda Dio 125 X ఎడిషన్‌ ఒక మంచి ఎంపిక. మెకానికల్‌ మార్పులు లేకపోయినా, కొత్త లుక్‌తో ఇది షోరూమ్‌లో ప్రత్యేకంగా కనిపించనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Italjet Scooters: ఇండియన్ మార్కెట్లోకి 3 ఇటాల్‌జెట్‌ స్కూటర్లు.. బ్రెంబో బ్రేక్స్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో రంగప్రవేశం!
భారత్‌లోకి పవర్‌ఫుల్ ఇటలీ స్కూటర్లు.. 700cc భారీ ఇంజిన్‌తో రచ్చ చేయనున్న డ్రాగ్‌స్టర్
Off-road SUVs: ఆఫ్‌రోడింగ్‌ ఎస్‌యూవీల కోసం భారీగా ఖర్చు పెట్టే పనే లేదు! రూ.12.59 లక్షల నుంచే 5 సూపర్‌ మోడళ్లు!
వరదైనా, బురదైనా, రాళ్ల దారైనా.. ఈజీగా దూసుకెళ్లే 5 SUVలు, రూ.12.59 లక్షల నుంచే!
పెట్రోల్ పవర్‌తో CNG మైలేజీ! Mahindra XUV 3XO CNGలో ఇన్ని ప్రత్యేకతలా? బుక్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
CNGలోనూ టర్బో పవర్! మహీంద్రా XUV 3XO ZNG కొనే ముందు మీకు తెలియాల్సిన విషయాలు!
Volkswagen Virtus Facelift టీజర్ లాంచ్‌.. LED లైట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో అదిరిపోయే డిజైన్!
Volkswagen Virtus Facelift టీజర్‌ వచ్చేసింది బ్రో.. లుక్‌ అదిరిపోలా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Dolis For Vote: రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
రోడ్డు కోసం గిరిజనుల ఓటు పోరాటం.. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేసిన 18 మంది ఓటర్లు!
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Embed widget